iDreamPost

కొత్త సినిమాల టార్గెట్ జనవరి 26

వాల్తేరు వీరయ్య బలంగా ఉండటం మిగిలినవాటికి కనీసం రెండు వారాలకు సరిపడా థియేటర్ అగ్రిమెంట్లు జరగడం వల్ల స్క్రీన్ల కోసం ఇబ్బంది పడటం ఇష్టం లేని ప్రొడ్యూసర్లు ఫ్రైడేని డ్రైగా వదిలేయబోతున్నారు. ఫ్రెష్ సందడి జనవరి 25 మొదలుకానుంది

వాల్తేరు వీరయ్య బలంగా ఉండటం మిగిలినవాటికి కనీసం రెండు వారాలకు సరిపడా థియేటర్ అగ్రిమెంట్లు జరగడం వల్ల స్క్రీన్ల కోసం ఇబ్బంది పడటం ఇష్టం లేని ప్రొడ్యూసర్లు ఫ్రైడేని డ్రైగా వదిలేయబోతున్నారు. ఫ్రెష్ సందడి జనవరి 25 మొదలుకానుంది

కొత్త సినిమాల టార్గెట్ జనవరి 26

సంక్రాంతి సినిమాలకు ఇంకో రెండు వారాల స్ట్రాంగ్ రన్ దక్కడం సులభంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు రాబోయే శుక్రవారం ఏ కొత్త రిలీజుని నిర్మాతలు ప్లాన్ చేసుకోలేదు. వాల్తేరు వీరయ్య బలంగా ఉండటం మిగిలినవాటికి కనీసం రెండు వారాలకు సరిపడా థియేటర్ అగ్రిమెంట్లు జరగడం వల్ల స్క్రీన్ల కోసం ఇబ్బంది పడటం ఇష్టం లేని ప్రొడ్యూసర్లు ఫ్రైడేని డ్రైగా వదిలేయబోతున్నారు. ఫ్రెష్ సందడి జనవరి 25 మొదలుకానుంది. షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జీరో తర్వాత మూడేళ్ళకు పైగా గ్యాప్ తీసుకుని బాద్షా చేసిన హై వోల్టేజ్ యాక్షన్ మూవీ కావడంతో అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి.

రిపబ్లిక్ డేకి ఒక రోజు రాబోతున్న షారుఖ్ బాలీవుడ్ చాలా కాలంగా చూడని బిగ్గెస్ట్ ఓపెనింగ్ వస్తుందనే నమ్మకం ట్రేడ్ లో కనిపిస్తోంది. హిందీనే కాక ఇతర భాషల్లోనూ దీని మీద క్రేజ్ బాగానే ఉంది. ఒక రోజు ఆలస్యంగా సుధీర్ బాబు ‘హంట్’ 26న బరిలో దిగనుంది. మలయాళం సూపర్ హిట్ ముంబై పోలీస్ కి ఫ్రీమేక్ గా దీని గురించి ప్రచారం ఉంది కానీ అదెంత వరకు నిజమో రిలీజయ్యాకే చెప్పగలం. శ్రీదేవి సోడా సెంటర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వరస డిజాస్టర్ల తర్వాత సుధీర్ బాబు ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. మరో మల్లువుడ్ అఫీషియల్ రీమేక్ ‘బుట్టబొమ్మ’ అదే రోజు రానుంది. ఒరిజినల్ గా వచ్చిన కప్పేలా అక్కడ పెద్ద హిట్టు

కన్నడ స్టార్ హీరో దర్శన్ నటించిన ‘క్రాంతి’ మల్టీ లాంగ్వేజ్ లో విడుదల చేయబోతున్నారు. గతంలో ఇతని రాబర్ట్ ఆడలేదు కానీ టాలీవుడ్ మార్కెట్ మీద ఇతను పెద్ద కన్నే వేశాడు. ‘రెబెల్స్ అఫ్ తుపాకుల గూడెం’ అనే మరో చిన్న మూవీ రేస్ లో ఉంది. ఇవి కాకుండా హిందీ నుంచి గాంధీ గాడ్సే ఏక్ యుద్, హూ యాం ఐ కూడా వస్తున్నాయి. వీటి మీద బజ్ అంతంత మాత్రమే. వీటిలో ఏవి ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయో వేచి చూడాలి. కాకపోతే భారీ బజ్ తో ఉన్నది చూసే తీరాలన్న ఆసక్తి రేపేది సగటు ఆడియన్స్ కి ఏదీ లేదు. కేవలం టాక్ మాత్రమే ఆడియన్స్ ని తీసుకురావాలి. కంటెంట్ బలంగా ఉంటే వస్తారు కానీ చూడాలిమరి ఏం జరగనుందో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి