iDreamPost

Spider Man : హాట్ కేకుల్లా హాలీవుడ్ సినిమా టికెట్లు

Spider Man : హాట్ కేకుల్లా హాలీవుడ్ సినిమా టికెట్లు

వచ్చే వారం 16న విడుదల కాబోతున్న స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మీద బజ్ మాములుగా లేదు. ఒక్క రోజు గ్యాప్ తో పుష్ప వస్తున్నా కూడా బుకింగ్స్ జోరుగా ఉన్నాయి. హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ లో పెట్టిన 24 షోలు దాదాపు హౌస్ ఫుల్ అయిపోయాయి. గచ్చిబౌలిలో ఉన్న ప్లాటినం సినిమా మల్టీ ప్లెక్స్ లో ఉదయం 7 గంటల షోతో సహా అన్ని టికెట్లు అమ్ముడయ్యాయి. ఇంకా తెలుగు వెర్షన్ బుకింగ్ పూర్తి స్థాయిలో మొదలుకాలేదు. కేరళ, తమిళనాడులో ఉదయం 5కే ప్రీమియర్లు స్టార్ట్ అవుతున్నాయి. ఏదో రజనీకాంత్ చిరంజీవి రేంజ్ లో ఇలా బెనిఫిట్ షోలు వేయడం చూస్తే తెలుగు రాష్ట్రాల్లో స్పైడర్ మ్యాన్ మేనియా ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది.

అక్కడే కాదు వైజాగ్, విజయవాడ, కర్నూలు లాంటి అన్ని చోట్లా ఇంచుమించు ఇదే పరిస్థితి తలెత్తే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికాలో ఇప్పటికే అడ్వాన్స్ రికార్డులు సృష్టిస్తున్న స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ అక్కడ 17న రిలీజవుతుంది. ఇండియా లాంటి కొన్ని దేశాల్లో మాత్రమే వన్ డే బిఫోర్ ప్లాన్ చేశారు. పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్కెచ్చులు వేసుకున్న పుష్పకు స్పైడర్ మ్యాన్ గట్టి అడ్డంకి కాబోతున్నాడు. ముఖ్యంగా అర్బన్ ఆడియన్స్, యూత్, చిన్నపిల్లలు సాలెగూడు మనిషి కోసం తహతహలాడిపోతున్నారు. ఫస్ట్ డేనే చూడాలని కంకణం కట్టుకున్న వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉందని తెగుతున్న టికెట్లను బట్టి చెప్పొచ్చు

గతంలో అవెంజర్స్ ఎండ్ గేమ్ సృష్టించిన ఇక్కడి రికార్డులు స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ బద్దలు కొడుతుందని చాలా అంచనాలున్నాయి. ఈ వెర్షన్ లో చాలా ప్రత్యేకతలు ఉండటంతో మర్వెల్ స్టూడియోస్ భారీ ఎత్తున ప్రమోట్ చేస్తోంది. తెలుగుతో సహా అన్ని ప్రధాన భారతీయ భాషల్లోనూ దీన్ని అనువదించారు. హాలీవుడ్ మూవీస్ కి క్రేజ్ మనకు కొత్త కాకపోయినా ఈ స్థాయిలో ఫీవర్ అరుదుగా కనిపిస్తుంది. మల్టీ ప్లెక్సుల్లో ఇలాంటివి బాగా ఆడతాయి కాబట్టి అవి కూడా భారీ కౌంట్ తో షోలు ఇస్తున్నాయి. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం కనీసం వారం పది రోజుల పాటు స్పైడర్ మ్యాన్ ఎఫెక్ట్ టాలీవుడ్ రిలీజుల మీద గట్టిగా ఉంటుంది

Also Read : Muddy Report : మడ్డీ రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి