iDreamPost

యూట్యూబ్ చూసి సొంత వైద్యం.. చివరికి జరిగింది ఏంటంటే?

యూట్యూబ్ చూసి సొంత వైద్యం.. చివరికి జరిగింది ఏంటంటే?

ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. మరీ ముఖ్యంగా గూగుల్, యూట్యూబ్ అందుబాటులోకి రావడంతో ఏ చిన్న సమాచారం తెలుసుకోవాలన్న వెంటనే సెర్చ్ చేస్తూ సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. మాములుగా అందరూ అనారోగ్యకరమైన ఇబ్బందులు కలిగినప్పుడు చికిత్స కోసం వైద్యుడిని సంప్రదిస్తారు. కానీ, మరి కొందరు అతి తెలివిని చూపిస్తూ ఆ వ్యాధి నివారణ చిట్కాల కోసం యూట్యూబ్ లో వెతుకున్నారు. అయితే అచ్చం ఇలాగే యూట్యూబ్ చూసి సొంత వైద్యం కోసం ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అసలేం జరిగిందంటే?

జార్ఖాండ్ లాతేహార్ జిల్లా బులుమత్ పరిధిలోని టోటీ హెస్లా గ్రామం. ఇక్కడే అవదేశ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అయితే ఇతడు గత కొన్ని రోజుల నుంచి డయేరియా వ్యాధితో బాధపడుతున్నాడు. ఇతడు చికిత్స కోసం వైద్యుడిని సంప్రదించకుండా వ్యాధి తగ్గడం కోసం యూట్యూబ్ లో దొరికే చిట్కాల కోసం ప్రయత్నించాడు. ఇందులో భాగంగానే కర్పూరం మింగితే విరేచనాలు తగ్గుతాయని తెలియడంతో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 10 కర్పూరం బిళ్లలు ఒకేసారి మింగాడు. కొద్దిసేపటి తర్వాత అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

అతని కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీంతో వైద్యులు పరిశీలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ.. మోతాదుకు మించి కర్పూరం బిళ్లలు మింగడం కారణంగానే అవదేశ్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. ఇకపోతే.. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోనట్లు అవదేశ్ చేసిన పనికి అతని కుటుంబ సభ్యులు షాక్ గురవుతున్నారు. యూట్యూబ్ చూసి సొంత వైద్యం చేసుకుందామనుకుని అనారోగ్యపాలైన అవేదేశ్ చర్యపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: వీడియో: సినిమా సీన్ రిపీట్.. పెళ్లి పీటల మీద వరుడికి షాకిచ్చిన వధువు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి