iDreamPost

హైదరాబాద్ ప్రయాణికులకు అలర్ట్.. పలు MMTS రైళ్లు రద్దు

హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్. పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఏకంగా 23 సర్వీసులు రద్దు కానున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్. పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఏకంగా 23 సర్వీసులు రద్దు కానున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

హైదరాబాద్ ప్రయాణికులకు అలర్ట్.. పలు MMTS రైళ్లు రద్దు

హైదరాబాద్ లో ప్రయాణికులకు సౌకర్యవంతమైన రవాణాల్లో ఎంఎంటీఎస్ ఒకటి. ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర పనులకు వెళ్లే వారు ఎక్కువగా ఎంఎంటీఎస్ లోనే ప్రయాణిస్తుంటారు. ఛార్జీలు కూడా తక్కువగా ఉండడంతో లోకల్ ట్రైన్ లలోనే ప్రయాణించేందుకు ఇష్టపడుతుంటారు. అయితే హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్. పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఏకంగా 23 సర్వీసులు రద్దు కానున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. రైల్వే ట్రాక్ పనుల కారణంగా జంటనగరాల్లో తిరిగే 23 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.

మౌలాలి-సనత్‌నగర్‌ స్టేషన్ల మధ్య నాన్‌-ఇంటర్‌ లాకింగ్ పనుల కారణంగా 23 ఎంఎంటీఎస్ రైల్ సర్వీసులు రద్దు కానున్నాయి. ఫిబ్రవరి 4 నుంచి ఈ నెల 11 వరకు 23 ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు మొత్తం 51 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటన మేరకు ఈ నెల 9 వరకు మూడు ఎంఎంటీఎస్ రైళ్లు, 10 వరకు మరో రెండు, ఈ నెల 11 వరకు 18 ఎంఎంటీఎస్ రైళ్లు మొత్తంగా 23 సర్వీసులు రద్దు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా మౌలాలి-అమ్ముగూడ-సనత్‌నగర్‌ మార్గంలో నడిచే హైదరాబాద్‌ -సిర్పూర్‌-కాగజ్‌నగర్‌, వికారాబాద్‌-గుంటూరు, రాయపల్లె-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ను షెడ్యూల్‌ ప్రకారం నిలిపివేయనున్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కల్పిస్తున్న ఎంఎంటీఎస్ రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోనున్నట్లు పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి