iDreamPost

రాహుల్ ద్రవిడ్‌కి అబద్ధాలు చెప్పా! తప్పు ఒప్పుకున్న శ్రీశాంత్!

  • Published Oct 26, 2023 | 6:58 PMUpdated Oct 26, 2023 | 6:58 PM

టీమిండియా హెడ్‌ కోచ్‌, టీమిండియా మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో టీమిండియా మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌ ఓ అబద్ధం చెప్పాడంటా.. అప్పుడు చేసిన తప్పును ఇప్పుడు ఒప్పుకున్నాడు శ్రీశాంత్‌. అయితే.. అసలు శ్రీశాంత్‌ అబద్ధం ఎందుకు చెప్పాడు? ఎవరి కోసం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా హెడ్‌ కోచ్‌, టీమిండియా మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో టీమిండియా మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌ ఓ అబద్ధం చెప్పాడంటా.. అప్పుడు చేసిన తప్పును ఇప్పుడు ఒప్పుకున్నాడు శ్రీశాంత్‌. అయితే.. అసలు శ్రీశాంత్‌ అబద్ధం ఎందుకు చెప్పాడు? ఎవరి కోసం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Oct 26, 2023 | 6:58 PMUpdated Oct 26, 2023 | 6:58 PM
రాహుల్ ద్రవిడ్‌కి అబద్ధాలు చెప్పా! తప్పు ఒప్పుకున్న శ్రీశాంత్!

శ్రీశాంత్‌.. భారత క్రికెట్‌లో మోస్ట్‌ అగ్రెసివ్‌ బౌలర్‌. తన బౌలింగ్‌తోనే కాదు అన యాటిట్యూడ్‌తో కూడా ఫ్యాన్స్‌ని సంపాదించుకున్న క్రికెటర్‌. కానీ, ఐపీఎల్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో నిషేధం ఎదుర్కొన్నాడు. 2007 టీ20 వరల్డ్‌ కప్‌, 2011 వన్డే వరల్డ్‌ కప్‌ నెగ్గిన టీమ్‌లో సభ్యుడు కూడా. అద్భుతమైన బంతులతో ఆస్ట్రేలియా బ్యాటర్లను వణికించేవాడు శ్రీశాంత్‌. అలాంటి ఆటగాడు.. టీమిండియా మాజీ క్రికెటర్‌, ప్రస్తుతం టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కి ఓ పెద్ద అబద్ధం చెప్పినట్లు నిజం ఒప్పుకున్నాడు. అది కూడా ఓ క్రికెటర్‌ విషయంలో. అతను కూడా అందరికి తెలిసిన స్టార్‌ క్రికెటరే. మరెవరో కాదు.. సంజు శాంసన్‌.

మంచి టాలెంట్‌ ఉన్నా.. పెద్దగా సక్సెస్‌ కాలేకపోతున్న క్రికెటర్‌ ఎవరంటే సంజు శాంసన్‌. చాలా సార్లు అవకాశాలు ఇచ్చినా కూడా సంజు పెద్దగా రాణించలేదు. దీంతో 2015లోనే టీమిండియా తరఫున అరంగేట్రం చేసి, అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చినా.. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఐసీసీ మ్యాచ్‌ ఆడలేదు. అతను క్రికెట్‌లోకి వచ్చిన తర్వాత 2019 వన్డే వరల్డ్‌ కప్‌, 2021, 2022 టీ20 వరల్డ్‌ కప్‌లు జరిగాయి.. ఇప్పుడు 2023 వరల్డ్‌ కప్‌ సైతం జరుగుతోంది. కానీ, ఎందులోనూ ఆడే అవకాశం రాలేదు. నిలకడకా ఆడింది లేదు, టీమ్‌లో నిలకడగా చోటు దక్కింది లేదు. సంజు టీమ్‌లో లేకపోవడాన్ని ఇటు సంజు తప్పుగా అలాగే సెలెక్టర్ల తప్పు కూడా చూడాలి. సంజు విషయం అటుంచితే.. అసలు సంజు గురించి శ్రీశాంత్‌ ఎందుకు ద్రవిడ్‌తో అబద్ధం చెప్పాడో చూద్దాం.

శ్రీశాంత్‌, సంజు శాంసన్‌ ఇద్దరూ కేరళకు చెందిన క్రికెటర్లే. అయితే.. తన స్టేట్‌ నుంచి మరో క్రికెటర్‌ ఎదుగుతున్నాడని తెలిసి.. శ్రీశాంత్‌ సైతం తనకు హెల్ప్‌ చేయాలనున్నాడు. రాహుల్‌ ద్రవిడ్‌ అండర్‌ 19 జట్టుకు కోచ్‌గా ఉన్న సమయంలో.. అండర్‌ 19 టీమ్‌లోకి సంజు శాంసన్‌ను తీసుకునేలా ద్రవిడ్‌ దగ్గర సంజు ప్రస్తావన తెచ్చాడంటా శ్రీశాంత్‌. ఆ సమయంలో ద్రవిడ్‌తో మాట్లాడుతూ.. సంజు శాంసన్‌ అనే కుర్రాడు తన బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టినట్లు చెప్పాడంటా.. కానీ, ద్రవిడ్‌.. శ్రీశాంత్‌ మాటలు నమ్మలేదంటా. ఇదే ద్రవిడ్‌కి శ్రీశాంత చెప్పిన అబద్ధం. సంజును అండర్‌ 19 టీమ్‌లోకి వచ్చేలా చేసేందుకు శ్రీశాంత్‌.. ఆ విధంగా ద్రవిడ్‌కి అబద్ధం చెప్పాడంటా.. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి