iDreamPost

సంగారెడ్డి విద్యార్థినికి లక్కీ ఛాన్స్.. మైక్రోసాఫ్ట్‌లో జాబ్.. ఏడాదికి రూ. 52 లక్షల జీతం

సంగారెడ్డి విద్యార్థినికి లక్కీ ఛాన్స్.. మైక్రోసాఫ్ట్‌లో జాబ్.. ఏడాదికి రూ. 52 లక్షల జీతం

తగిన చదువు, ఉద్యోగానికి తగిన నైపుణ్యాలుంటే ప్రఖ్యాత కంపెనీల్లో ఉద్యోగం, కళ్లు చెదిరే ప్యాకేజీ సొంతం చేసుకోవచ్చని నిరూపిస్తున్నారు యువతీ యువకులు. ఇటీవల కొంతమంది లక్షలు, కోట్ల ప్యాకేజీతో ఉద్యోగాలకు ఎంపికైన సంఘటనలు చాలానే చూశాం. ఈ క్రమంలోనే సంగారెడ్డికి చెందిన ఓ విద్యార్థిని గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. కాలేజీలో జరిగిన క్యాంపస్ ప్లేస్ మెంట్ ఇంటర్య్వూలో ఏకంగా రూ. 52 లక్షల జీతంతో ఉద్యోగానికి ఎంపికైంది. ఇంజనీరింగ్ విద్య కొనసాగుతుండగానే ఉద్యోగం సాధించి అదరగొట్టింది. దీంతో ఆ అమ్మాయిపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఎంత చదివినా ఉద్యోగాలు రావడం లేదు.. ఉద్యోగాలు లేవు అని కుంటి సాకులు చెప్పేవారికి ఈ అమ్మాయి సాధించిన విజయం వారి కళ్లు తెరిపిస్తుందని చెప్పవచ్చు. ప్రతిభ ఉంటే ఉద్యోగం సాధించడం పెద్ద కష్టమేమీ కాదని నిరూపించి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె మరెవరో కాదు సంగారెడ్డికి జిల్లా ముదిమాణిక్యం గ్రామానికి చెందిన పుష్పలత, విష్ణువర్ధన్‌రెడ్డి దంపతుల కుమార్తె సంహిత. ఈమె మెదక్ జిల్లా నర్సాపూర్ ఏరియాలోని బీవీఐఆర్టీ ఇంజనీరింగ్ కాలేజీలో సీఎస్ఈ నాలుగో సంవత్సరం చదువుతోంది.

అయితే కాలేజీలో ఇటీవల మైక్రోసాఫ్ట్ సంస్థ ఇంటర్య్వూలు చేపట్టింది. కాగా ఆ క్యాంపస్ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలో అద్భుతమైన ప్రతిభ కనబర్చి ఏడాదికి రూ. 52 లక్షల ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికైంది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక క్యాంపస్ ప్లేస్మెంట్ లో లక్కీ ఆఫర్ కొట్టేసిన సంహితను ఫ్లేస్‌మెంట్‌ ఇన్‌చార్జి బంగార్రాజు, ప్రిన్సిపాల్‌ సంజయ్‌దూబే, కళాశాల చైర్మన్‌ విష్ణురాజు అభినందించారు. తనకు ఈ ప్లేస్‌మెంట్‌ రావడానికి కారణం కళాశాలలో అందించిన శిక్షణతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహమేనని సంహిత వెల్లడించింది. మరి మైక్రోసాఫ్ట్ లో రూ. 52 లక్షల ప్యాకేజీతో జాబ్ కొట్టిన సంహితపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి