iDreamPost

ట్రై సైకిల్ పై పిల్లల్ని స్కూలికి తీసుకెళ్తున్న తండ్రి.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో

ట్రై సైకిల్ పై పిల్లల్ని స్కూలికి తీసుకెళ్తున్న తండ్రి.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో

పిల్లలపై ఉన్న ప్రేమ, భావోద్వేగాలను తల్లి చూపినంత త్వరగా.. తండ్రి చూపించలేడు. సమయానుసారం.. వాటంతట అవే బయటపడతాయి. అమ్మ చూపినంత ప్రేమ.. నాన్నచూపించడని అనుకుంటారు కానీ.. నిజానికి తల్లి కంటే తండ్రికే ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ తన బాధ్యతలను నిర్వర్తించడంలో చూపుతారనేందుకు ఈ ఘటనే నిదర్శనం. తన ట్రై సైకిల్ పై తండ్రి తన ఇద్దరు పిల్లల్ని స్కూలికి తీసుకెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అంగవైకల్యం ఉందని ఆ తండ్రి కుంగిపోలేదు. పిల్లల్ని ఎలా పెంచాలని బాధపడలేదు. నిజాయితీగా తనకున్నంతలోనే.. తన పిల్లల బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. ట్రై సైకిల్ వెనుక కూతుర్ని, ముందు కొడుకుని కూర్చుబెట్టుకుని, పక్కనే బ్యాగులు తగిలించుకుని ఒక చేతితో సైకిల్ ను నడిపే చక్రాన్ని తిప్పుతూ స్కూలుకు తీసుకెళ్తున్నాడు. దానిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్ గా మారింది.

దీనిని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు. పిల్లల పట్ల ఆ తండ్రికి ఉన్న బాధ్యతను కొనియాడారు. పిల్లల్ని ట్రై సైకిల్ పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్లడం.. ఆ తండ్రికి సాధారణమైన విషయం. కానీ.. అందులో చాలా గొప్పతనం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం ధృడంగా, ధైర్యంగా ఉండాలని నెటిజన్లు ఈ వీడియోను చూసి.. చెప్తున్నారు.

https://twitter.com/sonalgoelias/status/1528797733163003904

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి