iDreamPost

పాన్ ఇండియా సినిమాకు ఎన్ని చిక్కులో

పాన్ ఇండియా సినిమాకు ఎన్ని చిక్కులో

ఆర్ఆర్ఆర్ హీరోయిన్ అలియా భట్ టైటిల్ రోల్ చేసిన బాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ ‘గంగూబాయ్ ఖటియావాడి’ 2022 జనవరి 6 రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుని ఆ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసేసింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా ట్రైలర్ గత ఏడాదే వచ్చింది. భారీ స్పందన దక్కింది కూడా. రాధే శ్యామ్ తో పాటుగా జూలైలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ లాక్ డౌన్ వల్ల వాయినా పడిపోయింది. ఇప్పుడు మళ్లీ ప్రభాస్ మూవీతో కేవలం తొమ్మిది రోజుల గ్యాప్ తో ఢీ కొట్టేందుకు రెడీ అయ్యింది. అయితే దీనికి మన ఆర్ఆర్ఆర్ కి కనెక్షన్ ఏంటి అనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది

గంగూబాయ్ ఖటియవాడికి, ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ కి నిర్మాత ఒక్కరే. పెన్ స్టూడియోస్. ఒకవేళ రాజమౌళి కనక తన సినిమాను జనవరి మొదటి లేదా రెండో వారంలో రిలీజ్ చేయాలని డిసైడ్ అయితే గంగూబాయ్ ని ఇంకొంత ఆలస్యంగా దింపేవారు. ఎందుకంటే రెండు పాన్ ఇండియా చిత్రాలతో అలియా భట్ ఒక్కతే పోరాటం చేయడం కష్టం. సో జక్కన్నతో డిస్కస్ చేసే ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చనే టాక్ ఉంది. మరోవైపు గంగూబాయ్ నిర్మాతల్లో కూడా ఒకరైన భన్సాలీ ఇదే తేదీకి ముందే డిసైడ్ అయ్యారని ఒకవేళ ఆర్ఆర్ఆర్ వచ్చినా ఇంకోటి వచ్చినా ఏం పర్లేదనే తరహాలో తేల్చిచెప్పేసినట్టు ముంబై మీడియా టాక్.

మహారాష్ట్రలో థియేటర్లు తెరుచుకోబోతున్న వార్త రావడం ఆలస్యం నిర్మాతలు పోటీ పడి మరీ బెర్తులు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఒకవేళ ముందే చెప్పకపోతే లేనిపోని క్లాష్ వచ్చి ప్రొడ్యూసర్ కౌన్సిల్ తో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ముందు జాగ్రత్త వహిస్తున్నారు.దీని వల్ల రేపు చెబుదామా ఎల్లుండి చెబుదామా అని ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్, ఆచార్య లాంటి సినిమాలకు చిక్కొచ్చి పడింది. మరోవైపు కెజిఎఫ్ 2 లాంటివి సైతం విడుదల చెప్పేసుకుని నిశ్చింతగా ఉండగా మనవాళ్ళు మాత్రం టెన్షన్ పడిపోతున్నారు. చూస్తుంటే ఆర్ఆర్ఆర్ వేసవికి రావడం తప్ప వేరే మార్గం లేదా లేక కొత్త షాక్ ఏదైనా ఉందా వేచి చూడాలి

Also Read : బెంగుళూరు మోడల్ సినిమా టికెటింగ్ ఇక్కడ వర్కౌట్ అవుతుందా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి