iDreamPost

నిప్పుకణిక సర్దార్ భగత్ సింగ్ 89వ వర్ధంతి

నిప్పుకణిక సర్దార్ భగత్ సింగ్ 89వ వర్ధంతి

భగత్ సింగ్ ! ఆ పేరు స్మరిస్తేనే భారతీయులందరి హ్రుదయాలు ఉత్తేజిత మవుతాయి. ఆయన గురించి మాట్లాడుకుంటే తెలియకుండానే పిడీకిళ్ళు బిగుసుకుంటాయు.ఉరికొయ్యల ఉయ్యాలలుగిన వీరుడు అన్న భావన భగత్ సింగ్ రూపం లొ సాక్షాత్కరిస్తుంది. రూపం దాల్చిన విప్లవ స్పూర్థి, చైతన్యం నింపుకున్న త్యాగమూర్తి భగత్ సింగ్. తన ప్రాణ సమానులైన మిత్రులు సుక్దేవ్, రాజ్ గురు, తొ పాటు ఉరికంబం ఎక్కినప్పుడూ ఆయన వయస్సు 23 ఏళ్ళు. అయినా ఆయన సాహసము , సైద్దాంతిక నిర్ద్దేశము నిత్య నూతనగా విరాజిల్లుతూనే ఉన్నాయి. అంతకముందు నినాదం వందే మాతరం, భగత్ సింగ్ నింపిన విద్యుత్తేజం ” ఇంక్విలాబ్ జిందాబాద్ ” (విప్లవం వరద్ధిల్లాలి)

భగత్ సింగ్ ఒక వీరిడిగా సాహసిగా మాత్రమే అందరికి తెలుసు. కాని అతనొ గొప్ప అధ్యయన శీలి. ఆలొచనా పరుడూ ,త్యాగ శీలి ఇది తెలియక ఆయనని చాలామంది ఒక పుస్తక రూపంలొ కాకుండా తుపాకి రూపంలొ చూస్తారు. భగత్ సింగ్ రాసిన రచనలు , వ్యాసాలు చుస్తే ఆప్పటి భారతానికే కాకుండా నేడు మన దేశం ఎదుర్కుంటున్న ఎన్నొ సమస్యలకి ఆయన వ్యాసాలలొ ఒక దిశా నిర్ద్ధేశం దొరుకుతుంది , ఆయాన రాసిన మతఘర్షణలు వాటి నివారణ, అంటరానితనం అనే వ్యాసాలలొ దేశ ప్రజలు ఎలా మెలగాలొ వివరించారు , జైలు నుండి పంజాబ్ విద్యార్ధి మహా సభలకి పంపిన సందేశం లొ దేశం పట్ల రాజకీయాల పట్ల విద్యార్ధులు ఎలా ప్రవర్తించాలొ రాశారు, నవజవాన్ భారత్ సభ అనే విద్యార్ధి సంస్థ, హిందిస్తాన్ సోషలిస్టిక్ రిపబ్లికన్ అసోషియేషన్ అనే విప్లవ సంస్త భగత సింగ్ స్తాపించి దాని మ్యానిఫెస్టో ఇంకొ మిత్రుడు భగవతి చరణ్ తొ కలిసి రూపొంచించారు ఇందులొ ప్రజలు ఎదుకొట్టున సమస్యలు, రాజకియాలపట్ల విద్యార్ధులు చూపవలసిన మక్కువ , ఎలా ప్రవర్తించాలొ వివరించారు అందరు భగత్ సింగ్ గురించి చదివితే విప్లవ వాదులవు తారు అనుకుంటారు అది సుద్ద తప్పు భగత్ సింగ్ గురించి చదివినా ఆయన రచనలు చదివా గొప్ప మానవతా వాదులవుతారు ఆయన గురించి నేటి తరం ఆ మహనీయుని గురించి తెలుసుకోవలసిన అవసరం ఏంతైనా ఉంది.

భగత్ సింగ్ జీవితం లొని ముఖ్య ఘట్టాలు :

జననం : 1907 సెప్టెంబర్ 28 శనివారం పగలు 8:45 బంగా చక్ 105, లాయల్పూర్, పంజాబ్ ( నేడు ఫైస్లాబాద్ పాకిస్తాన్) , తల్లి విద్యావతి , తండ్రి కిషన్ సింగ్
1911 : పాఠశాలలొ ప్రవేశం – బంగా, లాయల్పూర్
1917 : హై స్కూల్ విధ్య లాహోర్ లో (డి.ఏ.వి) దయానంద్ ఆంగ్లొ వేదిక్ పాటశాల లొ చేరారు
1919 : ఏప్రిల్ 14 – అంతకముందు రొజు జనరల్ డయ్యర్ ఆద్వర్యంలో నరమేధం జరిగిన జలియన్ వాలా భాగ్ ప్రదేశాన్ని సందర్సించిన భగత్ సింగ్
1921 : 14 ఏళ్ళ భగత్ సింగ్ గాందీజీ సహాయనిరాకరణ ఉద్యమం పిలుపుతొ 9వ తరగతిలో స్కూలు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొన్నారు.
1921 : లాలా లజపతి రాయి స్తాపించిన లాహొరు జాతియ కళాశాలలొ బి.ఏ లొ చేరారు
1922 : ఫిబ్రవరి 5 న చౌరి చౌరా ఘటనతొ గాంధిజీ సహాయ నిరాకరణ ఉద్యమం ని విరమించుకున్నారు
1923 : తండ్రి పెళ్ళి సంబందాలు చుడటం తొ నా జీవితం దేశానికి అంకితం అని లేఖ రాసి ఇళ్ళు వదిలి కాన్ పుర్ వెళ్ళీపొయారు.
1923 : రాంప్రసాద్ బిస్మిల్, సన్యాల్ బాబు, చంద్రశేఖర్ ఆజాద్ ఆద్వర్యం లొ స్థాపించిన హిందుస్తాన్ రిపబ్లికన్ అసోషియేషన్ లో భగత్ సింగ్ చేరారు
1924 : పెళ్ళి ప్రస్తావన్ తీసుకురాము అనంటం తొ తిరిగి లాహోర్ లోని తన ఇంటికి చెరుకున్నారు
1924 : భాయి పెరు ఉద్యమం లొ పాల్గోనడంతో అరెస్టు వారెంటు, తిరిగి ఇంటినుండి కాన్ పుర్ వెళ్ళీపొయారు
1925 : కకొరి రైలు దొపిడి హిందుస్తాన్ రిపబ్లికన్ అసోషియేషన్ ముఖ్యులు అరెస్టు.
1926 : భగత్ సింగ్ ఆద్వర్యంలో నవజవాన్ భారత్ సభ విద్యార్ది సంస్థ ప్రారంభం.
1926 : లాహొరు దసరా ఉత్సవం లొ బాంబు పేలుడు
1927 : భగత్ సింగ్ మీద నెపం నెట్టి విచారించి ఆదారాలు లేక 5 నెలల తరువాత విడిచి విడిపెట్టారు.
1927: కకొరి రైలు దొపిడి తీర్పు హిందుస్తాన్ రిపబ్లికన్ అసోషియేషన్ ముఖ్యులు రాంప్రసాద్ బిస్మిల్, రొషన్ సింగ్, రాజేంద్ర లహరి, అస్ఫకుల్లా ఖాన్ల ఉరి.
1928: సెప్టెంబర్ 8,9 న ఫిరొజ్ షా కొట్లా మైదానం లొ ఉత్తర భారత విప్లవ సంస్తలతొ రహస్య మీటింగ్ పెట్టి హిందుస్తాన్ రిపబ్లికన్ అసోషియేషన్ ని హిందుస్తాన్ సోషలిస్టిక్ రిపబ్లికన్ అసోషియేషన్ గా పేరు మార్చిన భగత్ సింగ్.
1928: సెప్టెంబర్ చివరి లొ ఫిరొజ్పుర్ పార్టి ఆఫీసు లొ సిక్కు సాంప్రదాయాన్ని వదిలి గెడ్డాన్ని, జుట్టు త్వలగించుకున్నారు.
1928: సెప్టెంబర్ 30 లాహోర్ వచ్చిన సైమన్ కమీషన్ కు సైమన్ గో బ్యాక్ నినాదాలతో నిరసన తెలిపిన లాలా లజపతి రాయిని స్కాట్ అనే పొలీసు ఆదేశాలతొ సాండర్స్ అనే పొలీసు తీవ్రం గా గాయపరిచారు.
1928: నవంబర్ 17 న పోలీసుల దెబ్బలకి తాలలేక లాలాజీ చనిపొయారు
1928 : డిసెంబర్ 17 న లాలాజి మరణానికి ప్రతీకారం గా భగత్ సింగ్ సాండర్స్ లాహోర్ పొలీస్ స్టేషన్ ముందే కాల్చి హత్య చేశారు
1928 : డిసెంబర్ 17 భగత్ సింగ్ తనని 3 రోజుల్లో పట్టుకున్న వారికి 5 వేలు భహుమతి ఇస్తా అని పొలీసులకి చాలెంజ్ చేసి లాహొరు లొ పోస్టర్లు అంటించారు
1928: డిసెంబర్ 20 న పొలీసుల కళ్ళు కప్పి రైలు లొ కలకత్త వెళ్ళిపొయారు.
1929 : జనవరి లొ బెంగాల్ విప్లవ కారుడు జతిన్ దాస్ ని కలుసుకుని బాంబులు తయారి నేర్చుకున్నారు
1929 : ఫెబ్రవరీ లొ ఆగ్రా లొ విప్లవకారులతొ కలిసి బాంబు ఫ్యాక్టరి ఏర్పాటు చేశారు
1929 : మార్చ్ 6 న ఆగ్రా లొ తయారైన బాంబును తీసుకెళ్ళి ఝాన్సి లొ పరీక్షించారు
1929 : ఏప్రిల్ 3 న డిల్లీ లొని కాశ్మీర్ గేట్ ప్రాంతం లొ ఒక స్టుడియొ లొ టొపీ తొ ఫొటొ దిగారు ( మనకి పరిచయం లొ ఉన్న టొపీ తొ భగత్ సింగ్ పొటొ ఇదే )
1929 : ఎప్రిల్ 8 న బ్రిటిషు నిరంకుశ చట్టాలకి వ్యతిరెకంగా డిల్లీ సెంట్రల్ అశంబ్లీ లొ బాంబులు విసురి స్వచ్చందంగా పట్టుబడ్డారు
1929 : జూన్ 4 డిల్లీ అసెంబ్లీ బాంబు కేసు పై డిల్లీ లొ విచారణ ప్రారంబం
1929 : జూన్ 6 అశంబ్లీ లొ బాంబు వేయుట వెనక ఉన్న తన ఉద్దేశం ను రాత పూర్వకంగా కొర్టు లొ వాంగ్మూలం ఇచ్చిన భగత్ సింగ్
1929: జూన్ 12 న బాంబు కేసు లొ యావర్జీవ ద్వీపాంతర వాస శిక్ష (అండమాన్ జైల్) వేస్తు కోర్టు తీర్పు
1929 : జూన్ 14 న ఖైదీల హక్కులకొసం నిరాహార దీక్ష ప్రారంభం
1929 : జూన్ 30 దేశ వ్యాప్తంగా భగత్ సింగ్ సంఘీభావం దినం
1929 : జులై 10 సాండర్స్ హత్య మీద లాహొర్ కుట్ర కేసు ప్రారంభం
1929 : సెప్టెంబర్ 13 న నిరాహార దీక్ష లొ జతిన్ దాస్ 63 వ రొజు మరణం
1929 : అక్టొబర్ భగత్ సింగ్ నిరాహార దీక్ష 114 వ రొజు వచ్చుట బ్రిటీషు వారు హక్కులు కల్పిస్తాము అని మాట ఇచ్చుట
1929 : అక్టొబర్ ముద్దయిలొ ఒకడైన ప్రేం దత్ అప్రూవర్ అయిన జై గొపాల్ మీదకి కొర్టు లొ చెప్పు విసిరే సరికి కొర్టు లొ జడ్జీల ముందు పొలీసులు భగత్ సింగ్ బృందాన్ని కోట్టడంతో భగత్ సింగ్ కొర్టుని బహిస్కరించారు.
1930 : ఫిబ్రవరీ 4 న ఇచ్చిన హామిలు నెరవేర్చలేదని మల్లి నిరాహార దీక్ష కి దిగారు
1930 : ఫిబ్రవరీ 19 న ఏర్పడిన కమిటీతో దీక్ష విరమించుకున్నారు
1930 : మే 1 న వైస్రాయి ఆదేసాలతొ కేసు స్పెషల్ ట్రిబునల్ కి మార్చారు (ముద్దాయిలు కొర్టుకి రాకున్న కేసు ప్రొసీడింగ్స్ ఆగవు )
1930 : అక్టొబర్ 7 న ట్రిబునల్ తీర్పు – భగత్ సింగ్ ,రాజ్ గురు, సుక్దేవ్ కి 1930 అక్టొబర్ 27న ఉరి శిక్ష కరారు చేశారు
1930 : అక్టొబర్ లొ తీర్పు మీద ప్రివ్యు కౌన్సిల్ లొ అప్పీలు
1931 : ఫిబ్రవరీ 12 న ప్రివ్యు కౌన్సిల్ అప్పిలు రద్దు
1931 : మార్చ్ 5 న గాంధి ఐర్విన్ ఒడంబడిక
1931 : మార్చ్18 న బ్రిటీషు ప్రభుత్వం భగత్ సింగ్ ఉరితీత తేది ప్రకటన
1931 : మార్చ్ 23 సాయంత్రం 7:30 కి భగత్ సింగ్ , రాజ్ గురు, సుఖ్ దేవ్ లకు ఉరి శిక్ష అమలు.

పొలీసులు భగత్ సింగ్ ,రాజ్ గురు, సుక్దేవ్ లను ఉరి తీసిన తరువాత వారి పార్ధివ దేహాలని వారి కుటుంబ సభ్యులకి ఇవ్వకుండా లాహొరు జైలు వేనక గొడను బద్దలకొట్టి వారి దేహాలని ఫిరొజ్ పూర్ దగ్గర సట్లజ్ నది దగ్గర ముక్కలు గా నరికి కిరొసిన్ పొసి బ్రిటీషు సైనికులు తగలపెట్టారు ఇది తెలుసుకున్న భగత్ సింగ్ సోదరి అమర్ కౌర్ కొంత మందిని తీసుకుని అక్కడకి వెళ్ళి సగం కాలిన వారి దెహాలని లాహోరు కి తెచ్చి 24వ తెదీన లాహోరు సివారులలొని రావీ నది ఒడ్డున సక్రమంగా అంత్యక్రియలు నిర్వహించారు .

భగత్ సింగ్ చివరిగా ఉరికంబం ముందు అన్న మాటలు

జైలర్ సాబ్ మీరు చాలా అద్రుష్టవంతులు ఎందుకంటే ఒక భారతీయ విప్లవ వాది తన దేశం కొసం నవ్వుతు ఎలా ప్రాణాలు వదల గలడొ చూడగలుగుతున్నారు మాత్రుభూమి మీద ప్రేమ నా చావు తరువాత కూడా నా హ్రుదయాన్ని వీడదు, ఆ ప్రేమ పరిమళం నా బూడిద నుండి వచ్చే వాసన లొ కూడా ఉంటుంది. ” బ్రతికి ఉన్న భగత్ సింగ్ కన్నా, చనిపొయిన భగత్ సింగ్ ఇంకా ప్రమాదకరం ” ఇంక్విలాబ్ జిందాబద్ (ఇవి భగత్ సింగ్ చివరి మాటలు)

23 ఎళ్ళ భగత్ సింగ్ గురించి గాంధి గారి మాటలు

భగత్ సింగ్ ధైర్య సహాసాలని అంచనా వేయటం అసాద్యం , అతను సహచరులతొ దేశం కొసం ఉరికంబం ఎక్కటం అనే చర్య అతులిత ధైర్య కిరీటం ని అలంకరించింది ,ఆ యువకుల దేశభక్తి , క్రీయా శీలాన్ని, గురించి ఎంత పొగడ్తలు వర్షించినా — వాటన్నిటితొ,నేను ఏకీబవిస్తాను . మనం వారిలా మన ధైర్య శక్తి ని ప్రదర్శించలేకపొయినా , వారి త్యాగాన్ని , ధైర్యాన్ని , అపార సహాసాన్ని ప్రదర్సించాల్సిందే.

నేతాజి సుభాష చంద్రబొసు గారు

“భగత్ సింగ్ ఇప్పుడు ఒక వ్యక్తి కాదు — ఒక ఆదర్శ చిహ్నం . దేశాన్ని ఉర్రూతలూగిస్తున్న ఒక విప్లవ కాంక్ష ప్రభంజనానికి భగత్ సింగ్ ఒక గుర్తు , మార్గదర్శి ! అతని ఆత్మ శక్తిని, ఎవరూ ఒడించలేరు . ఆ శక్తి రగిలించిన విప్లవ జ్వాలలని ఏవరూ ఆపలేరు”.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి