iDreamPost

ఏపీలో పాఠశాలల పునః ప్రారంభానికి తేదీని ప్రకటించిన సీఎం జగన్

ఏపీలో పాఠశాలల పునః ప్రారంభానికి  తేదీని ప్రకటించిన సీఎం జగన్

కరోనా వైరస్‌ ధాటికి అన్ని వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. అర్థంతరంగా అన్ని రంగాలు ఒక్కసారిగా ఆగిపోవడంతో ఆ నష్టం ఊహించని విధంగా ఉంది. ఆర్థికంగానే కాకుండా సామాజికంగా, మేథస్సు పరంగా భారీ నష్టం వాటిల్లింది. ముఖ్యంగా విద్యార్థుల చదువులకు త్రీవ నష్టం జరిగింది. మార్చి 23వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ అమలులోకి రావడంతో విద్యా సంవత్సరం చివరలో విద్యార్థులు విలువైన సమయాన్ని కోల్పోయారు. పరీక్షలు వాయిదా పడ్డాయి.

ప్రభుత్వాల పటిష్ట చర్యలతో కోవిడ్‌ ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్క రంగం పునఃప్రారంభం అవుతోంది. రెడ్‌జోన్లు, కంటైన్‌మెంట్‌ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో ప్రజలు గూమికూడని అన్ని కార్యకలాపాలకు ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. ప్రజా రావాణా కూడా ప్రారంభానికి పచ్చజెండా ఉపాయి. ఈ క్రమంలో విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే సమయం దగ్గరపడే కోద్దీ విద్యార్థులు, వారి తల్లి దండ్రుల్లో పాఠశాలల పునః ప్రారంభంపై నెలకొన్న ఉత్కంఠకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ తెరదించారు. ఏపీలో ఆగస్టు 3వ తేదీ నుంచి పాఠశాలలను ప్రారంభిస్తామని ప్రకటించారు. ఆలోపు 15,715 పాఠశాలల్లో నాడు నేడు మొదటి దశ కింద 9 రకాల సౌకర్యాల కల్పన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సాధారణంగా ప్రతి ఏడాది జూన్‌ 12వ తేదీన పాఠశాలలు ప్రారంభమవుతాయి. అయితే ఈ ఏడాది కోవిడ్‌ కారణంగా దాదాపు రెండు నెలల ఆలస్యంగా మొదలు కానున్నాయి. అందుబాటులో ఉన్న సమయానికి అనుగుణంగా సిలబస్‌ను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్, ఔషధం వచ్చే వరకూ కరోనా ప్రభావం ఉండే నేపథ్యంలో అందుకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకుని పాఠశాలలు నిర్వహిచనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి