iDreamPost

రహస్యంగా అతనితో డేటింగ్ లో ప్రభాస్ హీరోయిన్..!

  • Author ajaykrishna Published - 04:39 PM, Wed - 5 July 23
  • Author ajaykrishna Published - 04:39 PM, Wed - 5 July 23
రహస్యంగా అతనితో డేటింగ్ లో ప్రభాస్ హీరోయిన్..!

ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించి లవ్ స్టోరీస్, డేటింగ్ లాంటి విషయాలు సినీ ప్రేమికులకు చాలా ఇంటరెస్ట్ కలిగిస్తుంటాయి. స్టార్స్ నుండి యంగ్ స్టర్స్ వరకు ఈ విషయంలో మినహాయింపు ఉండదు. అయితే.. కొంతమంది స్టార్స్ ముందే ఫలానా వాళ్లతో డేటింగ్ లో ఉన్నామని, ఫలానా వ్యక్తి తమ లవర్ అని చెబుతుంటారు. కానీ.. కొందరు అలా కాదు. వాళ్ల లైఫ్ లో జరిగే ప్రతీ విషయాన్నీ సీక్రెట్ గా మెయింటైన్ చేస్తుంటారు. అలాంటి వారిలో సాహో బ్యూటీ శ్రద్ధాకపూర్ ఒకరు. కొన్నాళ్ళుగా ఈ భామ చుట్టూ డేటింగ్ రూమర్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. కాకపోతే ఒక్కోసారి ఒక్కో వ్యక్తితో శ్రద్ధా డేటింగ్ చేస్తోందని ప్రచారం జరిగింది.

ఇక ఈ ఏడాది రణబీర్ కపూర్ సరసన ‘తూ ఝాటి మై మక్కర్’ అనే రొమాంటిక్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ముఖ్యంగా ఈ సినిమాలో శ్రద్ధా.. ఎవరూ ఊహించని రేంజ్ లో అందాల ప్రదర్శన చేసింది. అయితే.. మూవీ సంగతి పక్కన పెడితే.. శ్రద్ధా పర్సనల్ లైఫ్ గురించి కొత్తగా మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదీగాక శ్రద్ధా ప్రస్తుతం ఇతనితో సీక్రెట్ గా డేట్ చేస్తోందని కొన్ని ఫోటోలు కూడా నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. మొదట్లో ఫర్హాన్ అక్తర్.. ఆ తర్వాత ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో శ్రద్ధా డేటింగ్ వార్తలు వినిపించాయి. కానీ.. ఇప్పుడు కొత్తగా రాహుల్ మోడీ అనే వ్యక్తితో రహస్యంగా డేట్ చేస్తుందన్న గుసగుసలు ఇండస్ట్రీలో హీటెక్కుతున్నాయి.

మరి ఇంతకీ ఈ కొత్తగా తెరపైకి వచ్చిన రాహుల్ మోడీ ఎవరు? అనే విధంగా ఫ్యాన్స్, నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. రాహుల్ మోడీ రీసెంట్ గా శ్రద్ధా నటించిన ”తూ ఝాటి మై మక్కర్’ మూవీకి రైటర్ కం అసిస్టెంట్ డైరెక్టర్. బాలీవుడ్ లో అంతకు ముందు కూడా పలు సూపర్ హిట్ మూవీస్ కి వర్క్ చేశాడట. మరి శ్రద్ధాకి, రాహుల్ కి ఎక్కడ లింక్ కుదిరింది? అనే సందేహాలు ఓవైపు వ్యక్తమవుతున్నాయి. అయితే.. వీరికి ఎక్కడ కనెక్షన్ కుదిరిందో తెలియదు గాని.. మొత్తానికి ఇద్దరూ ఓ సినిమా చూసి డిన్నర్ కి వెళ్లిన ఫోటోలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఇక వీరి రిలేషన్ షిప్ ఏంటనేది వీరే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. శ్రద్ధా తెలుగులో ప్రభాస్ సరసన సాహో మూవీ చేసిన సంగతి తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి