iDreamPost

మూడు మ్యాచ్ లకు రూ.1.25 కోట్లు.. పెళ్లినే వాయిదా వేసుకున్న స్టార్ క్రికెటర్!

3 మ్యాచ్ ల కోసం ఓ ఫ్రాంచైజీ ఏకంగా రూ. 1.25 కోట్ల ఆఫర్ చేసింది ఓ స్టార్ ప్లేయర్ కు. దీంతో తన పెళ్లినే వాయిదా వేసుకున్నాడు ఆ ఆటగాడు. మరి డబ్బు కోసం మ్యారేజ్ ను పోస్ట్ పోన్ చేసుకున్న ఆ ప్లేయర్ ఎవరు?

3 మ్యాచ్ ల కోసం ఓ ఫ్రాంచైజీ ఏకంగా రూ. 1.25 కోట్ల ఆఫర్ చేసింది ఓ స్టార్ ప్లేయర్ కు. దీంతో తన పెళ్లినే వాయిదా వేసుకున్నాడు ఆ ఆటగాడు. మరి డబ్బు కోసం మ్యారేజ్ ను పోస్ట్ పోన్ చేసుకున్న ఆ ప్లేయర్ ఎవరు?

మూడు మ్యాచ్ లకు రూ.1.25 కోట్లు.. పెళ్లినే వాయిదా వేసుకున్న స్టార్ క్రికెటర్!

క్రికెట్ కోసం కొన్ని కొన్ని సార్లు సంచలన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. పరిస్థితుల ప్రభావం కావొచ్చు.. లేదా వారికి దానిపై ఉన్న ప్రమో కావొచ్చు.. ఇవన్నీ కాకుండా భారీ ఆఫర్ అయినా రావొచ్చు. వీటి కారణాంగా అత్యంత మధుర క్షణాలను కూడా వాయిదా వేసుకునేందుకు సిద్ధపడుతూ ఉంటారు కొందరు క్రికెటర్లు. కేవలం 3 మ్యాచ్ ల కోసం ఓ ఫ్రాంచైజీ ఏకంగా రూ. 1.25 కోట్ల ఆఫర్ చేసింది ఓ స్టార్ ప్లేయర్ కు. దీంతో తన పెళ్లినే వాయిదా వేసుకున్నాడు ఆ ఆటగాడు. మరి డబ్బు కోసం మ్యారేజ్ ను పోస్ట్ పోన్ చేసుకున్న ఆ ప్లేయర్ ఎవరు?

సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ తీసుకున్న ఓ షాకింగ్ డెసిషన్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ దిగ్గజం వసీమ్ అక్రమ్ ప్రపంచానికి తెలియజేశాడు. అసలేం జరిగిందంటే? ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఫార్యూనన్ బరిషల్ టీమ్ తరఫున మూడు మ్యాచ్ లు ఆడితే.. మిల్లర్ కు ఏకంగా రూ. 1.25 కోట్ల రూపాయాలు చెల్లిస్తామని ఆ ఫ్రాంచైజీ ఒప్పుకుందట. ఫిబ్రవరి 26(ఎలిమినేటర్), ఫిబ్రవరి 28( క్వాలిఫయర్ 2), మార్చి 1న(ఫైనల్) కీలకమైన ఈ మూడు మ్యాచ్ లు ఆడేందుకు భారీ మెుత్తంలో ఆఫర్ ఇచ్చింది యాజమాన్యం. దీంతో తన పెళ్లిని సైతం పోస్ట్ పోన్ చేసుకున్నాడు మిల్లర్ ఈ విషయాన్ని వసీమ్ అక్రమ్ వెల్లడించాడు.

David miller postponed his marriage for matches

వసీమ్ అక్రమ్ మాట్లాడుతూ..”పాకిస్తాన్ సూపర్ లీగ్ తో నేను చాలా బిజీగా ఉన్నాను. దీంతో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ను ఎక్కువగా పట్టించుకోలేదు. అయితే టైటిల్ ఎవరు గెలిచారు? అన్నది తెలుసుకున్నాను. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నాకు తెలిసింది. డేవిడ్ మిల్లర్ ఫార్చూన్ బరిషల్ తరఫున చివరి మూడు మ్యాచ్ లు ఆడితే.. 1.5 లక్షల డాలర్లు(ఇండియన్ కరెన్సీలో రూ. 1.25 కోట్లు) ఇస్తామని ఫ్రాంచైజీ ఆఫర్ ఇచ్చింది. దీంతో మిల్లర్ తన మ్యారేజ్ ను సైతం వాయిదా వేసుకుని ఈ టోర్నీలో పాల్గొన్నాడు” అని పాక్ దిగ్గజం వెల్లడించాడు.

ఇక బీపీఎల్ ముగిసిన తర్వాత తన ప్రియురాలు అయిన కామిల్లా హారిస్ ను మార్చి 10న పెళ్లి చేసుకున్నాడు ఈ సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో.. నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. డబ్బులకు కక్కుర్తి పడి మ్యారేజ్ ను వాయిదా వేసుకోవడం ఏంటి బ్రో? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి డేవిడ్ మిల్లర్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: శుబ్ మన్ గిల్ తో గొడవపై స్పందించిన అండర్సన్! ఇద్దరి మధ్య జరిగింది ఇదే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి