iDreamPost

Spider Man No Way Home : స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ రిపోర్ట్

Spider Man No Way Home : స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ రిపోర్ట్

ఒక హాలీవుడ్ సినిమాకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ రేంజ్ లో హైప్ ప్లస్ ఓపెనింగ్స్ రావడం ఈ మధ్య కాలంలో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ కు మాత్రమే సాధ్యమయ్యింది. ఇండియాలో మొదటి రోజు అసాధారణ ఓపెనింగ్స్ దక్కించుకున్న ఈ సూపర్ హీరో మూవీ మొదటి రోజు ఏకంగా 42 కోట్ల దాకా వసూళ్లు సాధించినట్టు ఇన్ సైడ్ టాక్. దేశం మొత్తం మీద మూడు వేల దాకా స్క్రీన్లలో ఫస్ట్ డే ఈ చిత్రాన్ని ప్రదర్శించినట్టుగా రిపోర్ట్స్ ఉన్నాయి. ఒకవేళ పుష్ప లేకపోతే దూకుడు ఇంకా జోరుమీద ఉండేది. పోటీ ఉన్నప్పటికీ క్రేజ్ అణువంత కూడా తగ్గలేదు. ముఖ్యంగా మార్వెల్ ఫ్యాన్స్ మాత్రం థియేటర్ నుంచి ఊగిపోతూ బయటికి వస్తున్నారు.

దీనికి ఇంత క్రేజ్ రావడానికి కారణం మొట్టమొదటిసారి ముగ్గురు స్పైడర్ మ్యాన్ లను ఒకేసారి స్క్రీన్ మీద చూపించడమే. డాక్టర్ స్ట్రేంజ్ చేసిన ఒక యంత్రం వల్ల ఇప్పటిదాకా వచ్చిన సిరీస్ లలో విలన్లందరూ భూమి మీదకు వస్తారు. వాళ్ళను నాశనం చేసే అవకాశం ఉన్నా లేటెస్ట్ స్పైడర్ మ్యాన్ జాలితో వదిలేస్తాడు. ఆ కారణంగానే అతని స్నేహితురాలు చనిపోతుంది. మరో ఫ్రెండ్ చనిపోయిన స్పైడర్ మ్యాన్ లను రప్పిస్తాడు. అప్పుడు ఈ ట్రిపుల్ సాలెగూడు హీరోలు స్టాట్యూ అఫ్ లిబర్టీ దగ్గర జరిగిన మహా యుద్ధంలో విలన్లను ఎలా మట్టికరిపించారు అనేదే అసలు కథ. చివర్లో అవెంజర్స్ ఎండ్ గేమ్ టైపులో ఎమోషనల్ ఎపిసోడ్ కూడా పెట్టారు.

అభిమానులు ఏది ఎక్స్ పెక్ట్ చేశారో అది ఈ స్పైడర్ మ్యాన్ లో అంతకు మించే దక్కింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే బ్రిడ్జ్ మీద ఫైట్, డాక్టర్ స్ట్రేంజ్ – స్పైడర్ మ్యాన్ ల మధ్య ఛేజ్, క్లైమాక్స్ ఎపిసోడ్ ఇవన్నీ ఒకదాన్ని మించి మరొకటి అద్భుతంగా పేలాయి. కాకపోతే సినిమా మధ్యలో, చివర్లో క్రెడిట్స్ కు ముందు కొంత ల్యాగ్ లేకపోలేదు. విజువల్ ఎఫెక్ట్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. ముగ్గురు స్పైడర్ మ్యాన్ల కాంబోలో వచ్చే సన్నివేశాలకు గూస్ బంప్స్ తో జనం వెర్రెత్తిపోయారు. ఆ స్థాయిలో ఇవి కుదిరాయి. రెండున్నర గంటల నిడివి కొంత ఎక్కవే. రెగ్యులర్ ఆడియన్స్ ని ఓవర్ ఎగ్జైట్ చేయలేదు కానీ ఈ నో వే హోమ్ కన్నా బెస్ట్ గిఫ్ట్ మార్వెల్ ఫ్యాన్స్ కి ఇప్పట్లో దక్కడం డౌటే

Also Read : Kalyan Dhev : ఎంతకీ కదలని మెగాఅల్లుడి రెండో అడుగు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి