iDreamPost
android-app
ios-app

కమల్ భారతీయుడు 2.. గట్టిగానే ప్లాన్ చేసిన శంకర్!

  • Published Nov 03, 2023 | 6:01 PM Updated Updated Nov 03, 2023 | 6:01 PM

మోస్ట్ వాంటెడ్ సీక్వెల్ లిస్టులో భారతీయుడు 2 సినిమా టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమా నుంచి కంబ్యాక్ ఇండియన్ అంటూ ఇంట్రో సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో ఈ విషయాలను తప్పకుండా గమనించాలి.

మోస్ట్ వాంటెడ్ సీక్వెల్ లిస్టులో భారతీయుడు 2 సినిమా టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమా నుంచి కంబ్యాక్ ఇండియన్ అంటూ ఇంట్రో సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో ఈ విషయాలను తప్పకుండా గమనించాలి.

  • Published Nov 03, 2023 | 6:01 PMUpdated Nov 03, 2023 | 6:01 PM
కమల్ భారతీయుడు 2.. గట్టిగానే ప్లాన్ చేసిన శంకర్!

కమల్ హాసన్– డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు 2 సినిమాకి ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. అంతటి క్రేజ్ ఉన్న సినిమా కాబట్టే.. ఎన్నిసార్లు వాయిదా పడినా కూడా పట్టుబట్టి మరీ తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా నుంచి చిత్ర బృందం తాజాగా కంబ్యాక్ ఇండియన్ అంటూ ఇంట్రో సాంగ్ ని రిలీజ్ చేసింది. అనిరుధ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. అంతేకాకుండా ఈ సాంగ్ చూసిన తర్వాత మైండ్ లోకి వచ్చే మొట్టమొదటి మాట.. శంకర్ గట్టిగానే ప్లాన్ చేశాడు.

శంకర్ సినిమా అంటే కచ్చితంగా పాన్ ఇండియా లెవల్లో సినిమా ప్రేక్షకులకు అంచనాలు ఉంటాయి. అలాంటిది సూపర్ డూపర్ హిట్టు సినిమాకి సీక్వెల్ అనగానే అందరూ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. భారతీయుడు 2 సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అంటూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అభిమానులను హర్ట్ చేయకుండా శంకర్ కూడా వీలైనప్పుడు అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నారు. తాజాగా కంబ్యాక్ ఇండియన్ ఇంట్రో సాంగ్ తో అభిమానులకు శంకర్ ట్రీట్ ఇచ్చారు. అయితే ఈ సాంగ్ చూసిన తర్వాత భారతీయుడు 2 సినిమా కచ్చితంగానే నెక్స్ట్ లెవల్లో ఉండబోతోంది అనే విషయం అర్థమవుతోంది. ఎందుకంటే ఈ సినిమాలో కేవలం కమల్- శంకర్ మాత్రమే పెద్ద అనుకోవడానికి లేదు.. ఇంకా చాలానే స్టార్ కాస్ట్ ఉంది.

సిద్ధార్థ, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య, బోబీ సింహా, వివేక్, ప్రియ భవానీ శంకర్, బ్రహ్మానందం, సముద్రఖని, నేడుముడి వేణు, ఢిల్లీ గణేశ్, మనోబాల, జగన్, కాళిదాస్, గుల్షాన్ గ్రోవర్, జాకీర్ హుస్సేన్, పియూష్ మిశ్రా, అఖిలేంద్ర మిశ్రా.. ఇలా చాలానే పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. వీళ్లందరినీ చూసిన తర్వాత భారతీయుడు 2 సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా వస్తుంది. ఇంత మంది స్టార్ కాస్ట్ కి సినిమాలో సరైన పాత్ర దొరుకుతుందా? ఇంత మందిని సినిమాలో పెట్టి వారి పాత్రలకు న్యాయం చేయగలరా? అని. అయితే భారతీయుడు అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి వీళ్లకు యాక్టింగ్ స్కోప్ ఉంటుందనే చెప్పాలి. అలాగే.. అక్కడుంది డైరెక్టర్ శంకర్ కాబట్టి అలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మరి.. భారతీయడు 2 ఇంట్రో సాంగ్ మీకు ఎలా అనిపించిందో మీ అబిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetGrandpashabetMeritkingCasibomCasibomcasibomjojobet girişjojobet günceldeneme bonusu veren sitelerjojobetMadridbetMadridbetJojobetnakitbahisJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişholiganbetjojobetjojobet girişjojobetbetcio