iDreamPost

వైసిపి నేత విజయసాయిరెడ్డికి ‘సోషల్’ వేధింపులు

వైసిపి నేత విజయసాయిరెడ్డికి ‘సోషల్’ వేధింపులు

ట్విట్టర్, ఫేస్ బుక్ తదితర సోషల్ మీడియా వేదికల్లో చురుకుగా వ్యవహరించే వైయస్సార్సీపి ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డికి ఆయా సోషల్ మీడియా వేదికలలో వేధింపులు తప్పలేదు. ట్విట్టర్, ఫేస్బుక్, హలో తదితర సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టింగులు పెడుతూ తనను, తమ పార్టీని కించపరిచేలా వ్యవహరిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఎంపీ విజయసాయి రెడ్డి డీజీపీ గౌతమ్ సవాంగ్ను కోరారు తప్పుడు పోస్టింగులు కు సంబంధించిన ఆధారాలు, వాటి అడ్రస్ లింకులు, పోస్టింగులను జత చేస్తూ మంగళవారం డిజిపికి ఫిర్యాదు చేశారు. 

తన ఫోటోతో కార్టూన్స్ పెట్టి అసభ్య పదజాలంతో కొందరు పోస్టింగ్లు పెడుతున్నారని విజయ సాయి రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్యసభ ఎంపీగా, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తనను కించపరిచేలా, మనస్సును గాయపరిచే లా, తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా .. కొందరు ప్రయత్నిస్తున్నారని విజయ సాయి రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయా పోస్టుల పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విజయ సాయి రెడ్డి ఫిర్యాదు, అందజేసిన వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి