iDreamPost

Satya : గూండా వ్యవస్థకు తిరగబడిన నిరుద్యోగి – Nostalgia

ఆ విశేషాలు చూద్దాం. 1985. ధర్మేంద్ర వారసుడిగా వచ్చిన సన్నీ డియోల్ కు పరిశ్రమతో పాటు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చేసింది.

ఆ విశేషాలు చూద్దాం. 1985. ధర్మేంద్ర వారసుడిగా వచ్చిన సన్నీ డియోల్ కు పరిశ్రమతో పాటు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చేసింది.

Satya : గూండా వ్యవస్థకు తిరగబడిన నిరుద్యోగి – Nostalgia

మనకు సత్య అనగానే రామ్ గోపాల్ వర్మ – జెడి చక్రవర్తి కాంబినేషన్ లో వచ్చిన సినిమా గుర్తొస్తుంది కానీ దానికి చాలా మునుపు అదే టైటిల్ తో కమల్ హాసన్ చేసిన ఒక కల్ట్ క్లాసిక్ ఉందన్న సంగతి మూవీ లవర్స్ కు బాగా తెలుసు. ఆ విశేషాలు చూద్దాం. 1985. ధర్మేంద్ర వారసుడిగా వచ్చిన సన్నీ డియోల్ కు పరిశ్రమతో పాటు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చేసింది. అయితే తనని లవర్ బాయ్ కంటే సీరియస్ క్యారెక్టర్స్ లోనే అద్భుతంగా చూపించవచ్చని గుర్తించిన దర్శకుడు రాహుల్ రవైల్ అర్జున్ సినిమా రూపంలో దాన్ని ఆవిష్కరించి చూపించారు. ఆ ఏడాది అతి పెద్ద హిట్స్ లో ఒకటిగా నిలిచిన అర్జున్ వంద రోజుల పాటు ప్రదర్శితమయ్యింది.

రెండేళ్ల తర్వాత అంటే 1987. కె బాలచందర్ గారి దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్న సురేష్ కృష్ణ డైరెక్టర్ గా డెబ్యూ కోసం ప్రయత్నిస్తున్న సమయం. స్వంత కథలు ఓకే అవ్వడం లేదు. తన పనితనం దగ్గరి నుంచి చూసిన కమల్ హాసన్ సరైన సబ్జెక్టుతో వస్తే అవకాశమిస్తానని హామీ ఇవ్వడం గుర్తుంది. అప్పుడే అర్జున్ మెదిలింది. అది ఫక్తు బాలీవుడ్ స్టైల్ లో సాగే గ్యాంగ్ స్టర్ డ్రామా. దాన్ని తనదైన శైలిలో తమిళ ఆడియన్స్ కు తగ్గట్టు మారిస్తే గొప్ప విజయం దక్కుతుందన్న నమ్మకం సురేష్ కృష్ణలో ఉంది. వెంటనే ఆ పని పూర్తి చేసి లోక నాయకుడికి వినిపిస్తే ఆయన ఆశ్చర్యపోయారు. తనే నిర్మాతగా రీమేక్ హక్కులు కొనేసి వెంటనే షూటింగ్ మొదలుపెట్టేయమన్నారు

అమల హీరోయిన్ గా కిట్టి విలన్ గా నాజర్, జనగరాజ్, రాజేష్, బహదూర్ తదితరులు ఇతర పాత్రల్లో ఎంపికయ్యారు. ఇళయరాజా సంగీతం సమకూర్చారు. వేరే రికార్డింగ్ కోసం మదరాసు వచ్చిన లతా మంగేష్కర్ తో పాడిన పాట ఆల్బమ్ కే హైలైట్ అవ్వడం అప్పట్లో సంచలనం. నిరుద్యోగి యువకుడు రౌడీ వ్యవస్థకు తిరగబడి దానికి కొరకరాని కొయ్యగా మారే పాయింట్ తో రూపొందిన సత్య తమిళంలో 1988 జనవరి 29 విడుదలై మంచి విజయం సాధించింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ అదే ఏడాది ఏప్రిల్ 15 రిలీజయ్యింది. హిందీ అంత బ్లాక్ బస్టర్ అవ్వలేదు కానీ సత్య ముద్ర కోలీవుడ్ మీద ఉండిపోయింది. వర్మకు సైతం ఇన్స్ పిరేషన్ గా నిలిచింది

Also Read : Jayan : చిన్న వయసులో కన్నుమూసిన 100 సినిమాల స్టార్ – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి