iDreamPost

రాజధాని వికేంద్రీకరణ విషయంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందా?

రాజధాని వికేంద్రీకరణ విషయంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందా?

చైర్మన్ గారు మీ సెలెక్ట్ కమిటి నిర్ణయాన్ని నేను అమలు పర్చలేను అని మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు రెండుసార్లు దస్త్రాన్ని చైర్మన్ కు తిప్పి పంపటంతో రాజ్యాంగ సంక్షోభం అంటూ పత్రికలూ వార్తలు రాసిన నేపథ్యంలో 

శాసనమండలి కార్యదర్శి సెలక్ట్‌ కమిటీ దస్త్రాన్ని ఎందుకు వెనక్కి పంపాడు?
మండలి చైర్మన్ కు రాసిన నోట్ లో కార్యదర్శి “భను నడపడంలో ఛైర్మన్‌కు సలహాలు ఇవ్వటం,గైడ్ చెయ్యటం,సహాయపడటం నా బాధ్యత. నిబంధనల అమలులో లోపాలు,పొరపాట్లు ఉంటె వాటిని చైర్మన్ కు తెలియచెప్పటం నా విధి ” అని ప్రస్తావించిన కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు … ఒక బిల్లును సెలెక్ట్ కమిటీ పంపటానికి రాజ్యాంగ విధి విధానం ఉంది .. బిల్లు ఆమోదానికి సంబంధిత మంత్రి ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ్యులు సవరణ ప్రతిపాదించటం ద్వారా రాజ్యాంగంలోని 189వ అధికరణలోని ఒకటవ నిబంధన ప్రకారం జరగాలి– అని నిబంధనను వివరించాడు. సభ్యులు కోరుకున్నారని,ఏకాభిప్రాయం ఉందని సెలెక్ట్ కమిటీ కి బిల్లును పంపటం నిబంధనలకు విరుద్ధం అని కూడా ఆ నోట్ లో కార్యదర్శి పేర్కొన్నారు.

మండలి కార్యదర్శి మీద సభా ధిక్కరణ లేక హక్కుల తీర్మానం ప్రవేశ పెడతారా?
చైర్మన్ నిర్ణయం అంటే సభా నిర్ణయమే. చైర్మన్ నిర్ణయాన్ని అమలు చేయకపోవటం అంటే సభా ధిక్కరణే కాబట్టి సభ్యలు ఎవరైనా ఫిర్యాదు చేస్తే కార్యదర్శిని సభా ధిక్కరణ కింద విచారించవచ్చు అని యనమల రామకృష్ణుడు చెప్పాడు.

స్పీకర్ గా పనిచేసిన యనమల ప్రతిసందర్భంలో తన వాదనకు అనుకూలంగా రాజ్యాంగ నిబంధనలను ఉటంకిస్తూ మాట్లాడుతుంటారు కానీ వాటిలో ప్రాధమిక అంశాలు విస్మరిస్తుంటారు. శాసనమండలి కార్యదర్శి గవర్నర్ ద్వారా నియమించబడ్డ ఒక ఉద్యోగి.ఆయనకు హక్కులు విధులు ఉంటాయి.. కార్యదర్శి మీద చర్యలు తీసుకోవాలంటే గవర్నర్ కు ఫిర్యాదు చెయ్యాలి…మండలి ఉద్యోగి మీద సభా హక్కులు ఏ నిబంధన ప్రకారం పెడతారో యనమల చెప్పాలి. మండలి కార్యదర్శి మీద చర్యలు శాఖ పరంగా ఉంటాయి కానీ సభా హక్కుల ధిక్కరణ కింద ఉండవు అని మాజీ స్పీకర్ కు ఒకరు చెప్పాలా?

మండలి కార్యదర్శి మీద సభా హక్కుల నోటీస్ ఇస్తే ఏమవుతుంది?
శాసనసభకు,శాసనమండలికి వేరు వేరు కార్యదర్శులు ఉండాలి. కానీ ప్రస్తుతం బాలకృష్ణమాచార్యులు రెండు సభలకు కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. మండలి బాలకృష్ణమాచార్యులు మీద చర్యలకు దిగితే శాసనసభ తమ కార్యదర్శి అయినా బాలకృష్ణమాచార్యులు ను కాపాడుకోదని,ఆయన మీద చర్యల అమలును అడ్డుకోలేదని యనమల లాంటి వాళ్ళు ఎలా భావిస్తున్నారో అర్ధం కాదు.

శాసనసభ స్పీకర్ అనుమతి లేకుండా బాలకృష్ణమాచార్యులు మీద ఎవరు చర్యలు తీసుకోలేరు… ఎవరన్నా తొందరపడితే అది శాసనసభ ధిక్కరణ అవుతుంది.

రాజ్యాంగ సంక్షోభమా?
రాజ్యాంగం ప్రకారం మండలి రాష్ట్రాల ఛాయిస్… మండలి హక్కులు పరిమితం.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అమలు కాకుండా మండలి అడ్డుకోలేదు… దీని మీద ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవు.. మండలి చైర్మన్ రూల్ లేదు అయినా నా విచక్షణాధికారం మేరకు సెలెక్ట్ కమిటీకి బిల్లు పంపుతున్నానని ప్రకటించి సభ నిరవధికంగా అవాయిదా వేసుకొని సొంత ఊరికి వెళ్లారు…

మండలి చైర్మన్ కు లేని విచక్షణాధికారానికి రాజ్యాంగం ఎక్కడ రక్షణ కల్పిస్తుందో!!మండలిలో మాకు ఆధిక్యం ఉంది కాబట్టి ఏమైనా చేస్తామంటూ టీడీపీ ఎమ్మెల్సీలు మాట్లాడటం మీడియోలో చెల్లుబాటు కావచ్చుకానీ నిబంధనల ముందు కుదరదు…

రాజ్యాంగం సంక్షోభం అనటానికి ఇదేమి రాజ్యాంగ ధిక్కరణ కాదు.. కోర్టు కెళ్ళినా న్యాయమూర్తులు మొదటి అడిగేది నిబంధనల గురించే!

14 రోజుల గడువు ముగిసింది కాబట్టి బిల్లు ఆమోదం పొందినట్లే అని వైసీపీ నేత ఉమ్మారెడ్డి అన్నట్లు ప్రభుత్వం ముందుకెళితే దాన్ని తేల్చటానికి పుణ్య కాలం ముగిసిపోతుంది…

సభలు ప్రోరోగ్ అయ్యాయి కాబట్టి మళ్ళి మండలి సమావేశం జరిగే వరకు ఈ వివాదం కొనసాగొచ్చు కానీ రాజధాని వికేంద్రీకరణ పనులు వాటిపాటికి అవి కొనసాగుతూనే ఉంటాయి … గతంలో ఎన్టీఆర్ చేసినట్లు మండలిని సమావేశపరచకుండా కేవలం శాసనసభను మాత్రమే సమావేశ పరచవచ్చు .. ఇంకా టీడీపీ వాదనంతా మీడియాలోనే చేసుకోవాలి !!!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి