iDreamPost

సీనియర్ ఎమ్మెల్యే నోముల మరణం

సీనియర్ ఎమ్మెల్యే నోముల మరణం

తెరాస నేత ,నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఈ ఉదయం అప్పోలో హాస్పిటల్లో మరణించారు. 64 సంవత్సరాల నోముల నర్సింహయ్య కొద్దీ రోజులుగా అనారోగ్యంతో అప్పోలో హాస్పటల్ ల్లో చికిత్స పొందుతున్న నోముల ఈ తెల్లవారుజామున గుండెపోటు రావటంతో మరణించారు.

కమ్యూనిస్టుల ముఖ్యంగా సిపిఎం కంచుకోటలాంటి నకిరేకల్ లో పుట్టిన నోముల ఉస్మానియాలో లా చదివారు. విద్యార్థి దశలో SFI లో క్రియాశీలకంగా పనిచేశారు . నల్గొండ జిల్లా కోర్టులో లాయర్ గ ప్రాక్టీస్ చేసిన నోముల నకిరికేల్ మండల అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేశారు.

ఎమ్మెల్యే గా ఎన్నిక

నకిరికేల్ నియోజకవర్గం లో 1957 నుంచి 1994 మధ్య జరిగిన తొమ్మిది ఎన్నికల్లో కమ్యూనిస్టులు ఎనిమిదిసార్లు గెలిచారు. సిపిఎం తరుపున సీపీఎం నేత నర్రా రాఘవరెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.1972 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడి నుంచి కాంగ్రెస్ గెలిచింది.

Read Also : రాజధానిలో రైతులు… దేశ పర్యటనలో నేతలు

1999 ఎన్నికల్లో టీడీపీ కమ్యూనిస్టుల మధ్య పొత్తు తెగింది.ఆ ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో జతకట్టాడు. 1999 ఎన్నికల నాటికి 75 సంవత్సరాల వయస్సు ఉన్న సీనియర్ నాయకుడు నర్రా రాఘావరెడ్డి పోటీ నుంచి తప్పుకోవడంతో ఎంపీపీ గా ఉన్న నోముల నర్సింహయ్యకు తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం వచ్చింది. ఆ ఎన్నికల్లో సిపిఎం నకిరేకల్ ,భద్రాచలం సీట్లు మాత్రమే గెలిచింది, సిపిఐ ఒక్క సీట్ కూడా గెలవలేదు.

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నోముల నర్సింహయ్య సిపిఎం పక్ష నాయకుడిగా ప్రజా సమస్యల మీద ముఖ్యంగా విద్యుత్ పోరాటం, ఇతర ప్రజా సమస్యల మీద సభలో బలంగా తన వాణి వినిపించారు. ప్రజా నాయకుడు నర్రా రాఘవ రెడ్డికి సరైన వారసుడు వచ్చాడన్న మంచి పేరు నోముల నర్సింహయ్య సాధించారు.ఉమ్మడి రాష్ట్రం నుంచి సమస్యల మీద ముఖ్యమంత్రి లేదా మంత్రులను కలవటానికి హైద్రాబాద్ వెళ్లిన ప్రజలకు,ప్రజా సంఘాల ప్రతినిధులకు అందుబాటులో ఉండేవారు.

2004లో మరోసారి ఎమ్మెల్యే గా గెలిచిన నోముల నర్సింహయ్య కాంగ్రెస్తో మిత్రపక్షం గాఉన్న తోలి మూడేళ్ళలో పాటు పొత్తు చెందిన చివరి రెండేళ్లలో కూడా అనేక పనులు చేయించగలిగారు.నర్సింహయ్య లోని హాస్య చతురత అందరిని ఆకట్టుకునేది.

2009 నియోజకవర్గాల పునఃవిభాజనలో భాగంగా నకిరేకల్ SC రిజర్వేడ్ కావాటంతో సిపిఎం నోముల నర్సింహయ్యను భువనగిరి లోక్ సభ స్థానంలో పోటీకి దించింది. ఆ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండటం తో నోముల గెలుస్తారనుకున్నా కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచారు.
తెరాస వైపు ప్రయాణం

Read Also : అయ్యో.. చంద్రబాబు ఇంకా అక్కడే ఉండిపోయారు!

తెలంగాణ ఏర్పాటుకు సిపిఎం మద్దతుగా నిలవలేదు. అనేకం మంది నాయకులు తెలంగాణాకు మద్దతు ఇవ్వాలని కోరినా సిపిఎం విధానపరంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటు వ్యతిరేకం అని ప్రకటించింది.

2014 ఎన్నికల సందర్భంలో నామినేషన్ల ముగింపుకు ఒక్కరోజు ముందు ఏప్రిల్ 7న నోముల నర్సింహయ్య తెరాసలో చేరారు.ఆ ఎన్నికల్లో కెసిఆర్ నాగార్జున సాగర్ ఎమ్మెల్యే టికెట్ నోముల కు ఇవ్వగా ఆయన జానా రెడ్డి మీద 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

2018 ఎన్నికల్లో జానారెడ్డిని ఓడించి నోముల తెరాస తరుపున ఎమ్మెల్యే గా గెలిచారు. 

నోముల నర్సింహయ్య సిపిఎం ను వదిలి వెళ్ళటం మీద స్థానికంగా వ్యతిరేకత ఉన్నా గతంలో చేసిన మంచి పనులను గుర్తుపెట్టుకుంటారు. నోముల నర్సింహయ్యకు నివాళి.

Read Also : జేసీ దివాకర్‌రెడ్డికి షాక్ – 100 కోట్ల జరిమానా..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి