iDreamPost

విడాకులపై మరోసారి స్పందించిన సమంత! చాలా కష్టంగా గడిచిందంటూ..!

Samantha: విడాకులపై మరోసారి స్పందించింది స్టార్ హీరోయిన్ సమంత. హెల్త్ పాడ్ కాస్ట్ టేక్ 20లో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

Samantha: విడాకులపై మరోసారి స్పందించింది స్టార్ హీరోయిన్ సమంత. హెల్త్ పాడ్ కాస్ట్ టేక్ 20లో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

విడాకులపై మరోసారి స్పందించిన సమంత! చాలా కష్టంగా గడిచిందంటూ..!

సమంత.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అప్పట్లో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ.. అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం సామ్ మయోసైటిస్ అనే వ్యాధి నుంచి క్రమంగా కోలుకుంటోంది. ఇక ఈ వ్యాధి గురించి అందరికి అవగాహన కల్పించేందుకు ‘టేక్ 20’ పేరుతో హెల్త్ పాడ్ కాస్ట్ ను ప్రారంభించింది. ఇక ఇందుకు సంబంధించిన తొలి ఎపిసోడ్ సోమవారం రిలీజ్ అయ్యింది. ఇందులో మరోసారి విడాకులపై స్పందించింది ఈ బ్యూటీ.

మయోసైటిస్ వ్యాధి నుంచి క్రమంగా కోలుకుంటోంది స్టార్ హీరోయిన్ సమంత. ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటూనే ముందుగా ఒప్పుకున్న మూవీలను ఫినిష్ చేసింది. ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. తన ఆరోగ్యంపై దృష్టిపెట్టింది. పలు రకాలైన చికిత్సలు తీసుకుంటూ.. క్రమంగా ఆరోగ్యాన్ని కుదుటపరుచుకుంటూ వచ్చింది. ఇక తనకు వచ్చిన వ్యాధిపై అవగాహన పెంచేందుకు ‘టేకె 20’ పేరుతో ఓ హెల్త్ పాడ్ కాస్ట్ ను ప్రారంభించింది. ఇక తాజాగా ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన తొలి ఎపిసోడ్ ను సోమవారం రిలీజ్ చేశారు. అందులో ప్రముఖ న్యూట్రీషనిస్ట్ అల్కేశ్ సామ్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఈ పాడ్ కాస్ట్ లో మరోసారి తన విడాకులపై స్పందించింది సామ్.

“నాకు ఈ వ్యాధి రావడానికి ముందు సంవత్సరమంతా విడాకుల కారణంగా చాలా కష్టంగా గడిచింది. కానీ లాస్ట్ కు ఒకరోజు నాకు శాంతి దొరికింది. అప్పుడు నేను, నా మేనేజర్ హిమాంక్ ముంబై నుంచి వస్తున్నాం. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉందని నేను అతడితో చెప్పాను. ఈ మాట చెప్పిన మరుసటిరోజు నిద్రలేచేసరికి నాపై అనారోగ్యం దాడిచేసింది. అప్పటి నుంచి ఈరోజు వరకు నేను కష్టాలు పడుతూనే ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చింది సమంత. మరి సామ్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Serial Actor: కమిట్ మెంట్ ఇస్తేనే ఆఫర్లు.. బ్రహ్మముడి అప్పు రియల్ లైఫ్ కష్టాలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి