iDreamPost

రిజర్వేషన్లు మరో పదేళ్లు పొడిగింపు

రిజర్వేషన్లు మరో పదేళ్లు పొడిగింపు

లోక్‌సభ, శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీ కోటాను మరో పదేళ్లు పొడిగించారు. ఈ మేరకు రిజర్వేషన్లు కొనసాగించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్‌సభ ఏకపక్షంగా ఆమోదించింది. ఈ బిల్లును న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రవేశపెట్టారు. సభకు 351 మంది సభ్యులు హాజరు కాగా అందరూ అనుకూలంగా ఓటు వేశారు. వ్యతిరేకంగా ఒక్క ఓటూ పడలేదు.

గత 70 ఏళ్లుగా ఎస్సీలు, ఎస్టీలు, ఆంగ్లో-ఇండియన్లకు అమలు అవుతున్న రిజర్వేషన్ల గడువు వచ్చే ఏడాది జనవరి 25వ తేదీతో ముగుస్తుంది. ఎస్సీలు, ఎస్టీల రిజర్వేషన్లను 2030 వరకు పొడిగించేందుకు కేంద్రం ఈ బిల్లును తెచ్చింది. ఆంగ్లో-ఇండియన్ల కోటాను పొడిగింపు విషయం ఈ బిల్లు లో లేదు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఈ విషయంలో తలుపులు మూసేయలేదని, వారికి కోటా కల్పించే విషయాన్ని పరిశీలిస్తామని న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి