iDreamPost

Group-2 పరీక్ష రాసే అభ్యర్థులకు SBI గుడ్ న్యూస్.. అదేంటంటే?

ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 2 ప్రిలిమ్స్ నిర్వహణకు ఏపీపీఎస్సీ రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష రాసే అభ్యర్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్తను అందించింది.

ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 2 ప్రిలిమ్స్ నిర్వహణకు ఏపీపీఎస్సీ రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష రాసే అభ్యర్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్తను అందించింది.

Group-2 పరీక్ష రాసే అభ్యర్థులకు SBI గుడ్ న్యూస్.. అదేంటంటే?

ఆంధ్రప్రదేశ్ లో గతేడాది డిసెంబర్ లో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా పలు ప్రభుత్వ శాఖల్లోని 899 ఉద్యోగాలను భర్తీ చేయనున్నది ప్రభుత్వం. ఇక ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు అదే రోజున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ మెయిన్ పరీక్ష కూడా జరుగబోతోంది. అయితే ఈ రెండు ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్ష రాసే అభ్యర్థులకు ఎస్బీఐ శుభవార్తను అందించింది. ఫిబ్రవరి 25న గ్రూప్ 2 పరీక్ష రాసే అభ్యర్థులు ఎస్బీఐ క్లర్క్ పరీక్ష తేదీని మార్చుకునేందుకు వీలు కల్పించింది.

ఫిబ్రవరి 25న గ్రూప్-2 పరీక్ష రాసే అభ్యర్థులు మార్చి 4న ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తూ ప్రకటించింది. పరీక్ష తేదీని మార్చుకునేందుకు లింక్ ను ఎస్బీఐ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. మార్చి 4న ఎస్‌బీఐ మెయిన్స్ పరీక్ష రాయాలనుకొనే అభ్యర్థులు ఫిబ్రవరి 23న ఉదయం 9 గంటల లోపు సంబంధిత లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. అయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ తేదీని ఫిక్స్ చేసే సమయంలో జాతీయ స్థాయి పరీక్షలను గానీ, ఎస్బీఐ క్లర్క్ మెయిన్ పరీక్ష్ తేదీని పరిగణనలోకి తీసుకోలేదు. అయితే ఈ రెండు పరీక్షలు ఒకే రోజు ఉండనుండడంతో ఉద్యోగార్థులు నిరాశకు లోనయ్యారు.

ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీపీఎస్సీ ఎస్బీఐకి లేఖ రాసింది. దీనిపై సానుకూలంగా స్పందించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి 4న క్లర్క్ మెయిన్ పరీక్షను నిర్వహించేందుకు నిర్ణయించి అభ్యర్థులు ఆ తేదీకి మార్చుకునేందుకు వీలు కల్పించింది. ఇదిలా ఉంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ కు, ప్రిలిమ్స్ తేదీకి మధ్య ఇచ్చిన సమయం తక్కువగా ఉండడంతో ప్రిలిమ్స్ పరీక్ష తేదీని వాయిదా వేయాలని గ్రూప్ 2 అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి