iDreamPost

8 ఏళ్లలో రూ.13 కోట్లు భార్యకి ఖర్చు! ధావన్ ఇంత నరకం చూశాడా?

  • Published Oct 06, 2023 | 3:02 PMUpdated Oct 06, 2023 | 3:17 PM
  • Published Oct 06, 2023 | 3:02 PMUpdated Oct 06, 2023 | 3:17 PM
8 ఏళ్లలో రూ.13 కోట్లు భార్యకి ఖర్చు! ధావన్ ఇంత నరకం చూశాడా?

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌-అతని మాజీ భార్య ఆయేషా ముఖర్జీకి ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే.. విడాకుల కేసు విచారణ సమయంలో శిఖర్‌ ఎంత మానసిక వేదన అనుభించాడో అనే విషయాలు వెలుగులోని వచ్చాయి. ఒక్కగానొక్క కొడుకుని కనీసం చూడకుండా కొన్నేళ్ల పాటు చేసిందంటా ఆయేషా. తండ్రీకొడుకులను దూరం పెడుతూ.. శిఖర్‌ను మానసికంగా వేధించిందని శిఖర్‌ ధావన్‌ తరఫు లాయర్‌ కోర్టుకు తెలిపారు. ఆయేషాకు అప్పటికే పెళ్లి, విడాకులు అయినా కూడా శిఖర్‌ ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కానీ, ఎక్కువ కాలం వాళ్లిద్దరూ కలిసి సుఖంగా జీవించింది లేదు. చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. ఆమె ఆస్ట్రేలియాలో ధావన్‌ భారత్‌లో ఉంటున్నారు.

ఇలా దూరంగా ఉంటున్న క్రమంలో ఆయేషా.. డబ్బుల కోసం తనను పదే పదే మానసికంగా వేధించిందని కోర్టులో ధావన్‌ వెల్లడించాడు. తన మొదటి వివాహంలో కలిగిన ఇద్దరు కుమార్తెల చదువు కోసం అవసరానికి మించి ధావన్‌ను డబ్బుల కోసం డిమాండ్‌ చేసినట్లు తెలిపాడు. అప్పటికే మొదటి భర్త నుంచి ఆ ఇద్దరు కుమార్తెల కోసం డబ్బులను ఆమె తీసుకుంటూనే ఉందని, అయినా తన నుంచి కూడా డబ్బులు తీసుకునేదని తెలిపాడు. ఏడాదికి సుమారు రూ.80 లక్షల నుంచి కోటి రుపాయాల వరకు కోరేదని అన్నాడు. అలాగే ఆస్ట్రేలియాలో ధావన్‌ తన సొంత డబ్బుతో కొనుగోలు చేసిన మూడు ఆస్తులలో 99 శాతం వాట తన పేరిట రాయాలని, అలాగే మరో రెండు ఆస్తుల్లో తనను కో-ఓనర్‌గా చేర్చాలని కూడా ఆయేషా తనను వేధించినట్లు ధావన్‌ కోర్టుకు తన వాదనల్లో వినిపించాడు. ధావన్‌ పరువుకు నష్టం కలిగించేలా తోటి క్రికెటర్లు, ఐపీఎల్‌ ఫ్రాంచైజీలకు కూడా అయేషా.. సందేశాలు పంపినట్లు కోర్టు గుర్తించింది.

ధావన్‌ వాదనలు విశ్వసించిన కోర్టు, ఆయేషా నుంచి వీటికి వ్యతిరేకంగా ఎలాంటి వాదన లేకపోవడంతో.. కోర్టు ధావన్‌కు విడాకులు మంజూరు చేసింది. అలాగే తన కుమారుడిని ధావన్‌ కలుసుకునేలా కూడా కోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం అకాడమిక్‌ ఇయర్‌ నడుస్తున్న క్రమంలో.. సెలవల్లో ధావన్‌ తన కుమారుడిని తనతో పాటు ఇండియా కూడా తెచ్చుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతం కుమారుడితో వీడియో కాల్స్‌లో మాట్లాడే వెసులుబాటును కోర్టు ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌కి చెందిన అయేషా 8 ఏళ్ల వయసులోనే ఆస్ట్రేలియాకి వెళ్లింది. మెల్‌బోర్న్‌లో కిక్ బాక్సర్‌గా ఎదిగిన అయేషా.. ఓ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి ఇద్దరు కుమార్తెలు కూడా జన్మించారు. కొన్నేళ్లకు వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత ఫ్రెండ్స్‌ ద్వారా పరిచయమైన ధావన్‌ను ఆయేషా రెండో పెళ్లి చేసుకుంది.

2012 అక్టోబర్‌లో ధావన్‌-అయేషాలు వివాహం చేసుకున్నారు. ఇద్దరికి 10 ఏళ్ల వయసు తేడా ఉన్నప్పటికీ.. ఆమెని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న ధావన్. వీరిద్దరికి 2014లో జోరావర్ పుట్టాడు. పెళ్లి తర్వాత ధావన్‌తో కలిసి ఇండియాలోనే ఉంటానని పెళ్లికి ముందు మాటిచ్చిన ఆయేషా.. తన ఇద్దరు కుమార్తెల చదువు కోసం ఆస్ట్రేలియాలోనే ఉండిపోయింది. జోరావర్‌ను సైతం తనతో పాటే అక్కడే పెంచింది. పైగా ధావన్‌తో విభేదాల కారణంగా.. జోరావర్‌ను తండ్రికి దూరంగా ఉంచింది. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ధావన్‌ ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. అయితే.. 11 ఏళ్ల వాళ్ల వివాహ జీవితంలో దాదాపు 8 ఏళ్లుగా వీళ్లు విడిగా ఉంటున్నారు. అయితే.. ఈ 8 ఏళ్ల కాలంలో ధావన్‌.. ఆయేషాకు 13 కోట్ల వరకు ఇచ్చినట్లు ధావన్‌ తరఫు లాయర్‌ వెల్లడించారు. మరి ధావన్‌ విడాకులపై, అతను పడిన మానసిక వేదన గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఏషియన్ గేమ్స్ లో తిలక్ వర్మ థండర్ ఫిఫ్టీ! T-shirt పైకెత్తి..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి