iDreamPost

Shaitaan OTT: OTTలోకి వచ్చేస్తున్న న్యాచురల్ హర్రర్ థ్రిల్లర్.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

  • Published Apr 29, 2024 | 4:25 PMUpdated Apr 29, 2024 | 4:25 PM

ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు ఓటీటీ సందడి చేస్తున్నాయి. దీనితో ప్రేక్షకులు కూడా ఎంతో ఇంట్రెస్ట్ గా సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఈ వారం ఓటీటీ లో విడుదల కాబోయే సినిమాలలో ఈ సినిమాను మాత్రం అసలు మిస్ కాకండి.

ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు ఓటీటీ సందడి చేస్తున్నాయి. దీనితో ప్రేక్షకులు కూడా ఎంతో ఇంట్రెస్ట్ గా సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఈ వారం ఓటీటీ లో విడుదల కాబోయే సినిమాలలో ఈ సినిమాను మాత్రం అసలు మిస్ కాకండి.

  • Published Apr 29, 2024 | 4:25 PMUpdated Apr 29, 2024 | 4:25 PM
Shaitaan OTT: OTTలోకి వచ్చేస్తున్న న్యాచురల్ హర్రర్ థ్రిల్లర్.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

కొన్ని సినిమాల కోసం ఎంత కాలం వెయిట్ చేసిన తప్పులేదు అనిపిస్తుంది. ఎందుకంటే అవి ఖచ్చితంగా వర్త్ వాచింగ్ ఫిలిమ్స్ అని అందరికి తెలుసు కాబట్టి. ఈ క్రమంలోనే.. ప్రస్తుతం అందరు వెయిట్ చేసే సినిమా ఏదంటే.. అజయ్ దేవగన్, ఆర్ మాధవన్, జ్యోతిక ముగ్గురు కలిసి నటించిన.. హర్రర్ సినిమా “సైతాన్”. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఇక ఇన్ని రోజులకు ఈ సినిమా థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుని ఓటీటీ లోకి రానుంది. ఇప్పటికే ఈ సినిమా ఏ ప్లాట్ ఫార్మ్ లోకి ఎప్పుడు రానుంది అనే విషయాలను చూసేసి ఉంటారు. మరి ఈ సినిమాను ఎందుకు మిస్ చేయకుండా చూడాలి.. ఈ సినిమా కథేంటి.. అనే విషయాలను చూసేద్దాం.

సైతాన్ సినిమాను గుజరాతి రీమేక్ గా రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వికాస్ బాహ్ల్ దర్శకత్వం వహించారు. మార్చి 8న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా .. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సుమారు రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా. ప్రపంచవ్యాప్తంగా.. రూ.211.06 కోట్ల కలెక్షన్స్ ను వసూలు చేసింది. కేవలం పది రోజుల్లోనే ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. దీనితో ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయిన ప్రేక్షకులు. ఎపుడెపుడు ఈ సినిమా ఓటీటీ లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. మరో మూడు రోజుల్లో సైతాన్ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అంటే మే 3 నుంచి ఈ సినిమాను అందరు నెట్ ఫ్లిక్స్ లో చూసేయొచ్చు.

అసలు ఈ ఎందుకు ఈ సినిమా వర్త్ వాచింగ్.. ఈ సినిమా కథేంటి.. అనే విషయానికొస్తే.. క‌బీర్ (అజ‌య్ దేవ్‌గ‌ణ్‌), అతని భార్య జ్యోతి(జ్యోతిక‌) త‌మ కూతురు జాన్వీతో క‌లిసి ఓ విలేజ్‌కు హాలీడే ట్రిప్ కు వెళ్తారు. వెళ్లే దారిలో వారికి ఓ స్నేహితుడిగా.. క‌బీర్‌కు ప‌రిచ‌యం అవుతాడు వ‌న్‌రాజ్ (మాధ‌వ‌న్‌). ఈ క్రమంలో కూతురు జాన్వీ (జానకి)కి ఓ విషపూరితమైన పదార్థం ఇస్తాడు వన్ రాజ్. ఇక అతని రాకతో క‌బీర్ ఫ్యామిలీ క‌ష్టాల్లో ప‌డుతుంది. తన మాయ, మంత్రాలతో క‌బీర్ ఫ్యామిలీని వ‌న్‌రాజ్ ఎలాంటి ఇబ్బందులు పెట్టాడు? అసలు ఆ సైకో వన్ రాజ్ ఎవరు ! ఈ ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేశాడు! అనే విషయాలు తెలుసుకోవాలంటే.. ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే. మరి, “సైతాన్” సినిమా పై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి