iDreamPost

వీడియో: సీఎంను ప్రశ్నించాడని జర్నలిస్ట్‌పై దాడి!

వీడియో: సీఎంను ప్రశ్నించాడని జర్నలిస్ట్‌పై దాడి!

ఇటీవల కాలంలో పట్టపగలే వ్యక్తులపై దాడులు, కిడ్నాప్ లు వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యం కొందరు ప్రజాప్రతినిధులు..తమకు ఎదురు ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. వారి అనుచరులతో తమను ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఇలాంటి  ఘటనలో ఎన్నో జరుగుతుండగా..కొన్నే వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా ఓ కేసు విషయంలో సీఎంను ఓ జర్నలిస్ట్ ప్రశ్నించాడు. దీంతో అతడిపై సీఎం అనుచరులు నడిరోడ్డుపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

మహారాష్ట్ర లోని జల్గాన్ జిల్లాలో పచోర అనే ప్రాంతంలో పట్టపగలు నడిరోడ్డుపై  సందీప్ మహాజన్ అనే జర్నలిస్ట్ ను ముఖ్యంత్రి ఏక్ నాథ్ షిండే వర్గానికి  చెందిన ఎమ్మెల్యే కిశోర్ పటేల్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. స్కూటీపై వెళ్తున్న అతడిని అడ్డగించి.. నడిరోడ్డు మీద పడేశారు. అనంతరం విచక్షణ రహితంగా కాళ్లతో తంతూ, చేతులతో కొడుతూ దాడికి పాల్పడ్డారు. సందీప్ నిస్సహాయ స్థితి చేతులు అడ్డు పెట్టుకుని అలానే ఉండిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జర్నలిస్ట్ పై  దాడి జరిగిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.  ఈఘటన జరగడానికి కొన్ని గంటల ముందు కూడా స్థానిక ఎమ్మెల్యే కిశోర్ పటేల్ ఫోన్ చేసి.. సందీప్ ను.. బూతులు తింటాడు. ఓ కేసు విషయంలో సీఎంను, ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.కొంతకాలం క్రితం 8 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది.

ఈ ఘటనలో బాధితులకు న్యాయం జరగాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అలానే ఈ కేసు విషయంలో న్యాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యేను, సీఎం ఏక్ నాథ్ షిండేను సందీప్ మహాజన్ ప్రశ్నించాడు. దీంతో సీఎం అనుచరులు సందీప్ పై దాడికి పాల్పడ్డారు. అయితే సందీప్ పై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి.. కఠినంగా శిక్షించాలని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రస్తుతం సందీప్ పై జరిగిన దాడి దృశ్యాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. మరి.. ఇలా ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్న ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి