iDreamPost

ఫ్యాన్స్​కు షాకిచ్చిన సంయుక్తా హెగ్డే.. అలాంటి వీడియో పోస్ట్ చేయడంతో..!

  • Author singhj Published - 06:18 PM, Mon - 10 July 23
  • Author singhj Published - 06:18 PM, Mon - 10 July 23
ఫ్యాన్స్​కు షాకిచ్చిన సంయుక్తా హెగ్డే.. అలాంటి వీడియో పోస్ట్ చేయడంతో..!

టాలీవుడ్ కుర్ర హీరోల్లో మంచి ప్రామిసింగ్ యాక్టర్​గా నిఖిల్ పేరు తెచ్చుకున్నారు. హుషారైన నటనతో యూత్​లో మంచి ఫ్యాన్ బేస్​ను సంపాదించుకున్నారు. మిగతా హీరోల్లా కాకుండా కథలను ఎంచుకోవడంలో నిఖిల్ కాస్త విభిన్నమనే చెప్పాలి. ఇందుకు ఆయన చేసిన సినిమాలనే ఉదాహరణగా చెప్పొచ్చు. అలాంటి నిఖిల్ ఐదేళ్ల కింద నటించిన చిత్రం ‘కిర్రాక్ పార్టీ’. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్​గా నిలిచింది. అయితే ఇందులో హీరోయిన్​గా యాక్ట్ చేసిన బెంగళూరు బ్యూటీ సంయుక్తా హెగ్డే మాత్రం మంచి మార్కులు కొట్టేశారు.

‘కిర్రాక్ పార్టీ’ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే అందులో సంయుక్త మాత్రం తన పెర్ఫార్మెన్స్​తో మంచి పేరు తెచ్చుకున్నారు. ఎందుకో తెలియదు గానీ ‘కిర్రాక్ పార్టీ’ తర్వాత తెలుగులో ఈ భామకు అంతగా అవకాశాలు రాలేదు. సక్సెస్​ను మాత్రమే పట్టించుకునే ఇండస్ట్రీలో ఫెయిల్యూర్​తో అడుగుపెట్టిన సంయుక్తా హెగ్డేకు ఛాన్సులు రాకపోవడంలో పెద్ద విశేషమేమీ లేదు. అయితే టాలీవుడ్​లో అవకాశాలు రాకపోయినా తమిళం, కన్నడలో మాత్రం ఈ బ్యూటీ వరుస ఛాన్సులు అందుకుంటున్నారు. అలాగే కన్నడ బిగ్​బాస్​ ద్వారా కూడా ఆమె తన ఫాలోయింగ్​ను మరింతగా పెంచుకున్నారు. సినిమాల ద్వారా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్​కు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు సంయుక్త.

నెట్టింట సంయుక్తా హెగ్డే చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తరచూ బికినీ ఫొటోలు, హాట్ ఫొటో షూట్స్​తో యూత్​ ఆడియెన్స్​ను కిర్రెక్కిస్తున్నారామె. ఈ క్రమంలో తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఒక వీడియో ఇంటర్నెట్​లో పెద్ద దుమారమే రేపింది. సంయుక్త ఏకంగా హాఫ్ న్యూడ్ వీడియో షేర్ చేసి షాక్ ఇచ్చారు. తన ఫిట్​నెస్​ను చూపించే క్రమంలో ఆమె పోస్ట్ చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్యాంట్ తప్ప ఒంటిపై నూలిపోగు లేకుండా బ్యాక్ సైడ్ ఫిజిక్ చూపిస్తూ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు సంయుక్త. మన శరీరమే మన ఆస్తి.. సోషల్ మీడియాలో ఎలాంటి రూల్స్ పాటించాల్సిన అవసరం లేదంటూ ఈ పోస్ట్​కు క్యాప్షన్ జతచేశారామె.

 

View this post on Instagram

 

A post shared by Samyuktha Hegde (@samyuktha_hegde)

 

View this post on Instagram

 

A post shared by Samyuktha Hegde (@samyuktha_hegde)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి