iDreamPost

యావరేజ్ మూవీకి ప్రీక్వెల్​ తీస్తానంటున్న శ్రీవిష్ణు! ఇంత సాహసం అవసరమా?

  • Author singhj Published - 08:31 PM, Wed - 12 July 23
  • Author singhj Published - 08:31 PM, Wed - 12 July 23
యావరేజ్ మూవీకి ప్రీక్వెల్​ తీస్తానంటున్న శ్రీవిష్ణు! ఇంత సాహసం అవసరమా?

ప్రస్తుత టాలీవుడ్ యంగ్ హీరోల్లో శ్రీవిష్ణు శైలి కాస్త వైవిధ్యమనే చెప్పాలి. కామెడీ మూవీస్​కు ఆయన పెద్దపీట వేస్తుంటారు. మిగతా హీరోల్లా కాకుండా ఆయన తనదైన రూట్​లో ప్రయాణిస్తున్నారు. కథకు అధిక ప్రాధాన్యమిచ్చే శ్రీవిష్ణు.. అవసరమైతే తన పాత్ర పరిధి తక్కువున్నా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటారు. మంచి స్టోరీస్​ను ఆడియెన్స్​ను చెప్పాలనే తాపత్రయం ఆయనలో ఎక్కువగా కనిపిస్తుంది. శ్రీవిష్ణు నటించిన సినిమాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. అలాంటి ఈ యంగ్ హీరోకు ఈమధ్య టైమ్ కలసిరాలేదు. ‘బ్రోచేవారెవరురా’ లాంటి సాలిడ్ హిట్​తో అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకున్నారు శ్రీవిష్ణు. కానీ ఆ తర్వాత యాక్ట్ చేసిన మూవీస్​ మాత్రం పెద్దగా ఆడలేదు.

మంచి ఎక్స్​పెక్టేషన్స్​తో రిలీజైన ‘రాజ రాజ చోర’ యావరేజీగా నిలిచింది. కానీ ఆ తర్వాత చేసిన ‘అర్జున ఫాల్గుణ’, ‘భలా తందనాన’, ‘అల్లూరి’ చిత్రాలు ఫ్లాపులుగా నిలిచాయి. యాక్షన్ ఇమేజ్​ కోసం ప్రయత్నిస్తూ చేసిన ‘అల్లూరి’ రిజల్ట్ శ్రీవిష్ణును దారుణంగా నిరాశపర్చింది. దీంతో ఆయనకు ఒక హిట్ తప్పనిసరిగా మారింది. కసి మీదున్న శ్రీవిష్ణు ‘సామజవరగమన’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 12 రోజుల్లోనే రూ.40 కోట్లకు పైగా గ్రాస్​తో డబుల్ బ్లాక్ బస్టర్​గా నిలిచింది. ఈ హీరో కెరీర్​లో మెమరబుల్​ హిట్​గా గుర్తుండిపోయింది. ‘సామజవరగమన’ థియేటర్లలో ఇంకా హిట్​ రన్​ను కొనసాగిస్తోంది. ఈ విజయం ఇచ్చిన జోష్​లో ఉన్న శ్రీవిష్ణు తన తర్వాతి ప్రాజెక్టుపై ఫోకస్ పెడుతున్నారు.

ఈసారి ప్రీక్వెల్​ మూవీకి శ్రీవిష్ణు ప్లాన్ చేస్తున్నారట. తాను గతంలో నటించిన ‘రాజ రాజ చోర’ చిత్రం ప్రీక్వెల్​కు ఈ హీరో ఓకే చెప్పారని సమాచారం. ఈ ప్రీక్వెల్​ చిత్రానికి ‘స్వాగ్’ అనే టైటిల్​ను అనుకుంటున్నారని.. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని టాక్. ఈ ఫిల్మ్​ను త్వరలో పట్టాలెక్కించాలని అనుకుంటున్నారట. షూటింగ్​ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి.. ఈ ఏడాదే రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అయితే యావరేజీగా నిలిచిన ‘రాజ రాజ చోర’కు ప్రీక్వెల్ అవసరమా అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రేక్షకుల్లో పెద్దగా బజ్​ లేని ఆ సినిమాకు ప్రీక్వెల్ చేయడం అంటే సాహసమేనని నెటిజన్స్ అంటున్నారు. ‘సామజవరగమన’ హిట్​తో మంచి ఊపు మీదున్న శ్రీవిష్ణు ఏం చేస్తారో చూడాలి. మరి.. ‘రాజ రాజ చోర’ ప్రీక్వెల్ తెరకెక్కాలని మీరు భావిస్తున్నారా? దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి