iDreamPost

మనుషులంతా జంతువుల్లా మారిపోతే! OTTలో ఉన్న ఈ సైన్స్ ఫిక్షన్ చూశారా?

సైన్ ఫిక్షన్ మూవీలకు కేరాఫ్ అడ్రస్ హాలీవుడ్ అండ్ ఫ్రెంచ్ మూవీస్. వింత జీవులు, వైరస్, వ్యాధులు మనుషులపై ఎలా ఎటాక్ చేస్తాయో చూపిస్తుంటారు అక్కడ దర్శక నిర్మాతలు. ఇప్పుడు అలాంటి ఓ మూవీనే ఓటీటీలో ఉంది. ఎక్కడ చూడొచ్చంటే..?

సైన్ ఫిక్షన్ మూవీలకు కేరాఫ్ అడ్రస్ హాలీవుడ్ అండ్ ఫ్రెంచ్ మూవీస్. వింత జీవులు, వైరస్, వ్యాధులు మనుషులపై ఎలా ఎటాక్ చేస్తాయో చూపిస్తుంటారు అక్కడ దర్శక నిర్మాతలు. ఇప్పుడు అలాంటి ఓ మూవీనే ఓటీటీలో ఉంది. ఎక్కడ చూడొచ్చంటే..?

మనుషులంతా జంతువుల్లా మారిపోతే! OTTలో ఉన్న ఈ సైన్స్ ఫిక్షన్ చూశారా?

ఓటీటీలో సైన్ ఫిక్షన్ స్టోరీస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటాయి హాలీవుడ్ చిత్రాలు. ఓ వింత వ్యాధి, వైరస్ ప్రజలను ఎలా వ్యాపించి, భూ ప్రపంచాన్ని ఎలా నాశనం చేస్తాయో కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంటారు అక్కడ దర్శక నిర్మాతలు. ఈ తరహా సినిమాలు హాలీవుడ్‌కు కొత్తేమీ కాదు. కరోనా రాకముందు ఇలాంటి మూవీస్ చేసి కలెక్షన్లను కొల్లగొడుతుంటాయి.అవతార్, 2012 లాంటి సైన్ ఫిక్షనల్ సినిమాలు ఇండియాలో కూడా కలెక్షన్లను కుమ్మేసిన సంగతి విదితమే. అలాంటి ఓ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తుంది. ఈ వీకెండ్‌లో బెస్ట్ సైన్ ఫిక్షన్ చూడాలనుకుంటే.. ఇది మిస్ కాకండి. మనిషే జంతువుగా మారి.. ఇతర మనుషులపై దాడి చేస్తే ఎలా ఉంటుందో చూపించే సినిమా ఇది. ఈ మూవీ పేరు ‘ది యానిమల్ కింగ్‌డమ్’

2023లో విడుదలైన ఈచిత్రం ఎన్నో అవార్డులను కొల్లగొట్టింది. ఇది ఫ్రెంచ్ మూవీ. లా రెగ్నే యానిమిల్ అనే మూవీకి డబ్బింగ్ వర్షన్ అయినప్పటికీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో చోటు దక్కించుకుంది. ఇది తండ్రి, కొడుకులతో కూడిన కథ. కొడుకుని కాపాడేందుకు తండ్రి చేసిన పోరాటమే ఈ సినిమా స్టోరీ. ఇక కథ విషయానికి వస్తే.. ఫ్రాన్స్ కో (రొమన్ డ్యూరిస్), తన కొడుకు జాన్(పాల్ కిర్చర్)పేరుకు మాత్రమే తండ్రి కొడుకులు. వీరిద్దరికీ నిత్యం గొడవలు జరుగతూ ఉంటాయి. ఒకరంటే ఒకరికి పొసగదు. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన సమయంలో కూడా గొడవ పడుతుంటారు. అక్కడే అసలు కథ స్టార్ అవుతుంది. తండ్రిపై కోపంతో కారు దిగి పోయి వెళ్లిన జాన్‪.. అక్కడే ఆ ట్రాఫిక్‌లో ఉన్న అంబులెన్స్ నుండి వింత జీవి బయటకు రావడాన్ని చూస్తాడు. అది ఏంటో ఎవ్వరికీ అర్థం కాదు.

Have you seen this sci-fi on OTT

పోలీసులు వింత మనిషి పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా.. తప్పించుకుని ఫారెస్టులోకి వెళ్లిపోతుంది ఆ జీవి. అప్పటికే ఆ ప్రాంతంలోని మనుషులంతా ఈ వింత జీవిలానే మారిపోతుంటారు. అందులో ఫ్రాన్స్ కో భార్య, జాన్ తల్లి కూడా ఉంటుంది. జంతువులుగా మారిన మనుషులందరినీ తీసుకెళ్లి.. ఓ హెల్త్ కేర్ సెంటర్‌లో బంధిస్తుంది ప్రభుత్వం. అదే సమయంలో జాన్ కూడా ఆ వింత జంతువులా మారిపోయాడని తెలుసుకుంటాడు. తెలిస్తే తనను హెల్త్ కేర్ సెంటర్‌లో బంధిస్తారని భావించి.. అడవిలోకి వెళ్లి తన తల్లిని కలుస్తాడు. కానీ పోలీసులు జాన్‌ను పట్టుకుని తన తండ్రికి అప్పగిస్తారు.

ఆ సమయంలో జాన్ వింత జంతువులా మారాడాన్ని గమనిస్తారు. కానీ తండ్రి.. కొడుకు కాపాడి.. తల్లి చెంత చేర్చేందుకు ప్రయత్నిస్తాడు. మిగిలిన కథ తెరపైనే చూడాలి. ఇందులో తండ్రి, కొడుకుల మధ్య ఎమోషన్ బాగుంటుంది. అలాగే జంతువుల్లా మారిన మనుషులపై దాడి చేసినా తోటి జంతువులకు హాని కలిగించకుండా ఉండటం ఎమోషనన్లకు ప్లస్ అయ్యింది. డైరెక్టర్ థామస్ క్యాలరీ విజన్ చాలా బాగుంది. ఇక ఈ సైన్ ఫిక్షన్ మూవీని ఎక్కడ చూడచ్చంటే.. మూబీ అనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో చూసేయొచ్చు. ఈ సినిమా ఎలా ఉందో చూసి.. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి