iDreamPost

గుడ్లు, చికెన్ విక్రయాలపై ప్రభుత్వం నిషేధం! ఒక్కసారిగా ఇలా ఎందుకంటే?

Bird Flu Alert: బర్డ్ ఫ్లూ అనేది పక్షులకు సోకే ఓ వైరస్. ఇది సోకిన పక్షుల మాంసం తింటే చాలా ప్రమాదం. ఇటీవలే ఓ రాష్ట్రంలో బర్డ్ ప్లూ కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమయైన ఆ ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది.

Bird Flu Alert: బర్డ్ ఫ్లూ అనేది పక్షులకు సోకే ఓ వైరస్. ఇది సోకిన పక్షుల మాంసం తింటే చాలా ప్రమాదం. ఇటీవలే ఓ రాష్ట్రంలో బర్డ్ ప్లూ కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమయైన ఆ ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది.

గుడ్లు, చికెన్ విక్రయాలపై ప్రభుత్వం నిషేధం! ఒక్కసారిగా ఇలా ఎందుకంటే?

బర్డ్ ప్లూ.. ఈ వైరల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది పక్షుల సోకుతుంది. అలా వైరస్ సోకిన పక్షి, కోళ్ల మాంసం తింటే చాలా ప్రమాదం. అందుకే బర్డ ఫ్లూ సోకిందంటే చాలు పౌల్ట్రీ ఫామ్స్ లోని కోళ్లను చంపేస్తారు. ఈ వైరస్ సోకిన మాంసం తింటే మరణాలు కూడా సంభవిస్తాయి. ఇటీవలే ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఈ బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాపిస్తోంది. దీంతో అక్కడ చికెన్, గుడ్ల విక్రయంపై నిషేధం విధించారు. మరి.. ఆ రాష్ట్రం ఏమిటో, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

జార్ఖండ్‌ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ  అత్యంగా వేగంగా వ్యాపిస్తోంది.  దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బర్డ్ ఫ్లూ ను నివారించేందుకు చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే కోళ్లకు సంబంధించిన వివిధ విక్రయాలపై నిషేధం విధించింది. చికెన్, కోడి గుడ్ల విక్రయాలపై ఆ రాష్ట్రం నిషేధం విధించింది. జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని ప్రభుత్వ పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ కేసులు కనిపించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

కోళ్లలు, బాతుల్లో బర్డ్ ఫ్లూ వైరస్ ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో ప్రభుత్వానికి సంబంధించిన పౌల్ట్రీ ఫామ్ హోత్వార్ లో 1745 కోళ్లను, అలానే 450 బాతులతో సాహ దాదాపు 2195 పక్షులను చంపేయాలని ఆదేశించింది. రాంచీలోని హోత్వార్‌లో ఉన్న పౌల్ట్రీ ఫామ్ లో హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అలానే ఈ నిర్థారణ జరిగిన వెంటనే రాష్ట్రం మొత్తాన్ని, ప్రజలను ప్రభుత్వం అలర్ట్ చేసింది. ప్రస్తుతం రాంచీలో హోత్వార్ ప్రాంతంలో కంటైన్మెంట్ ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. కిలోమీటరు పరిధిలో ఎలాంటి కోళ్లు, బాతులు, గుడ్లు కనిపించినా.. వాటిని ఇక్కడికి తీసుకొచ్చి ధ్వంసం చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

సాధారణ వైరస్‌ల మాదిరిగానే, బర్డ్ ఫ్లూ వైరస్ కూడా జంతువులు, పక్షుల నుంతి మానవులకు వ్యాపిస్తాయి. అందుకే రాంచీలోని ప్రభుత్వ పౌల్ట్రీ ఫారమ్‌లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ జరిగిన వెంటనే ప్రభుత్వం అలెర్ట్ అయ్యే.. అక్కడ పనిచేస్తున్న ఇద్దరు వైద్యులతో సహా 6 మంది ఉద్యోగులు క్వారంటైన్ చేశారు. అంతే కాకుండా ఆ పౌల్ట్రీ ఫారమ్ ఉన్న పరిసర ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్‌గా ప్రభుత్వం  ప్రకటించింది. అదే సమయంలో రాంచీ నుంచి ఇతర నగరాలకు బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

హోత్వార్ ప్రాంతంలో చికెన్, గుడ్ల అమ్మకాలను ప్రభుత్వం వెంటనే నిషేధించింది. అంతే కాకుండా అక్కడి నుంచి కోళ్లను మరో ప్రాంతాన్నికి రవాణ చేయకుండా పూర్తి నిషేధం విధించింది. అదే సమయంలో చికెన్, గుడ్లు తినవద్దని ప్రజలకు వైద్యులు సూచించారు. కొన్ని రోజుల క్రితం ఏపీలోని నెల్లూరు జిల్లాలో రెండు మండలాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ కనిపించింది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.  దీంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో బర్డ్ ఫ్లూ వైరస్ అదుపులోకి వచ్చింది. మొత్తంగా బర్డ్ ఫ్లూ వైరస్ కారణం జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి