iDreamPost

విద్యార్థులకు ఎస్బీఐ బంపరాఫర్.. రూ. 10 వేల స్కాలర్‌షిప్ పొందే అవకాశం!

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని విద్యా వ్యవస్థను మెరుగుపరిచే ఉద్దేశ్యంతో విద్యార్థుల కోసం అనేక స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లను చేపడుతోంది. పాఠశాల విద్యార్థుల కోసం ఎస్బీఐ ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని విద్యా వ్యవస్థను మెరుగుపరిచే ఉద్దేశ్యంతో విద్యార్థుల కోసం అనేక స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లను చేపడుతోంది. పాఠశాల విద్యార్థుల కోసం ఎస్బీఐ ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

విద్యార్థులకు ఎస్బీఐ బంపరాఫర్.. రూ. 10 వేల స్కాలర్‌షిప్ పొందే అవకాశం!

ప్రస్తుత రోజుల్లో పిల్లల చదువుకు అయ్యే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు నిత్యావరాల ధరలు ఆకాశాన్నంటుతుంటే మరో వైపు పిల్లల చదువులు తల్లిదండ్రలకు భారంగా మారాయి. పిల్లల్లో చదివే ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యలు వారికి అడ్డంకిగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఆర్థికంగా ఇబ్బంది పడే విద్యార్థులకు ఎస్బీఐ శుభవార్తను అందించింది. ఎస్బీఐ ఆశా స్కాలర్‌షిప్ ద్వారా విద్యార్థులకు రూ. 10 వేల స్కాలర్ షిప్ ను అందించేందుకు ముందుకొచ్చింది. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని విద్యా వ్యవస్థను మెరుగుపరిచే ఉద్దేశ్యంతో విద్యార్థుల కోసం అనేక స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లను చేపడుతోంది. పాఠశాల విద్యార్థుల కోసం ఎస్బీఐ ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఎస్బీఐ ఫౌండేషన్ 6వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సంవత్సరానికి 10,000 రూపాయల స్కాలర్‌షిప్‌ను స్కాలర్‌షిప్‌గా అందిస్తుంది. ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకునేందుకు ఆఖరి తేదీ నవంబంర్ 30 2023. మరి ఈ స్కాలర్ షిప్ కు ఎవరు అర్హులు? నిబంధనలు ఏంటి? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఎవరు అర్హులు

6వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
మునుపటి తరగతి చివరి పరీక్షలో కనీసం 75% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం తప్పనిసరిగా 3,00,000 లేదా అంతకంటే తక్కువ ఉండాలి.
దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్బీఐ ఆశా స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేయడానికి విద్యార్థి యొక్క మునుపటి సంవత్సరం మార్క్ షీట్, ఆధార్ కార్డ్, ప్రస్తుత సంవత్సరం పాఠశాల ఫీజు చెల్లింపు రుజువు, విద్యార్థి లేదా వారి తల్లిదండ్రుల బ్యాంక్ వివరాలు, ఆదాయ ధృవీకరణ పత్రం, విద్యార్థి పాస్‌పోర్ట్ సైజు ఫోటో. దరఖాస్తు ప్రక్రియ సులభం మరియు ఆన్‌లైన్‌లో పూర్తి చేయవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించిన తర్వాత, దరఖాస్తుదారులు అవసరమైన పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయాలి. SBI యొక్క ఆశా స్కాలర్‌షిప్ 2023 కోసం దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 30, 2023 అని గుర్తుంచుకోవడం ముఖ్యం. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://www.sbifoundation.in/ ను సంప్రదించాలని కోరింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి