iDreamPost

బీజేపీకి బిగ్ షాక్.. బీఆర్‌ఎస్‌లోకి మాజీ ఎమ్మెల్యే సోమారపు?

తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికల జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో పలువురు నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు

తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికల జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో పలువురు నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు

బీజేపీకి బిగ్ షాక్.. బీఆర్‌ఎస్‌లోకి మాజీ ఎమ్మెల్యే సోమారపు?

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి కనిపిస్తుంది. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత అధికార పార్టీ, ప్రతిపక్ష నేతలు తమ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక ఎన్నికల సమయంలో అసమ్మతి నేతల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తాము ఆశించిన సీట్లు దక్కకుంటే వెంటనే ఇతర పార్టీ కండువ కప్పుకుంటున్నారు. కార్యర్తల నుంచి మొదలు కొని ఎమ్మెల్యే స్థాయి వరకు ఇదే తంతు నడుస్తుంది. ఇప్పటికే అధికార పార్టీ నుంచి ఇతర పార్టీలకు కొందరు జంప్ అయితే.. ప్రతిపక్ష పార్టీల నుంచి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. తాజాగా రామగుండం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని ప్రచారం సాగుతుంది. వివరాల్లోకి వెళితే..

పెద్దపల్లి జిల్లాలో ప్రస్తుతం 3 అసెంబ్లీ స్థానాల్లో రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. ఇది మొదటి నుంచి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ఎక్కువగా ఫోకస్ పెట్టిన నియోజకవర్గాల్లో రామగుండం ఒకటి. ఈ నియోజకవర్గం పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 2008 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం ప్రత్యేకంగా ఏర్పడింది. ఈ నియోజకవర్గ పరిధిలోకి కమాన్ పూర్, రామగుండం రెండు మండలాలు ఉన్నాయి. రామగుండం నియోజకవర్గంలో కీలక నేతగా కొనసాగుతు వస్తున్న మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. మంగళవారం హైదరాబాద్ లో ఆయన బీఆర్ఎస్ వర్కింగె ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్ రావుతో భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ తరుపు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోరుకంటి చంద‌ర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన బీజేపీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతా అని చెప్పినప్పటికీ ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం ఢీల్లీకి పలుమార్లు వెళ్లి వచ్చినప్పటికీ.. అధిష్టానుం సానుకూలంగా స్పందించకపోవడంతో తీవ్ర అసహనానికి గురైనట్లు సమాచారం.

రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను ఏ పార్టీ నుంచి పోటీ చేయనని.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపిన సోమారుపు.. అకస్మాత్తుగా ప్లేట్ ఫిరాయించి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఇప్పటికే రామగుండం అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేటీఆర్, హరీశ్ రావులను కలిసిన సోమారపు తనకు పార్టీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని.. ప్రస్తుతం పోటీలో ఉన్న అభ్యర్థికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సోమారపు ప్రతిపాదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సోమారపు సత్యనారాయణ 1998లో రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. 2004 లో అసెంబ్లీ ఎన్నికల్లో మంథని నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ లో చేరి 2009 లో రామగుండం అసెబ్లీ ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిచారు. 2014 నాటి టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) తరుపు నుంచి రామగుండం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు.

2018 నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సోమారపు సత్యనారాయణ ఓటమిపాలయ్యారు. వెంటనే ఆయన బీజేపీ కండువా కప్పుకొని కొంతకాలం కీలక అభ్యర్థిగా కొనసాగారు. ఇటీవల బీజేపీ కి రాజీనామా చేసి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ ఆయన మనసు మళ్లీ బీఆర్ఎస్ వైపు మళ్లిందని.. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అగ్రనేతలను కలిసి మంతనాలు జరిపారని తెలుస్తుంది. ఒకవేళ ఆయనకు రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సీటు ఇస్తే.. ఇప్పటికే ప్రకటించిన కోరుకంటి చంద‌ర్ పరిస్థితి ఏంటీ? అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీ కట్టబెడుతుందా లేదా ? అన్న దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ విషయం గురించి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఎన్నికల ముందు ఇలాంటీ పరిణామాలు జరుగుతూనే ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి