iDreamPost

sarkaru vaari paata మహేష్ బ్రాండ్ మాస్ సర్కారు

sarkaru vaari paata మహేష్ బ్రాండ్ మాస్ సర్కారు

సరిలేరు నీకెవ్వరు తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్ తో వస్తున్న మహేష్ బాబు సినిమాగా సర్కారు వారి పాట మీద మాములు అంచనాలు లేవు. గీత గోవిందం అయ్యాక ఏళ్ళ తరబడి ఈ స్క్రిప్ట్ మీదే వర్క్ చేసిన దర్శకుడు పరశురామ్ మొదటిసారి స్టార్ హీరోని డీల్ చేశారు. భారీ చిత్రాల కేరాఫ్ అడ్రెస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. తమన్ సంగీతం సమకూర్చారు. విడుదల వాయిదా పడుతుందేమో అన్న అంచనాలను కూల్చేస్తూ మే 12 రిలీజ్ కు రంగం సిద్ధమయ్యింది. ఇందాకే భారీ ఎత్తున ట్రైలర్ లాంచ్ ని అభిమానుల మధ్య జరిపారు. ఇంతకీ వీడియోలో ఏముందో చూద్దాం

ప్రేమను లాక్కున్నా పర్వాలేదు స్నేహాన్ని తీసుకున్నా క్షమిస్తాడు కానీ డబ్బు దగ్గరికి వచ్చేసరికి నిక్కచ్చిగా ఉండే వ్యాపారి మన మహేష్ బాబు. దీని కోసం గొడవ పడేందుకైనా ఎవరినైనా కొట్టేందుకైనా ఎప్పుడూ రెడీనే. అలాంటి వ్యక్తి జీవితంలోకి కళావతి(కీర్తి సురేష్) వస్తుంది. విదేశాల్లో ఉన్నప్పుడు పరిచయమై ఫీజు కోసం హీరో దగ్గరే అప్పుడు తీసుకుంటుంది. మనోడూ ఇష్టపడి ఇచ్చేస్తాడు. కట్ చేస్తే విలన్లు కథలోకి ప్రవేశిస్తారు. ఇతని దందా ప్రమాదంలో పడుతుంది. రాజకీయ నాయకులూ ఎంటరవుతారు. అసలు ఇతగాడి ఉద్దేశం ఏంటి, ఏ లక్ష్యంతో డబ్బుతో కూడిన వ్యాపారంలో ఉన్నాడు లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీదే చూడాలి.

ట్రైలర్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఓవర్ సాఫ్ట్ హీరోయిజంతో మెప్పిస్తున్న మహేష్ ఇందులో ఒక్కడు, పోకిరి టైప్ మ్యానరిజంకు వెళ్ళిపోయాడు. బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్, ఫైట్స్ లో ఇంటెన్సిటి అన్ని పర్ఫెక్ట్ గా కుదిరాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్స్ ట్రాడినరి అనిపించలేదు కానీ అసలు సినిమాలో ఎక్కువ ఆశించవచ్చు. డైలాగ్స్ పేలాయి. నేనున్నాను నేను విన్నాను అంటూ మహేష్ యాత్రలో మమ్ముట్టిని ఇమిటేట్ చేసే తీరు బాగుంది. మొత్తానికి సర్కారు వారి పాట మంచి సమ్మర్ ఆప్షన్ గా హామీ ఇచ్చేలా ఈ వీడియో కట్ చేసిన విధానం అంచనాలు పెంచేసింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి