iDreamPost

సన్​రైజర్స్ హెడ్ ​కోచ్​గా వీరేంద్ర సెహ్వాగ్? ఇక హైదరాబాద్​కు తిరుగుండదు!

  • Author singhj Published - 05:46 PM, Fri - 21 July 23
  • Author singhj Published - 05:46 PM, Fri - 21 July 23
సన్​రైజర్స్ హెడ్ ​కోచ్​గా వీరేంద్ర సెహ్వాగ్? ఇక హైదరాబాద్​కు తిరుగుండదు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్స్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ ఒకటి. ఉభయ తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు మెగా టోర్నీలో ఈ జట్టును ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. ఎస్​ఆర్​హెచ్​ గెలవాలని దృఢంగా కోరుకుంటున్నారు. అయితే గత కొన్ని సీజన్లుగా ఈ టీమ్ మాత్రం ఫ్యాన్స్​ను తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఐపీఎల్​లో ఎస్​ఆర్​హెచ్​ అడుగుపెట్టి పదేళ్లు పూర్తయింది. అయితే దశాబ్ద కాలంలో రైజర్స్ ఒక్కసారే కప్​ను గెలుచుకుంది. 2016లో ట్రోఫీని నెగ్గిన ఆరెంజ్ ఆర్మీ.. 2018లో రన్నరప్​గా నిలిచింది. 2013, 2017, 2019, 2020ల్లో ప్లేఆఫ్స్​ దశకు చేరుకుంది. కానీ గత మూడు సీజన్లుగా మాత్రం ఘోరంగా ఆడుతోంది.

గత మూడు సీజన్లలో ఎస్​ఆర్​హెచ్​ కనీసం లీగ్ దశను కూడా దాటలేకపోయింది. ఈ ఏడాది అయితే టేబుల్​లో కింది నుంచి అగ్రస్థానంలో నిలిచి పరువు పోగొట్టుకుంది. కప్​పై ఫ్యాన్స్ పెట్టుకున్న గంపెడాశల్ని నీరుగార్చింది. ఇందులో ప్లేయర్ల ఆటతీరుతో పాటు జట్టు మేనేజ్​మెంట్​ను కూడా తప్పుబట్టక తప్పదు. అందుకే టీమ్ హెడ్​ కోచ్ బ్రియాన్ లారా తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. లారాలో అస్సలు సీరియస్​నెస్ కనిపించడం లేదని ఫ్యాన్స్ అంటున్నారు. ఎస్​ఆర్​హెచ్ మ్యాచ్ ఓడిపోయినా లారా నవ్వుతూ కనిపించిన దృశ్యాలు ఈ ఐపీఎల్​ టైమ్​లో బాగా వైరల్ అయ్యాయి. వరుస ఓటములు ఎదురైనా లారా ఏమీ చేయలేకపోవడంతో ఎస్​ఆర్​హెచ్​ యాజమాన్యం అతడిపై గుర్రుగా ఉందని తెలుస్తోంది.

ఐపీఎల్​-2024 సీజన్​కు ముందు టీమ్ మొత్తాన్ని మరోమారు ప్రక్షాళన చేయాలని సన్​రైజర్స్ భావిస్తోందట. అందులో భాగంగానే హెడ్ కోచ్ లారా మీద కూడా వేటు వేయనున్నట్లు క్రికెట్ వర్గాల సమాచారం. మరోవైపు వెస్టిండీస్ క్రికెట్​ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్న లారా.. ఎస్​ఆర్​హెచ్​ కోచింగ్​పై అంతగా మొగ్గుచూపడం లేదని వార్తలు వస్తున్నాయి. దీంతో అతడి ప్లేసులో హెడ్ కోచ్ పదవికి టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్​ను తీసుకోవాలని సన్​రైజర్స్ ఫిక్స్ అయిందట. ఈ మేరకు వీరూను ఎస్​ఆర్​హెచ్​ యాజమాన్యం సంప్రదించిందట. సెహ్వాగ్ నుంచి సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. వీరూ కోచ్​గా వస్తే ఎస్ఆర్​హెచ్​కు తిరుగుండదని ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే, గతంలో పంజాబ్ కింగ్స్​ మెంటార్​గా నాలుగు సీజన్ల పాటు సెహ్వాగ్ పనిచేశాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి