iDreamPost

అమ్మాయి చదువు కోసం శుబ్‌మన్‌ గిల్‌ ఏం చేశాడంటే..?

  • Published Feb 21, 2024 | 12:20 PMUpdated Feb 21, 2024 | 12:20 PM

Shubman Gill: టీమిండియా యంగ్‌ క్రికెటర్‌ ఓ ఆడపిల్ల చదువు కోసం ఓ చిన్న పని చేసి.. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో బిజీగా ఉంటూనే.. సోషల్‌ మీడియాలో గిల్‌ ఇలా యాక్టివ్‌గా ఉన్నాడు. మరి గిల్‌ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

Shubman Gill: టీమిండియా యంగ్‌ క్రికెటర్‌ ఓ ఆడపిల్ల చదువు కోసం ఓ చిన్న పని చేసి.. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో బిజీగా ఉంటూనే.. సోషల్‌ మీడియాలో గిల్‌ ఇలా యాక్టివ్‌గా ఉన్నాడు. మరి గిల్‌ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 21, 2024 | 12:20 PMUpdated Feb 21, 2024 | 12:20 PM
అమ్మాయి చదువు కోసం శుబ్‌మన్‌ గిల్‌ ఏం చేశాడంటే..?

టీమిండియా యంగ్‌ సూపర్‌ స్టార్‌ శుబ్‌మన్‌ గిల్‌ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే ఫామ్‌లోకి తిరిగి వస్తున్న గిల్‌.. రెండో టెస్ట్‌లో సెంచరీ, మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులు చేసి రాణించాడు. ఈ రెండు ఇన్నింగ్స్‌ల కంటే ముందు ఫామ్‌లో లేని గిల్‌.. దారుణంగా విఫలం అవుతూ వచ్చాడు. దీంతో గిల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. టీమిండియాకు మరో కోహ్లీ అవుతాడు అనుకుంటే.. ఇలా ఆడుతున్నాడేంటి అంటూ క్రికెట్‌ అభిమానులు మండిపడ్డారు. కానీ, రెండో టెస్ట్‌లో సెంచరీతో తన ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు గిల్‌. అలాగే మూడో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో కుల్దీప్‌ యాదవ్‌తో చోటు చేసుకున్న మిస్‌ కమ్యూనికేషన్‌ వల్ల రనౌట్‌ అయ్యాడు. లేకుంటే మరో సెంచరీ పూర్తి చేసుకునే వాడు. అయితే.. ఒక అమ్మాయి కోసం గిల్‌ చేసిన ఒక పని ఇప్పుడు వైరల్‌గా మారింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

శుబ్‌మన్‌ గిల్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటాడు. పైగా అందమైన యంగ్‌ క్రికెటర్‌ కనుక అతని లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ భారీగానే ఉంది. చాలా మంది క్రికెట్‌ అభిమానులు గిల్‌ను సోషల్‌ మీడియా అకౌంట్స్‌లో ఫాలో అవుతూ ఉంటారు. అతను ఏ పోస్ట్‌ పెట్టినా, ఏ ఫొటో పెట్టినా.. లక్షల్లో లైకులు, షేర్లు వచ్చిపడుతుంటాయి. ముఖ్యంగా అమ్మాయిలు గిల్‌ను బాగా ఫాలో అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక అమ్మాయి గిల్‌ను ఉద్దేశిస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్‌ చేసింది. ఆ రీల్‌కు శుబ్‌మన్‌ గిల్‌ కామెంట్‌ చేస్తే.. నేను చదవడం మొదలుపెడతా అని పేర్కొంది.

ఆ రీల్ కాస్త శుబ్‌మన్‌ గిల్‌ కంట్లో పడింది. వెంటనే ఆలస్యం చేయకుండా.. ఆ రీల్‌కు గిల్‌ కామెంట్‌ చేసేశాడు. ఇంతకీ గిల్‌ ఏం కామెంట్‌ పెట్టాడంటే.. ‘ఇక చదవడం మొదలుపెట్టండి’ అని కామెంట్‌ పెట్టాడు. అసలే ఇది పరీక్షల కాలం.. ఇలాంటి టైమ్‌లో అమ్మాయిని చదువుకోవడానికి ఎంకరేజ్‌ చేసినట్లు ఉంటుందని గిల్‌ ఆ రీల్‌కు కామెంట్‌ చేసి ఉంటాడు. ఎంతైనా.. ఒక ఆడపిల్ల చదువు కోసం గిల్‌ ఇలా ఆమె సరదాగా పెట్టిన రీల్‌కు సైతం కామెంట్‌ చేయడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి