iDreamPost

SBI సూపర్ స్కీమ్.. ఆ పథకంలో చేరితే ప్రతి నెలా రూ. 11 వేలు పొందొచ్చు

SBI సూపర్ స్కీమ్.. ఆ పథకంలో చేరితే ప్రతి నెలా రూ. 11 వేలు పొందొచ్చు

దేశంలోని ప్రభుత్వ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు ఆకర్షనీయమైన పథకాలను ప్రవేశపెడుతూ విశేషమైన ఆదరణ పొందుతోంది. ఈ క్రమంలోనే మరో కస్టమర్ల కోసం మరో కొత్త పథకాన్ని అందుబాటులో ఉంచింది. ఈ పథకం ద్వారా నెలకు రూ. 11 వేలు అందిస్తోంది. ఏకంగా పది సంవత్సరాల పాటు ప్రతి నెల ఆ మొత్తాన్ని ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఎస్బీఐలో డబ్బులు డిపాజిట్ చేసుకుని దాని నుంచి కొంత మొత్తాన్ని పొందాలనుకునే వారు ఈ పథకంలో చేరొచ్చు. ఎస్బీఐ తీసుకొచ్చిన ఆ పథకంతో కస్టమర్లకు ప్రయోజనం చేకూరనున్నది. ఇంతకీ ఆ పథకం ఏంటీ? ఎంత మొత్తం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది? ఆ వివరాలు మీ కోసం..

ఎస్బీఐ ఖాతాదారులు బ్యాంకులో డిపాజిట్ చేసిన ఎమౌంట్ నుంచి ప్రతి నెల కొంత మొత్తాన్ని పొందే పథకాన్ని ప్రవేశపెట్టింది ఎస్బీఐ. ఆ పథకమే ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్.ఇందులో చేరితే 10 ఏళ్లపాటు ప్రతి నెలా రూ. 11 వేలు పొందవచ్చు. ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ఈ పథకంలో ఎవరైనా చేరొచ్చు. 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు మెచ్యూరిటీ పీరియడ్‌తో ప్రతి నెలా డబ్బులు వస్తాయి. 36, 60, 84, 120 నెలలు అంటూ టెన్యూర్లు పెట్టుకోవచ్చు. నెలకు కనీసం రూ.1000 నుంచి గరిష్ఠంగా ఎంతైనా పొందవచ్చు. డిపాజిట్ కు గరిష్ఠ పరిమితి ఏమీ లేదు. మీరు డిపాజిట్ చేసే ఎమౌంట్ ఆధారంగా వచ్చే ఆదాయం ఆధారపడి ఉంటుంది.

దీంతో పాటు యాన్యుటీ స్కీమ్‌లో ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ సైతం ఉంది. మీరు డిపాజిట్ చేసిన సొమ్ములో 75 శాతం మేర ఓవర్ డ్రాఫ్ట్ పొందొచ్చు. మీరు రూ.10 లక్షలు డిపాజిట్ చేసినట్లయితే యాన్యూటీ ప్లాన్ ద్వారా నెలకు రూ.11,870 వస్తాయి. మొదటి నెలలో వడ్డీ 6.5 శాతంతో రూ.6,250, ఇన్వెస్ట్ చేసిన సొమ్ములో రూ.5,620 రెండూ కలిపి చెల్లిస్తారు. ఈ పథకంలో చేరడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, సెక్షన్ 80 టీటీబీ కింద ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఒక వేళ డిపాజిటర్ మరణించినట్లైతే వెంటనే ఈ స్కీమ్ ను క్లోజ్ చేసుకోవచ్చు. అదే విధంగా డిపాజిట్లకు సంబంధించిన ముందస్తు చెల్లింపులకు కూడా అనుమతిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి