iDreamPost

Sourav Ganguly: సిల్వర్​స్క్రీన్​పై గంగూలీ బయోపిక్.. హీరోగా నేషనల్ అవార్డు విన్నర్!

  • Published Jan 13, 2024 | 7:17 PMUpdated Jan 13, 2024 | 7:17 PM

భారత క్రికెట్ గమనాన్ని, గమ్యాన్ని మార్చాడు సౌరవ్ గంగూలీ. బ్యాటర్​గా, కెప్టెన్​గా టీమిండియాకు దూకుడు నేర్పించాడు. పెద్ద జట్ల మీద ఎలా గెలవాలో చూపించాడు. చాలా మంది యంగ్​స్టర్స్​ను ఎంకరేజ్ చేసి స్టార్లుగా తీర్చిదిద్దాడు. అలాంటి దాదా లైఫ్ మీద ఓ సినిమా రానుంది.

భారత క్రికెట్ గమనాన్ని, గమ్యాన్ని మార్చాడు సౌరవ్ గంగూలీ. బ్యాటర్​గా, కెప్టెన్​గా టీమిండియాకు దూకుడు నేర్పించాడు. పెద్ద జట్ల మీద ఎలా గెలవాలో చూపించాడు. చాలా మంది యంగ్​స్టర్స్​ను ఎంకరేజ్ చేసి స్టార్లుగా తీర్చిదిద్దాడు. అలాంటి దాదా లైఫ్ మీద ఓ సినిమా రానుంది.

  • Published Jan 13, 2024 | 7:17 PMUpdated Jan 13, 2024 | 7:17 PM
Sourav Ganguly: సిల్వర్​స్క్రీన్​పై గంగూలీ బయోపిక్.. హీరోగా నేషనల్ అవార్డు విన్నర్!

బయోపిక్.. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు బాగా నడుస్తున్న ట్రెండ్. జీవితంలో బాగా సక్సెస్ అయిన సైంటిస్టులు, సినీ తారలు, క్రికెటర్స్, పొలిటీషియన్స్ లైఫ్​ను ఆధారంగా తీసుకొని మూవీస్ తీయడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. ప్రముఖుల జీవితాల్లోని వైఫల్యాలు, వివాదాలు, కష్టాలు, ఓటమి నుంచి గెలుపు దిశగా ప్రయాణం లాంటివి హైలైట్ చేస్తూ చాలా బయోపిక్స్ తెరకెక్కాయి. వీటిలో కొన్ని పెద్దగా ఆడలేదు.. కానీ మరికొన్ని మాత్రం బ్లాక్​బస్టర్స్​గా నిలిచాయి. ‘మహానటి’, ‘భాగ్ మిల్కా భాగ్’, ‘ఎంఎస్ ధోని’, ‘సంజూ’ లాంటి బయోపిక్ మూవీస్ సూపర్ హిట్స్​గా నిలిచాయి. దీంతో నిజ జీవిత కథలపై సినిమాలు తీయడం పెరిగింది. ఈ కోవలోనే మరో బయోపిక్ రూపొందనుంది. టీమిండియా లెజెండ్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవితంపై సినిమా తీయనున్నారు. ఈ బయోపిక్​లో నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ నటించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

భారత క్రికెట్ జట్టు గమనాన్ని మార్చిన గంగూలీ బయోపిక్ త్వరలో పట్టాలెక్కనుంది. టీమిండియాకు దూకుడు నేర్పిన దాదా లైఫ్​లోని విశేషాలతో రూపొందనున్న ఫిల్మ్​లో నేషనల్ అవార్డు విన్నర్ ఆయుష్మాన్ ఖురానా నటించనున్నారని తెలిసింది. గంగూలీ క్యారెక్టర్​ను ఆయన పోషించనున్నట్లు సమాచారం. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమాదిత్య మోత్వాని తెరకెక్కించనున్న ఈ చిత్రం.. ఈ సంవత్సరం చివర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్. లవ్ రంజన్, అంకుర్ గార్గ్​లు ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్న ఈ ఫిల్మ్​కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయిందట. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా, డైరెక్టర్ మోత్వానీలు గంగూలీ బయోపిక్ కోసం రెడీ అవుతున్నారని తెలుస్తోంది. దాదా ఎక్స్​ప్రెషన్స్, అతడి బ్యాటింగ్ స్టైల్, తదిరత అంశాల మీద స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట ఖురానా.

ఆయుష్మాన్ ఖురానా ట్రైనింగ్ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత గంగూలీ బయోపిక్​ను సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్, మహ్మద్ అజహరుద్దీన్, కపిల్ దేవ్, మిథాలీ రాజ్ లాంటి ప్రముఖ క్రికెటర్ల బయోపిక్స్ వచ్చి మంచి కలెక్షన్స్ రాబట్టాయి. ఈ నేపథ్యంలో దాదా బయోపిక్ ఎలా ఉంటుందనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. టీమిండియా బెస్ట్ కెప్టెన్లలో ఒకడిగా, భవిష్యత్​కు బాటలు వేసిన సారథిగా, దూకుడు నేర్పించిన నాయకుడిగా పేరు తెచ్చుకున్న దాదా కెరీర్​లో కాంట్రవర్సీలు కూడా చాలానే ఉన్నాయి. దీంతో ఈ సినిమాను డైరెక్టర్ మోత్వానీ ఎలా తీస్తాడోననేది ఆసక్తిని కలిగిస్తోంది. మోత్వానీ గతంలో ‘లూటేరా’, ‘ఎన్​హెచ్​ 10’, ‘ఉడాన్’, ‘బాంబే వెల్వెట్’, ‘ఉడ్తా పంజాబ్’ వంటి హిట్స్ తీశారు. దీంతో దాదా బయోపిక్ మీద ఎక్స్​పెక్టేషన్స్ ఎక్కువవుతున్నాయి. మరి.. గంగూలీ బయోపిక్ చూసేందుకు మీరెంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: భువీ ఈజ్ బ్యాక్.. ఏకంగా 8 వికెట్లతో వణికించాడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి