iDreamPost

Shikhar Dhawan: బాధ పడుతూ జీవించడం అలవాటైంది! ధావన్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌

టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ ఎమోషనల్ గా షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనకు బాధపడటం అలవాటైందని తాజాగా ఇచ్చిన ఓ పాడ్ కాస్ట్ లో పేర్కొన్నాడు.

టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ ఎమోషనల్ గా షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనకు బాధపడటం అలవాటైందని తాజాగా ఇచ్చిన ఓ పాడ్ కాస్ట్ లో పేర్కొన్నాడు.

Shikhar Dhawan: బాధ పడుతూ జీవించడం అలవాటైంది! ధావన్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌

సాధారణ వ్యక్తులకే కాదు.. సెలబ్రిటీలకూ సమస్యలు ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు తాము బాధపడుతున్న విషయాలను గురించి ప్రపంచానికి తెలియపరుస్తూ ఉంటారు ప్రముఖులు. తాజాగా తన జీవితంలో ఎదుర్కొంటున్న అత్యంత దుర్భర పరిస్థితుల గురించి చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యాడు టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్. గత కొంత కాలంగా బాధపడుతూ జీవించడం అలవాటైందని భావోద్వేగం చెందాడు. ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. తన కొడుకుని తలచుకుని ఎమోషనల్ అయ్యాడు ఈ డాషింగ్ బ్యాటర్.

శిఖర్ ధావన్.. టీమిండియా స్టార్ ఓపెనర్ గా కొంత కాలం ఓ వెలుగు వెలిగాడు. అద్భుతమైన ఆటతీరుతో పాటు ఎంటర్ టైనర్ గా జట్టులో గబ్బర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఇదంతా ఒకప్పుడు. ప్రస్తుతం అతడి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాడు. తన కొడుకు జోరావర్ దూరమైన దగ్గర నుంచి మనసికంగా కుంగుబాటుకు గురవుతూ వస్తున్నాడు. ఇదే విషయాన్ని గతంలో జోరావర్ బర్త్ డే రోజు ఎమోషనల్ పోస్ట్ ద్వారా తెలియజేశాడు. ఈ పోస్ట్ లో తన కొడుకును ఎంతగా మిస్ అవుతున్నాడో, ఎంత బాధను అనుభవిస్తున్నాడో వివరించాడు. సోషల్ మీడియాకి సంబంధించిన అన్ని ఫ్లాట్ ఫామ్స్ లో నన్ను బ్లాక్ చేశారని గతంలోనే వాపోయాడు ధావన్. తాజాగా తన కొడుకును తలచుకుని మరోసారి ఎమోషనల్ అయ్యాడు ఈ సీనియర్ ప్లేయర్.

Feels so sad

హ్యూమన్స్ ఆఫ్ బాంబే పాడ్ కాస్ట్ లో శిఖర్ ధావన్ మాట్లాడుతూ..”నాకు నా కొడుకును హగ్ చేసుకోవాలని ఉంది. ప్రతీ రోజు వాడికి మెసేజ్ లు పంపిస్తూనే ఉన్నాను. అయితే వాటిని రిసీవ్ చేసుకుంటున్నాడో, లేదో నాకు తెలీదు. కానీ తండ్రిగా నా బాధ్యతను నేను నెరవేరుస్తున్నాను. వాడిని నేనెంతో మిస్ అవుతున్నా. ఎంతో బాధగా ఉంది. బాధపడుతూ జీవించడం నాకు అలవాటైంది” అంటూ ఎమోషనల్ అయ్యాడు ధావన్. కాగా.. శిఖర్ తన భార్యతో విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కొడుకు జోరావర్ కూడా ఆమెతో పాటే ఉంటున్నాడు. దీంతో కొడుకు ఎడబాటును తట్టుకోలేక తన బధను అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూనే ఉంటున్నాడు ధావన్. గత కొంతకాలంగా శిఖర్ కొడుకుని చూడలేకపోతున్నాను అన్న మానసిక బాధలో కూరుకుపోయాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి