iDreamPost

తండ్రి లేడు.. రోజుకు ఒక్క పూటే తింటూ.. నీట్‌లో స్టేట్‌ ర్యాంక్‌

  • Published May 10, 2024 | 11:52 AMUpdated May 10, 2024 | 11:52 AM

అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైన నీట్ మెడికల్ పరీక్ష ను ఉత్తీర్ణత అవ్వడం అంతా తేలికైనా పని కాదు. దీనికోసం రాత్రి, పగలు ఎంతో కృషి చేయాలి. అలాంటిది ఓ పేద కుటుంబంలో జన్మించిన ప్రేరణ సింగ్ అనే యువతి మాత్రం ఈ NEET UG పరీక్షలో అత్యధిక మార్కులు సాధించి అందరీకి ఆదర్శంగా నిలిచింది. కానీ ఆమె విజయగాథ వెనుక చాలా విషాదగాథ ఉంది.

అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైన నీట్ మెడికల్ పరీక్ష ను ఉత్తీర్ణత అవ్వడం అంతా తేలికైనా పని కాదు. దీనికోసం రాత్రి, పగలు ఎంతో కృషి చేయాలి. అలాంటిది ఓ పేద కుటుంబంలో జన్మించిన ప్రేరణ సింగ్ అనే యువతి మాత్రం ఈ NEET UG పరీక్షలో అత్యధిక మార్కులు సాధించి అందరీకి ఆదర్శంగా నిలిచింది. కానీ ఆమె విజయగాథ వెనుక చాలా విషాదగాథ ఉంది.

  • Published May 10, 2024 | 11:52 AMUpdated May 10, 2024 | 11:52 AM
తండ్రి లేడు.. రోజుకు ఒక్క పూటే తింటూ.. నీట్‌లో స్టేట్‌ ర్యాంక్‌

దేశంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో నీట్ పరీక్ష కూడా ఒకటి. ఈ పరీక్షకోసం దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది లక్షలాది మంది విద్యార్థులు పోటీపడుతుంటారు. అయితే మెడిసిన్ చదవాలి అనుకునేవారు ఈ నీట్ ఎంట్రన్స్ టెస్ట్ ను రాస్తారు. కానీ, ఈ ఎంట్రస్ టెస్ట్ అనేది క్లియర్ చేయడం అంత తేలికైనా విషయం కాదు. ఎందుకంటే.. దీని కోసం ప్రతిఒక్కరూ ఎంతో ధృడ సంకల్పంతో, కృషి చేసి చదావాలి. అయితే పట్టుదలతో దేనిని సాధిస్తే.. అసాధ్యమైనది కూడా సాధ్యమయ్యేలా చేయవచ్చని ఇది వరకే చాలామంది జీవితంలో ఉన్నత స్థాయిలో చేరుకొని నిరూపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రాజస్థాన్ లో నీట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఈ ఫలితాల్లో పేద కుటుంబంకు చెందిన ఓ యువతి కూడా తన లక్ష్య ను సాధించడం కోసం నీట్ పరీక్షల్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైన నీట్ మెడికల్ పరీక్ష ను ఉత్తీర్ణత అవ్వడం అంతా తేలికైనా పని కాదు. దీనికోసం రాత్రి, పగలు ఎంతో కృషి చేయాలి.కనుక ఇది మధ్యతరగతి కుటుంబానికి చెందిన పిల్లలకే సాధ్యమయ్యే పని కాదు. అలాంటిది రాజస్థాన్ లో ఓ పేద కుటుంబంలో జన్మించిన ప్రేరణ సింగ్ అనే యువతి మాత్రం ఈ NEET UG పరీక్షలో అత్యధిక మార్కులు మొత్తం 720 మార్కులకు 686 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. అయితే ప్రేరణ ఓ పేద కుటుంబనికి చెందిన అమ్మాయి. పైగా, ఈమె తండ్రి ఓ ఆటో డ్రైవర్ కావడం గమన్హారం. ఇక వారి కుటుంబానికి అతనే ఏకైక జీవనధారం. అలాంటి తండ్రి ప్రేరణ 10వ తరగతి చదువుతున్న సమయంలో క్యాన్సర్ తో చనిపోయారు. దీంతో ప్రేరణ తన చదువు కొనసాగించడం చాలా కష్టంగా మారింది. ఇక చదువు కొనసాగిస్తున్న సమయంలో.. ఆమె తండ్రి మరణించడంతో కుటుంబ భాధ్యతను మొత్తం ఆమె భుజాలపై పడింది.

మరొవైపు ఆమె తల్లికి కూడా ఎలాంటి జీవనా ఆదాయం లేదు సరి కదా.. తిరిగి వాళ్లకి రూ. 27 లక్షల అప్పు కూడా ఉంది. కానీ, అప్పు చెల్లించేంత డబ్బు ప్రేరణ కుటుంబం వద్ద లేదు. దీంతో తన పేదరికన్నీ, కుటుంబ ఆర్థిక పరిస్థితిని చూసి కృంగిపోలేదు. కనీసం తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండేది కాదు. పైగా రోజులో ఒక్క పూట మాత్రమే భోజనం చేసేది. అనగా రోజుకు ఒక రోటీ తిని బ్రతికేది. కానీ, ఏమాత్రం తన కష్టలను చూసి నిరశించలేదు సరి కదా.. వాటినే సవాళ్లుగా తీసుకొని పరీక్షకు సన్నద్ధమైంది. ఈ క్రమంలోనే.. ప్రేరణ ప్రతిరోజు 12 గంటలు చదువుకునేది. ఇక పట్టుదలతో పరీక్షకు ప్రిపేర్ అయిన ప్రేరణ నేడు నీట్ పరీక్షలో అత్యధిక మార్కులతో స్టేట్ ఫస్ట్ గా నిలవడంతో..  ఆమెకు ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు వచ్చింది. దీంతో ప్రేరణ ధృడ సంకల్పం చూసి, ఆమె తల్లి, బంధువులు ఆమె పట్ల చాలా ప్రశంసలు కురిపించారు. ఇక పట్టుదలతో దేనినైనా సాధించాలనుకుంటే.. ఏ పేదరికం అడ్డు కాదు అనే ప్రేరణ విజయగాథ ప్రతిఒక్కరికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మరి, పేదింటి కుసుమంగా నీట్ పరీక్షలో మెరిసిన ఆటో డ్రైవర్ కూతురి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి