iDreamPost

సహజీవనం ఓ ప్రమాదకరమైన జబ్బు.. బీజెపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

పరాయి దేశాల నుండి వచ్చిన ట్రెండ్ ను ఇక్కడి ప్రజలు త్వరగా ఆహ్వానిస్తారు. అటువంటి కల్చర్ లో సహజీవనం ఒకటి. ఇటీవల కాలంలో ఈ సంస్కృతి బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో బీజెపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు.

పరాయి దేశాల నుండి వచ్చిన ట్రెండ్ ను ఇక్కడి ప్రజలు త్వరగా ఆహ్వానిస్తారు. అటువంటి కల్చర్ లో సహజీవనం ఒకటి. ఇటీవల కాలంలో ఈ సంస్కృతి బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో బీజెపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు.

సహజీవనం ఓ ప్రమాదకరమైన జబ్బు.. బీజెపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

దేశంలోని ప్రజలు కొత్త కల్చర్‌ను ఆహ్వానిస్తూనే ఉంటారు. తొలుత తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ.. ఆ తర్వాత అలవాటు పడిపోతుంటారు. అలాంటి వాటిల్లో ఒకటి సహజీవనం. ప్రేమించుకుని, పెళ్లిళ్లు ఇష్టపడని అమ్మాయి, అబ్బాయి డేటింగ్ పేరుతో ఒకే గదిలో కలిసి కాపురం చేస్తారు. ఇద్దరి భాగస్వామ్యం బాగుంది అనుకుంటే పెళ్లి వైపు మొగ్గుచూపుతారు. లేదంటే బ్రేకప్ చెప్పి ఎవరి దారులు వారు వెతుక్కుంటారు. ఇటీవల ఈ కల్చర్ విస్తృతమైందని చెప్పొచ్చు. దీని వల్ల వ్యవస్థ దెబ్బతింటుందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో సహజీవనంపై సుప్రీంకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో ఉంటే పెళ్లి చేసుకున్నట్లేనని తేల్చి చెప్పింది.

ఈ క్రమంలో సహజీవనంపై బీజెపీ ఎంపీ పార్లమెంట్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. లివ్ ఇన్ రిలేషన్ షిప్ ఓ ప్రమాదకరమైన జబ్బు అని అన్నారు. దాన్ని సమాజం నుండి తరిమికొట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనికి వ్యతిరేకంగా ఓ చట్టాన్ని తీసుకురావాలని సూచించారు. హర్యానా బీజెపీ ఎంపీ ధరంవీర్ సింగ్ గురువారం లోక్ సభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. లవ్ మ్యారేజెస్‌లో డివోర్స్ శాతం అధికంగా ఉంటుందని అన్నారు. అందువల్ల అలాంటి రిలేషన్స్ లో ఉండాలనుకుంటున్నారో ఆ దంపతులు.. తల్లిదండ్రుల సమ్మతి తప్పని సరి తీసుకోవాలని పేర్కొన్నారు. ‘ ఓ తీవ్రమైన అంశాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. వసుధైవ కుటుంబం అనే తత్వానికి భారతీయ సంస్కృతి ప్రసిద్ధి. ప్రపంచంలో ఇతర దేశాలతోపోలిస్తే.. మన సామాజిక నిర్మాణం భిన్నం. మన భిన్నత్వంలో ఏకత్వానికి ప్రపంచం మొత్తం ముగ్దులైంది’ అని భివానీ-మహేంద్రగఢ్ ఎంపీ అన్నారు.

bjp mp dharamveer sigh comments on living relation

‘ఏడు తరాలుగా కొనసాగుతున్న వివాహాన్ని పవిత్రమైన బంధంగా పరిగణిస్తున్నారు. అమెరికాతో పోలిస్తే.. భారత దేశంలో విడాకుల రేటు ఎక్కువగా ఉంది. యుఎస్ లో 40 శాతం ఉంటే.. ఇక్కడ 1:1గా నమోదు అవుతుంది. ఈ విడాకులు ప్రేమ వివాహాల్లో ఎక్కవ. కాబట్టి ప్రేమ వివాహాలకు ముందు లివ్ ఇన్ లో ఉండాలనుకుంటే వధూవరుల తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి అని సూచన. ప్రేమ వివాహాల కారణంగా గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయి. గొడవల్లో కుటుంబాలు నాశనమవుతున్నాయి. కాబట్టి ఇరు కుటుంబాల అంగీకారం ముఖ్యం’ అని తెలిపారు. అయితే సహజీవనం ప్రమాదకరమైన వ్యాధి అన్న ఆయన.. ఉదాహరణకు శ్రద్ధా వాకర్- అఫ్తాబ్ పూనావాల కేసును ఉదహరించారు. ఈ నేపథ్యంలో సహజీవనానికి వ్యతిరేకంగా చట్టాలని తీసుకురావాలని అన్నారు. ఇక శ్రద్ధా వాకర్ ఘటన ఎంతటి సంచలనం అయ్యిందో అందరికీ తెలుసు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి