iDreamPost

Ayodhya:ప్రాణప్రతిష్ట మరుసటిరోజే పోటెత్తిన భక్తులు! ఒక్కసారిగా తొక్కిసలాట!

  • Published Jan 23, 2024 | 12:04 PMUpdated Jan 23, 2024 | 12:04 PM

యావత్ దేశం రామ నామంతో మారుమోగుపోయింది. ఎన్నో దశబ్ధాల సుధీర్ఘ నిరీక్షణతో..అయోధ్యలో భవ్య రామ మందిరం కల సాకారం అయింది. ఎంతో కన్నుల పండుగగా ఆ బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిన్న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగింది. నేటి నుంచి సామాన్య భక్తుల రాములవారిని దర్శించుకునుటకు నిర్వాహకులు అనుమతించడంతో భక్తులంతా ఆ సమయం నుంచే వేచి ఉండటంతో అంతా ఆశ్చర్యపోయారు.

ఏ వైపు చూసిన రామమయం.. ఏ నోట విన్న రామ నామంతో యావత్ దేశం మారుమోగుపోయింది. ఎన్నో దశబ్ధాల సుధీర్ఘ నిరీక్షణతో.. మరెంతో మంది పోరాటలతో వెరసి అయోధ్యలో భవ్య రామ మందిరం కల సాకారం అయింది. ఎంతో కన్నుల పండుగగా ఆ బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకను దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమన్ని ముందుగా నిర్ణయించిన అభిజిత్ లగ్నంలో వేదపండితుల, వేద మంత్రల సాక్షిగా ఆ కొదాండ రాముడు తన జన్మ స్థానంలో కొలువైనాడు. ఈ అద్భుతమైన క్షణాల కోసం ఎంతో మంది హిందువులు వేయి కళ్లతో ఎదురు చూసారు. ఈ వేడుకను ప్రత్యేక్ష ప్రసారంగా విక్షించిన రామ భక్తులు ఆ బాల రాముని దివ్య తేజస్సు ను చూసి పులకరించిపోయారు. నిన్నటితో ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు ముగిసాయి. ఇదిలా ఉంటే.. నేటి నుంచి సామాన్య భక్తుల రాములవారిని దర్శించుకునుటకు నిర్వాహకులు అనుమతిస్తున్నారు. దీంతో అయోధ్యలో ఆ సమయం నుంచే భక్తులు తండోపతండాలుగా వేచి ఉన్నారు. దాంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.

అయోధ్య మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట కార్యక్రమం ముగిసింది. దేశమంతా పండగ వాతావరణం నెలకొంది. నిన్న కేవలం సెలబ్రిటీలకు మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. నేడు అనగా జనవరి 23, మంగళవారం నుంచి భక్తులు దర్శనం చేసుకునే వీలు కల్పించారు. దాంతో తొలి రోజు దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఒక్కసారిగా తొక్కిసిలాట చోటు చేసుకుంది. ఒకరి మీద ఒకరు పడుతూ తోసుకుంటూ దర్శనం కోసం వెళ్లారు భక్తులు.

ఉదయం మూడు గంటల నుంచే రామాలయ ప్రధాన ద్వారం వద్ద భక్తులు భారీ సంఖ్యలో బారులు తీశారు. ఆ బాల రాముడి నూతన విగ్రహాన్ని సాక్ష్యత్తుగా దర్శించుకునుటకు ఎంతో అత్రుతగా అయోధ్యకు తరలి వెళ్లారు. కాగా, ఉదయం ఏడు గంటల నుంచే భక్తుల్ని ఆలయ నిర్శాహకులు లోపలికి వెళ్లుటకు అనుమతిస్తున్నారు. మరోవైపు ఆలయం బయట భక్తుల రద్దీ భారీగా కనిపించడంతో.. అవసరమైతే స్వామివారి దర్శన సమయాన్ని పొడిగించాలని అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది.

ఇక ఈ రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రధానితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి రాజకీయ నాయకులు, టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రీటిలతో పాటు క్రీడారంగం నుంచి క్రికెటర్స్ కూడా హాజరయ్యారు. అంతేకాకుండా వేలాది మంది సాధువులు కూడా ఆ స్వామి వారిని దర్శించుకొనుటకు అయోధ్యకు చేరుకున్నారు. మరి, మొదటిరోజు నుంచే అయోధ్యలో భక్తులతో రద్దీగా తొక్కిసలాట పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి