iDreamPost

Ugadi 2024: ఉగాది రోజున ఏ దైవాన్ని పూజించాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయం!

  • Published Apr 05, 2024 | 6:05 PMUpdated Apr 05, 2024 | 7:00 PM

అందరు న్యూ ఇయర్ అంటే.. జనవరి 1న జరుపుకుంటున్నారు. అయితే, తెలుగు వారికి తెలుగు క్యాలెండర్ ప్రకారం అయితే, ఉగాది రోజున కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలో ఉగాది రోజున ఏ దైవాన్ని పూజించాలి అనే సందేహాలు వస్తూ ఉంటాయి. మరి దానికి సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అందరు న్యూ ఇయర్ అంటే.. జనవరి 1న జరుపుకుంటున్నారు. అయితే, తెలుగు వారికి తెలుగు క్యాలెండర్ ప్రకారం అయితే, ఉగాది రోజున కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలో ఉగాది రోజున ఏ దైవాన్ని పూజించాలి అనే సందేహాలు వస్తూ ఉంటాయి. మరి దానికి సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  • Published Apr 05, 2024 | 6:05 PMUpdated Apr 05, 2024 | 7:00 PM
Ugadi 2024: ఉగాది రోజున ఏ దైవాన్ని పూజించాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయం!

భారతీయ హిందూ సంప్రదాయం ప్రకారం.. ఒక ఏడాదిలో అనేక రకాల పండుగలు వస్తూ ఉంటాయి. అయితే, ఆ పండుగల రోజున .. ఆ పండుగకు సంబంధించిన దేవుళ్ళను, దేవతలను ప్రత్యేకంగా పూజించడం.. తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయం, ఆచారం. ఈ క్రమంలో తెలుగు వారంతా జరుపుకునే.. ప్రత్యేకమైన పెద్ద పండుగ “ఉగాది”. సంవత్సరం ఆరంభంలో వచ్చే ఈ పండుగ అంటే.. ఎంతో మంది ఇష్టపడుతూ ఉంటారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం .. ఉగాది రోజున కొత్త సంవత్సరం ప్రారంభం అయినట్లుగా భావించడం.. అనాదిగా వస్తున్న ఆచారం. ఉగాది అంటే ముందుగా అందరికి .. ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం గుర్తుకు వస్తాయి. అలాగే, ఉగాది రోజున చేసే ప్రతి పని ప్రభావం ఏడాది అంతా ఉంటుందని కూడా.. పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే, మరి ఉగాది రోజు ప్రత్యేకించి ఏ దేవుడిని పూజిస్తారో తెలుసా ! అలాగే ఆరోజున వేటిని దానం చేయడం వలన విశేష ఫలితాలు కలుగుతాయో కూడా తెలుసుకుందాం.

నిజానికి ఉగాది పండుగను.. చైత్రశుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది అంటే 2024 ఏప్రిల్ 8 సోమవారంతో శోభకృత్ నామ సంవత్సరానికి ముగింపు పలికి.. ఎప్రిల్ 9 మంగళవారం నుంచి “క్రోధినామ సంవత్సరం” ప్రారంభమవుతుంది. నిజానికి ఉగాది పండుగకు ప్రత్యేకించి దేవుడు లేడు. ఈ రోజున కాలాన్నే దేవుడిగా భావిస్తారు. ఉగాది రోజు నుంచే అసలే సృష్టి అనేది మొదలైందని అంతా భావిస్తూ ఉంటారు. అందువలననే ఉగాది పండుగ రోజున.. తెల్లవారు జామున లేచి.. నవ్వుల నూనెతో అభ్యంగ స్నానాలు ఆచరిస్తారు. అలాగే కొత్త బట్టలు ధరించి.. గడపకు పసుపు, కుంకుమలు అద్ది.. గుమ్మానికి మామిడి తోరణాలను అలంకరిస్తారు. ఇలా పండుగనైతే జరుపుకుంటారు, కానీ.. ఏ పండుగ రోజున ప్రత్యేకించి ఏ దేవుడు లేడు కాబట్టి.. వారి వారి ఇష్ట దైవాలను.. తలచుకుంటూ.. పూజిస్తే మంచిది.. లేదా శ్రీ మహా విష్ణు, శివుడు, జగన్మాతను పూజించినా కూడా విశేష ఫలితాలు కలుగుతాయని.. పెద్దలు చెబుతున్నారు.

అలాగే, ఆరోజున ష్రడ్రుచులుగా భావించే పులుపు, తీపి, వగరు, చేదు, ఉప్పు, కారం కలగలిపిన.. ఉగాది పచ్చడిని ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే, జీవితంలోని కామ, క్రోధ, లోభ , మోహ, మద. మాస్త్యర్యాలకు సంకేతాలకు సమానంగా ఈ ఉగాది పచ్చడిని భావిస్తూ ఉంటారు. అంతే కాకుండా .. వైద్య పరంగా కూడా ఈ ఉగాది పచ్చడికి వైద్య పరంగా కూడా .. ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి. వేసవిలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని కూడా చెబుతూ ఉంటారు. ఇక రానున్న రోజుల్లో తమ జీవితంలో జరిగే మంచి , చెడుల గురించి .. ఈరోజున పంచాంగ శ్రవణాన్ని వింటూ ఉంటారు. ఇక ఉగాది రోజున ‘ప్రపాదానం’ అంటే చలివేంద్రాన్ని పెట్టాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక కొంతమంది.. చెప్పులూ, గొడుగులను కూడా దానం చేస్తారు. వేసవి కాలం కనుక అప్పట్లో ఈ ఆచారాలను ఎక్కువగా పాటిస్తూ ఉండేవారు. మరి, ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి