iDreamPost

కోహ్లీని తప్పించి.. రోహిత్‌కి కెప్టెన్సీ! సీక్రెట్‌ రివీల్‌ చేసిన గంగూలీ

రోహిత్ శర్మ కెప్టెన్సీ తీసుకోవడానికి ముందు జరిగిన విషయాలను ఆ సమయంలో బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్న గంగూలీ వెల్లడించారు. ప్రపంచకప్ 2023 లో భారత్ సెమీస్ కు చేరిన వేళ దాదా హిట్ మ్యాన్ కెప్టెన్సీ వెనక ఉన్న అసలు నిజాలను తెలిపారు.

రోహిత్ శర్మ కెప్టెన్సీ తీసుకోవడానికి ముందు జరిగిన విషయాలను ఆ సమయంలో బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్న గంగూలీ వెల్లడించారు. ప్రపంచకప్ 2023 లో భారత్ సెమీస్ కు చేరిన వేళ దాదా హిట్ మ్యాన్ కెప్టెన్సీ వెనక ఉన్న అసలు నిజాలను తెలిపారు.

కోహ్లీని తప్పించి.. రోహిత్‌కి కెప్టెన్సీ! సీక్రెట్‌ రివీల్‌ చేసిన గంగూలీ

వన్డే ప్రపంచకప్ లో భారత్ అద్భుతరీతిలో అదరగొడుతోంది. ఓటమన్నదే లేకుండా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ప్రత్యర్థి జట్లను మట్టికరిపిస్తూ సంచలన విజయాలను నమోదు చేస్తూ విజయ దుందుభి మోగిస్తోంది రోహిత్ సేన. ఇప్పటి వరకు ఆడిన 8 లీగ్ మ్యాచ్ లలో అన్నింటా విజయం సాధించి సెమీస్ లోకి అడుగుపెట్టింది టీమిండియా. టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ అసాధారణమైన ప్రదర్శనను కనబరుస్తోంది. అయితే టీమిండియా సెమీస్ కు చేరిన వేళ బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీపై అసలు నిజాలేంటో తెలిపారు.

వన్డే వరల్డ్ కప్ లో అదరగొడుతున్న భారత్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియా సారథి జట్టును నడిపిస్తున్న తీరుకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. భీకరమైన ఫామ్ లో ఉన్న హిట్ మ్యాన్ మెరుపు బ్యాటింగ్ చేస్తూ జట్టు విజయంలో కీలకంగా మారారు. అయితే రోహిత్ కెప్టెన్సీ అందుకున్న తరువాత తన స్థాయికి తగిన ప్రదర్శన చేస్తూ ఔరా అనిపించుకుంటున్నారు. ఇటీవల రోహిత్ సారథ్యంలోని టీమిండియా ఆసియా కప్ ను గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో రోహిత్ ను విమర్శించిన వాళ్లకు ధీటుగా సమాధానం చెప్పినట్లైంది. అయితే హిట్ మ్యాన్ కెప్టెన్సీ సక్సెస్ వెనక దాదా ఉన్నట్లు తెలుస్తోంది. రోహిత్ టీమిండియా పగ్గాలు చేపట్టేందుకు సుముఖంగా లేని తరుణంలో గంగూలీ చొరవ తీసుకుని ఒప్పించినట్లు ఓ మీడియా ద్వారా దాదా వెల్లడించారు.

టీ20 వరల్డ్‌కప్‌-2021 తర్వాత విరాట్‌ కోహ్లి టీమిండియా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ జట్టు సారథ్య బాధ్యతలను చేపట్టాడు. కెప్టెన్సీ తీసుకోవడానికి ముందు జరిగిన విషయాలను ఆ సమయంలో బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్న గంగూలీ వెల్లడించారు. కింగ్ కోహ్లీ కెప్టెన్సీ భాద్యతల నుచి తప్పుకున్న తర్వాత మూడు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్సీ చేపట్టేందుకు రోహిత్‌ శర్మ సిద్ధంగా లేడని దాదా తెలిపారు. ఇదే విషయమై పలుమార్లు తనతో మాట్లాడినా ఫలితం లేకుండా పోయిందని, దీంతో తానే మరింత చొరవ తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు.

కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టడానికి ఓకే చెప్తావా.. లేదా నాకు నేనుగా దీని గురించి ప్రకటన చేయాలా? అని రోహిత్ తో అన్నట్లుగా చెప్పారు. భారత కెప్టెన్ గా ప్రకటించిన తరువాత బాధ్యతలు చేపట్టక తప్పదు అని హిట్ మ్యాన్ తో ఖరాఖండిగా చెప్పినట్లు గంగూలీ తెలిపారు. జట్టును దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లే సత్తా ఉన్నోడు రోహిత్ శర్మ అని తనకు తెలుసని దాదా చెప్పారు. ఈ నేపథ్యంలోనే వరల్డ్ కప్ లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోందని భారత సారథిపై ప్రశంసల వర్షం కురిపించారు గంగూలీ.

 

View this post on Instagram

 

A post shared by Team India (@indiancricketteam)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి