iDreamPost

స్పానిష్ బైక్ రైడర్ పై గ్యాంగ్ రేప్! దేశం పరువు తీసే ఘటన

Spanish Bike Rider Issue: దేశం తలదించుకునే ఘటన ఝార్ఖండ్ లో వెలుగు చూసింది. ఒక విదేశీ మహిళా బైక్ రైడర్ పై అఘాయిత్యం జరిగింది.

Spanish Bike Rider Issue: దేశం తలదించుకునే ఘటన ఝార్ఖండ్ లో వెలుగు చూసింది. ఒక విదేశీ మహిళా బైక్ రైడర్ పై అఘాయిత్యం జరిగింది.

స్పానిష్ బైక్ రైడర్ పై గ్యాంగ్ రేప్! దేశం పరువు తీసే ఘటన

ప్రపంచ దేశాలకు భారతదేశం ఎంతో గౌరవం, సోదర భావం ఉంది. ఇండియా అంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ప్రపంచ దేశాలను శాసించగలిగే శక్తిగల దేశం. ఎంతో మంది యువశక్తిని కలిగి ఉన్న గొప్ప దేశం. ఇక్కడి ఆచారాలు, సంస్కృతులు, భిన్నత్వంలో ఏకత్వం అంటే అందరికీ ఎంతో ఇష్టం. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. ఇంకా అఘాయిత్యాలు, అకృత్యాలు, ఆడవాళ్లపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా ప్రపంచ దేశాల ముందు మన దేశం పరువు తీసే ఘటన ఒకటి వెలుగు చూసింది. ఒక విదేశీ మహిళా బైక్ రైడర్ పై మన దేశంలో సమూహిక అత్యాచారం జరిగింది.

భారతదేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. అటు పర్యాటకంగా కూడా ఇండియాకి మంచి పేరుంది. మన దగ్గర ఉన్న చారిత్రక కట్టడాలు, పుణ్య క్షేత్రాలు, ప్రసిద్ధ దేవాలయాలకు విదేశీ టూరిస్టులు ఎక్కువగా వస్తూ ఉంటారు. అలాగే విదేశీ యూట్యూబర్లు, వ్లాగ్స్ చేసేవాళ్లు మన దేశ సంస్కృతిని ఎక్స్ ప్లోర్ చేస్తూ ఉంటారు. అలా మన దేశ గొప్పతనాన్ని చాటుతూ ఇండియాని ఎక్స్ ప్లోర్ చేస్తున్న ఒక స్పానిష్ బైక్ రైడర్ పై ఒక గ్యాంగ్ దారుణానికి ఒడిగట్టింది. ఆమెపై సమూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రపంచ దేశాల ముందు దేశం తలదించుకునేలా చేసిన ఈ ఘటన ఝార్ఖండ్ లో వెలుగు చూసింది. ఝార్ఖండ్ డుంకా జిల్లాలో 35 ఏళ్ల స్పానిష్ బైకర్ పై గ్యాంగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమె భర్తపై ఏడుగురు యువకులు దాడి చేసి.. ఆ తర్వాత ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు చెబుతున్నారు.

శుక్రవారం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హన్స్ దిహా పోలీస్ స్టేషన్ పరిధిలోని కురుమహాట్ ప్రాంతంలో జరిగింది. ఘటన జరిగిన తర్వాత ఇన్ స్టాగ్రామ్ వేదికగా తమకు జరిగిన అన్యాయం గురించి ఆ జంట వీడియో రూపంలో వెల్లడించారు. ఆ తర్వాత ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా అంతర్జాతీయంగా మన దేశం పరువు మంటకలిసేలా చేసంది. ఆ వీడియోలో మహిళా రైడర్ ఇలా చెప్పుకొచ్చింది.. “మాకు జరిగిన ఘటన ఇంకెవ్వరికీ జరగకూడదు. ఏడుగురు వ్యక్తులు నాపై అత్యాచారం చేశారు. వాళ్లు మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని దోచుకున్నారు. నాపై అఘాయిత్యం చేయాలి అనేదే వారి ఉద్దేశం. మేము ప్రస్తుతం పోలీసుల సంరక్షణలో ఆస్పత్రిలో ఉన్నాం. ఈ ఘటన ఇండియాలో జరిగింది” అంటూ ఆ బాధితురాలు చెప్పుకొచ్చింది.

ఈ ఘటనపై డుంకా ఎస్పీ స్పందించారు. అందురు నిందితులను గుర్తించాం. వారిలో నలుగురిని అదుపులోకి కూడా తీసుకున్నాం అని వెల్లడించారు. బాధితురాలు పోలీస్ పెట్రోల్ వ్యానుని ఆపి సహాయం కోరినట్లు చెప్పుకొచ్చారు. అప్పుడు వాళ్లు తీవ్రంగా గాయపడి ఉన్నారు. పోలీసులు వారిని వెంటనే ఆస్పత్రకి తరలించారు. వారిని ఒక సురక్షిత ప్రాంతంలో ఉంచడమే కాకుండా.. మెజిస్ట్రేట్ ఎదుట వారి స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా దేశ పరువు, గౌరవాన్ని మంటగలిసేలా చేసింది. ఇప్పటికీ ఇలాంటి దారుణాలు జరగడం మన దౌర్భాగ్యం అంటూ మేధావులు తలలు పట్టుకుంటున్నారు. మరి.. విదేశీ జంటపై జరిగిన ఈ దాడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి