iDreamPost

సంక్రాంతి రేసులో చిన్న హీరో సాహసం

సంక్రాంతి రేసులో చిన్న హీరో సాహసం

ఊహించని విధంగా 2023 సంక్రాంతి రేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, తెగింపులతో ఇప్పటికే పోటీ విపరీతంగా ఉండగా ఇప్పుడో చిన్న సినిమా బరిలో దిగేందుకు రెడీ అవుతోందని ఫిలిం నగర్ టాక్. సంతోష్ శోభన్ హీరోగా కొత్త దర్శకుడు అనిల్ తో యువి క్రియేషన్స్ రూపొందించిన కళ్యాణం కమనీయంని పండగకే తీసుకురావాలని నిర్ణయించుకున్నట్టు ఇన్ సైడ్ న్యూస్. ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ ఫెస్టివల్ మూవీస్ కోసం ఎగ్జిబిటర్లు స్క్రీన్లు బుక్ చేసుకుంటున్న తరుణంలో దీనికోసమే కొన్ని హోల్డ్ చేసి ఉంచాలని తమ ఆధీనంలో ఉండే మల్టీప్లెక్సులకు చెప్పేశారట.

ఏదైనా అనూహ్య మార్పు ఉంటే తప్ప కళ్యాణం కమనీయం రావడం ఖరారే. ఎంత కంటెంట్ మీద నమ్మకం ఉంటే మాత్రం మరీ ఇంత సాహసానికి తెగబడటం చాలా రిస్క్ అవుతుంది. ఎందుకంటే సంతోష్ శోభన్ కు థియేటర్ మార్కెట్ లేదు. మొన్న వచ్చిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ని ఎంత ప్రమోట్ చేసినా జనం పట్టించుకోలేదు. సినిమా బాలేదన్నది తర్వాత విషయం. అసలు ఉదయం ఆటకే జనం రాకపోతే ఇంకేమనుకోవాలి. ఇంతకు ముందు మంచి రోజులు వచ్చాయి కూడా పెద్దగా ఆడలేదు. అలాంటిది చిరంజీవి బాలకృష్ణ విజయ్ అజిత్ లతో తలపడేందుకు రెడీ అయితే తీవ్ర ప్రభావం చూపించడం ఖాయం. రెండైనా హిట్ అయితే ఇంకా సమస్య

ఆ మధ్య స్వాతిముత్యం ఇదే తరహాలో గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ లతో క్లాష్ చేయించి సితార సంస్థ దానికి తగిన మూల్యం చెల్లించింది. బాగున్న సినిమాకు జనం రాకుండా కలెక్షన్లు పోగొట్టుకుంది. ఇప్పుడా సీన్ రిపీట్ కావడం తప్ప ఇంకేం అనిపించడం లేదు. గతంలో ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి రిలీజ్ అయినప్పుడు శతమానం భవతి ఇదే తరహాలో రిస్క్ చేసింది. విజయం సాధించింది. కానీ అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. శర్వానంద్ ఇమేజ్ దానికి ప్లస్ అయ్యింది. కానీ సంతోష్ కు ఆ అడ్వాంటేజ్ లేదు. మొత్తానికి పంచకల్యాణి గుర్రం లాగా సంక్రాంతి బాక్సాఫీస్ ఇంకెన్ని చిత్ర విచిత్ర పరుగులు తీస్తుందో చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి