iDreamPost

బాలీవుడ్‌పై మల్లారెడ్డి కామెంట్స్.. సందీప్ రియాక్షన్!

  • Author Soma Sekhar Updated - 12:32 PM, Thu - 30 November 23

యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంత్రి మల్లారెడ్డి స్పీచ్ ఏ రేంజ్ లో ఉందో మనందరికి తెలిసిందే. తాజాగా ఆయన స్పీచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.

యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంత్రి మల్లారెడ్డి స్పీచ్ ఏ రేంజ్ లో ఉందో మనందరికి తెలిసిందే. తాజాగా ఆయన స్పీచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.

  • Author Soma Sekhar Updated - 12:32 PM, Thu - 30 November 23
బాలీవుడ్‌పై మల్లారెడ్డి కామెంట్స్.. సందీప్ రియాక్షన్!

‘యానిమల్’ ప్రస్తుతం ఇండియా వైడ్ గా వినిపిస్తున్న పేరు. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషనల్ లో వస్తున్న మూవీ. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీపై భారీ హైప్ ఏర్పడింది. ఈ హైప్ కాస్త ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రపంచానికి తాకింది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీ చూద్దామా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని డిసెంబర్ 1న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ‘ఐడ్రీమ్’ తో సరదాగా ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సందీప్ రెడ్డి వంగా.

మంత్రి మల్లారెడ్డికి సోషల్ మీడియాలో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన ఏం మాట్లాడినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘యానిమల్’. రణ్ బీర్ కపూర్-రష్మిక మందన్న ఈ మూవీలో జోడిగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ మల్లారెడ్డి కాలేజీలో జరిగింది. ఈ వేడుకకు దర్శకధీరుడు SS రాజమౌళితో పాటుగా సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పెషల్ గెస్టులుగా హాజరైయ్యారు.

ఇక ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి మల్లారెడ్డి మరోసారి తన మార్క్ స్పీచ్ తో సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. బాలీవుడ్, హాలీవుడ్ లాంటివి అన్నీ హైదరాబాద్ కు వస్తాయి, దునియాకే హైదరాబాద్ అడ్డా అంటూ మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. కాగా.. ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు ఎలా ఫీలయ్యారు అంటూ ఈ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించారు. దానికి పొలైట్ గా, సింపుల్ గా సమాధానం ఇచ్చారు సందీప్ రెడ్డి వంగా. “ఆయన చాలా సరదాగా మాట్లాడతారు. ఆయనకు సంబంధించిన కొన్ని స్పీచ్ లు కూడా విన్నాను.. ఏం మాట్లాడినా కానీ జనాలు ఎంటర్ టైన్ అవుతారు. ఇక ఈ ఈవెంట్ లో మాట్లాడిన మాటలను నేను అర్ధం చేసుకోగలను. ఆయన సాధించిన ఘనతలను అందరూ గౌరవిస్తారు. అలాంటి వారు మాట్లాడినా.. మనం ఇబ్బంది పడినా ఏం అనలేం” అంటూ చెప్పుకొచ్చాడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్.

అయితే రణ్ బీర్ కపూర్ ముందే.. బాలీవుడ్ గీలీవుడ్ జాన్ తా నై.. ఓన్లీ టాలీవుడ్ అంటూ మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక యానిమల్ విషయానికి వస్తే.. మోస్ట్ అవైటెడ్ మూవీగా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ చిత్రం. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి అర్జున్ రెడ్డితో టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన ఈ డాషింగ్ డైరెక్టర్.. యానిమల్ తో బాలీవుడ్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తాడో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి