iDreamPost

పేదరికంలో అమ్మ మృతి! జాబ్స్ వచ్చాక కొడుకులు గొప్ప పని! హేట్సాఫ్!

Sons Celebrating Mother 50th Wedding Anniversary: ఈ మధ్యకాలంలో కన్న తల్లిదండ్రులను వృద్దాశ్రమాలకు తరలిస్తున్న కొడుకులు. అలాంటి ఈ కాలంలో.. తమ తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కొడుకులను చూసి అందరూ శభాష్ అంటున్నారు.

Sons Celebrating Mother 50th Wedding Anniversary: ఈ మధ్యకాలంలో కన్న తల్లిదండ్రులను వృద్దాశ్రమాలకు తరలిస్తున్న కొడుకులు. అలాంటి ఈ కాలంలో.. తమ తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కొడుకులను చూసి అందరూ శభాష్ అంటున్నారు.

పేదరికంలో అమ్మ మృతి! జాబ్స్ వచ్చాక కొడుకులు గొప్ప పని! హేట్సాఫ్!

అమ్మను మించిన దైవం లేదు.. దేవుడు తనకు బదులుగా ఈ భూమిపై అమ్మను సృష్టించారని పెద్దలు అంటారు. నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లి తన బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది.. తన పిల్లకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా విలవిలాడిపోతుంది. ఈ రోజుల్లో చాలా మంది కొడుకులు కన్న తల్లిదండ్రుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వృద్దాప్యంలో తమకు అండగా ఉంటారని భావించే తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్ కి తరలిస్తున్నారు. అలాంటిది ఈ రోజుల్లో కనీ పెంచిన తల్లిదండ్రులను కంటికి రెప్పలా సాకేవారు ఉన్నారు.. వారు చనిపోయిన తర్వాత గుడి కట్టి పూజిస్తున్న వారు ఉన్నారు. తమ తల్లికి ఇచ్చిన మాట ప్రకారం కనీ వినీ ఎరుగని రీతిలో వినూత్న వేడుక నిర్వహించి అందరిచే శభాష్ అనిపించుకున్నారు. వివరాల్లోకి వెళితే..

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల గ్రామానికి చెందిన చెన్నంశెట్టి సత్యనారాయణ, నాగలక్ష్మి దంపతులు 50 ఏళ్ల కింద పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో కడు పేదరికంలో వీరు సాధారణంగా పెళ్లి చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని భీమవరానికి చెందిన ఈ కటుంబం.. బతుకుదెరువు కోసం 1978 లె గుమ్మడిదలకు వచ్చారు. సత్యనారాయణ రైస్ మిల్లు లో మెకానిక్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చారు. ఎంతో కష్టపడి పిల్లలను బాగా చదివించారు. కొడుకులు పెరిగి పెద్దయ్యాక ఒక్కొక్కరు ఒక్కో బిజినెస్ చేస్తూ ఆర్థికంగా స్థిర పడ్డారు. ఈ దంపతులు తమ ఐదుగురు కొడుకులకు పెళ్లిళ్లు చేశారు. ఉమ్మడి కుటుంబంగా ఉంటున్న కొడుకులు, కోడళ్లతో ఆ ఇళ్లు కలకలలాడూతూ ఉంది. ఈ క్రమంలోనే ఓ సందర్భంలో కొడుకులు, కోడళ్లతో నాగలక్ష్మి తన వివాహం ప్రస్తావన తెస్తూ.. ఆ కాలంలో చాలా పేదరికంలో ఉండటం వల్ల కనీసం పెళ్లిలో దండలు కూడా మార్చుకోలేకపోయాం అని బాధపడింది. తమ 50వ పెళ్లి రోజుని బంధుమిత్రులకు చెప్పి ఘనంగా నిర్వహించాలని తన మనసులో కోరిక కొడుకులతో చెప్పింది. దానికి కొడుకులు, కోడళ్లు తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు.

నాగలక్ష్మి తన 50వ పెళ్లిరోజుకు ఒక సంవత్సరం ముందు అనారోగ్యంతో కన్నుమూసింది.  ఆమె కొడుకులు తల్లికి ఇచ్చిన మాట నెలబెట్టుకున్నారు. తమ తల్లిదండ్రులు 50 వ పెళ్లి రోజు 2024, మార్చి 1 న గ్రాండ్ గా నిర్వహించారు. తమ తల్లి నాగలక్ష్మి విగ్రహాన్ని తయారు చేయించారు. వేధికపై తమ తండ్రితో పాటు పక్కనే మరో కుర్చిలో విగ్రహం ఏర్పాటు చేసి దండలు వేశారు. ఈ వేడుకకు సుమారు 1500 మంది బంధుమిత్రులు హాజరై ఆ కుటుంబాన్ని ఆశీర్వదించారు. తల్లిదండ్రులను పట్టించుకోని ఈ కాలంలో తమ తల్లికోసం కొడుకులు చేసిన గొప్పపనికి హ్యాట్సాఫ్ అంటున్నారు. మరీ ఈ విషయంపై మీ అభిప్రయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి