iDreamPost

షేర్షా సినిమా రిపోర్ట్

షేర్షా సినిమా రిపోర్ట్

థియేటర్లు మన దగ్గర తెరుచుకున్నాయి కానీ నార్త్ వైపు పరిస్థితి ఇంకా గందరగోళంగానే ఉంది. కొన్ని ప్రాంతాలు మినహా మహారాష్ట్ర లాంటి చోట్ల ఇంకా సినిమా హాళ్లు ఓపెన్ చేయలేదు. ఈ నెల 19న అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ తో అంతా సద్దుమణుగుతుందనే అంచనాలో ట్రేడ్ వర్గాలు ఉన్నాయి. అది వచ్చిన వారం తర్వాత జనాల పల్స్ మీద క్లారిటీ వస్తుంది. ఈ నేపథ్యంలో హిందీలో డైరెక్ట్ ఓటిటి రిలీజుల ప్రవాహం మాత్రం అలాగే కొనసాగుతోంది. వాటిలో భాగంగా అమెజాన్ ప్రైమ్ ద్వారా నేరుగా రిలీజైన మూవీ షేర్షా. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా భరత్ అనే నేను-వినయ విధేయ రామ ఫేమ్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం

ఇది ఆర్మీ ఆఫీసర్ విక్రమ్ బాత్రా బయోపిక్. కార్గిల్ యుద్ధంలో ప్రాణాలకు తెగించి శత్రువులతో పోరాడి చివరికి దేశం కోసం కన్నుమూసిన వీరోచిత కథ. చిన్నతనం నుంచే మిలిటరీలో చేరాలని లక్ష్యం పెట్టుకున్న విక్రమ్(సిద్దార్థ్ మల్హోత్రా)దానికి తగ్గట్టే కష్టపడి తన కలను నెరవేర్చుకుంటాడు. 1999లో శత్రుమూకలు రెచ్చగొట్టిన కార్గిల్ వార్ లో తన బృందంతో కలిసి ఎన్ని సాహసాలు చేశాడో ఇందులో స్ఫూర్తివంతంగా చూపించారు. విక్రమ్ వ్యక్తిగత జీవితంతో పాటు అతని లైఫ్ లోని కొన్ని ముఖ్యమైన సంఘటనలు షేర్షాలో టచ్ చేశారు. తన పెట్టుకున్న అంచనాలకు మించి సిద్దార్థ్ మల్హోత్రా తనకిచ్చిన విక్రమ్ పాత్రలో చెలరేగిపోయాడు

పవన్ కళ్యాణ్ పంజా, అజిత్ బిల్లా తీసిన విష్ణువర్ధన్ దర్శకత్వం వహించిన షేర్షా మొదటి అరగంట కాస్త సాగదీసినట్టు అనిపించినా అసలు కథలో ప్రవేశించాక వేగం అందుకుంటుంది. అప్పుడెప్పుడో వచ్చిన బోర్డర్ రేంజ్ ఎమోషన్స్ ఇందులో కొన్ని చోట్ల పండాయి కానీ అవి సినిమా మొత్తం కొనసాగలేకపోయాయి. సపోర్టింగ్ క్యాస్ట్ బలహీనత కూడా కొంచెం మైనస్ గా నిలిచింది. లవ్ స్టోరీని ఎక్కువ సేపు పెట్టారు. ఇలాంటి వార్ డ్రామా నుంచి ఏది ఆశిస్తామో దాన్ని విష్ణువర్ధన్ దాదాపుగా అందించారు. బెస్ట్ అనలేకపోయినా ఖచ్చితంగా ఇంట్లో ఉండి చూడాల్సిన క్యాటగిరీలో షేర్షాను నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. సందేహం అక్కర్లేదు

Also Read : 80 రోజుల పోరాటాలతో అఖండ రచ్చ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి