iDreamPost

నీరజ్ చోప్రా గోల్డు మెడ‌ల్ నుంచి ముర్ము ప్రెసిడెంట్ అభ్య‌ర్ధిత్వం వ‌ర‌కు, అన్నింటినీ ఊహించిన వ్య‌క్తి తెలుసా?

నీరజ్ చోప్రా గోల్డు మెడ‌ల్ నుంచి ముర్ము ప్రెసిడెంట్ అభ్య‌ర్ధిత్వం వ‌ర‌కు, అన్నింటినీ ఊహించిన వ్య‌క్తి తెలుసా?

బీజేపీ నాయ‌కత్వంలోని ఎన్డీయే త‌న రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించిన వెంట‌నే కొంద‌రు మాకు ముందే తెలుసు అనేశారు. అంటే బీజేపీ వ‌ర్గాలు వాళ్ల‌కేం ఇన్ఫ‌ర్మేష‌న్ ఇవ్వ‌లేదు. నితీక్ష్ శ్రీవాస్తవ అంతుకుముందే చేసిన‌ ట్వీట్ వెలుగులోకి రావడంతో, సోషల్ మీడియా అవాక్క‌య్యింది. కొత్త‌వాళ్ల‌కు ఆశ్చ‌ర్య‌మేకాని, అత‌న్ని ఫాలో అవుతున్న‌వాళ్ల‌కు ఇది మామూలే. ఒక‌టికాదు రెండు కాదు. అత‌ని అంచ‌నాల‌న్నీ క‌రెక్ట్ అవుతున్నాయి. అందుకే అత‌న్ని మెడ‌ర్న్ ఆస్ట్రాల‌జ‌ర్ గా పిలుస్తున్నారు.

నీర‌జ్ చోప్రాకు గోల్డ్ వ‌స్తుందని అత‌ను చెప్పాడు. ఒలింపిక్ ఫైనల్స్ ముందుకాదు, టోక్యో గేమ్స్ కు రెండేళ్ల‌కు ముందే. అంతెందుకు, 2017లో, రాష్ట్రపతి ఎన్నికల వేళ శ్రీవాస్తవ ఒక‌ పోల్‌లో పాల్గొన్నాడు. అక్క‌డిచ్చిన ఆప్ష‌న్స్ లో కోవింద్ పేరు లేదు. ఆయ‌న మాత్రం వీరెవ్వ‌రూ కాదు, రామ్ నాథ్ కోవింద్, బిజెపి అభ్యర్థిగా అంచనా వేశారు. మీరు న‌మ్మ‌డంలేదా? అందుకే రుజువుగా శ్రీవాస్తవ స్క్రీన్‌షాట్‌లు ఇచ్చాడు.


2018 ఆగస్టులో, నీరజ్ చోప్రా భారతదేశానికి ఒలింపిక్ పతకాన్ని గెలుస్తానని శ్రీవాస్తవ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అత‌ను అంచ‌నా నిజ‌మైంది. 2021లో, టోక్యోలో జరిగిన పురుషుల జావెలిన్ ఈవెంట్‌లో చోప్రా అథ్లెటిక్స్‌లో భారతదేశం తొలి ఒలింపిక్ స్వర్ణాన్ని గెలుచుకుంది.

2016లో, రామ్ నాథ్ కోవింద్ భారతదేశ తదుపరి రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉందని శ్రీవాస్తవ ట్వీట్ చేశారు. రామ్ నాథ్ కోవింద్ 2017లో భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.

కొద్దిరోజుల క్రితం శ్రీవాస్తవ ఇంకో ట్వీట్ చేశారు. ద్రౌపది ముర్ము భారతదేశానికి తదుపరి రాష్ట్రపతి అని ట్వీట్ చేశారు. జ‌రిగ‌బోయేది అదేగా? మ‌రి శ్రీవాస్తవకు మీరు ఏం పేరుపెడ‌తారు? విశ్లేష‌కుడు అంటారా? కాదు జ్యోతిష్యుడ‌ని చెబుతారా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి