iDreamPost

ప్రేమ, పెళ్లి గురించి సమంత ట్వీట్‌.. ఇలాంటి వాడినే పెళ్లి చేసుకోండి అంటూ!

  • Published Jul 20, 2023 | 1:32 PMUpdated Jul 20, 2023 | 1:39 PM
  • Published Jul 20, 2023 | 1:32 PMUpdated Jul 20, 2023 | 1:39 PM
ప్రేమ, పెళ్లి గురించి సమంత ట్వీట్‌.. ఇలాంటి వాడినే పెళ్లి చేసుకోండి అంటూ!

నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత చేసే వ్యాఖ్యలు, ఇంటర్వ్యూలు, సోషల్‌ మీడియా పోస్ట్‌లు విపరీతంగా వైరలవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇన్‌స్టాలో ఆమె చేసే క్రిప్టిక్‌ పోస్ట్‌లు తెగ వైరలవుతుంటాయి. ఎవరిని ఉద్దేశించకుండా.. ఎవరి పేరు ప్రస్తావించకుండా.. సమంత చేసే పోస్ట్‌లు అభిమానులను ఆలోచనలో పడేస్తాయి. అసలు ఆమె మనసులో ఏం ఉందో ఎవరికి అర్థం కాదు. ఇక ఈ మధ్య కాలంలో సమంత.. ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పోస్ట్‌ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేసిన ఫొటోలు, సలహాలు వైరలవుతున్నాయి. ఆ వివరాలు..

ప్రస్తుతం సమంత నటించిన చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో, విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే కంప్లీట్‌ అయ్యింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక చిత్ర బృందం.. సినిమా పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన నా రోజా పాట, ఆరాధ్య పాటలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ఇక ఆరాధ్య లిరికల్‌ వీడియో చూస్తే సమంత, విజయ్‌ల మధ్య కెమిస్ట్రీ ఏం రేంజ్‌లో వర్కౌట్‌ అయ్యిందో అర్థం అవుతుంది. ఈ పాటలో ఇద్దరి బెడ్రూం సీన్స్‌, రొమాంటిక్‌ ముమెంట్స్‌ అన్ని ఉన్నాయి. అయితే వీటిపై ట్రోలింగ్‌ కూడా అదే స్థాయిలో సాగుతోంది.

ఇక తాజాగా సమంత తన ఇన్‌స్టా స్టోరీలో ఖుఫీ పాటను షేర్‌ చేసింది. విజయ్‌ దేవరకొండతో కలిసి ఉన్న సీన్‌ని షేర్‌ చేస్తూ.. ఇలా మిమ్మల్ని కేరింగ్‌గా, ప్రేమగా చూసుకునే వాడిని ప్రేమించండి.. పెళ్లి చేసుకొండి అని సలహాలు ఇచ్చింది. ఇక విజయ్‌ దేవరకొండ కూడా నాకు కూడా ఇలాంటి లవ్వంటేనే ఇష్టం అని చెప్పుకొచ్చాడు. సమంత చేసిన పోస్ట్‌పై నెటిజనులు రకరకాలుగా స్పందిస్తున్నారు. సినిమాలు, కథల్లో మాత్రమే ఇలాంటివి సాధ్యం.. వాస్తవంలో బతకడం నేర్చుకొండి.. మీ భాగస్వామి మీకెప్పుడు బలం కావాలి కానీ.. బలహీనత కాకుడదు.. అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇక సమంత ప్రస్తుతం సినిమాల నుంచి లాంగ్‌ బ్రేక్‌ తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. చేతిలో ఉన్న ఖుషి, సిటాడెల్‌ ప్రాజెక్ట్‌లు పూర్తి చేసింది. కొత్త సినిమాలు ఏవి ఒప్పుకోలేదు. ఆల్రేడీ అంగీకరించిన సినిమాలకు సంబంధించి.. తీసుకున్న అడ్వాన్స్‌ వెనక్కి ఇచ్చింది. సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికి.. సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టీవ్‌గానే ఉంటుంది సమంత. మరి ఖుషి సినిమా ప్రమోషన్స్‌కు వస్తారో రారో తెలియదు. కానీ ప్రస్తుతం సోషల్‌ మీడియా వేదికగా బానే ప్రచారం చేస్తున్నారు సమంత. ఇక సామ్స్‌.. ప్రస్తుంత కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌కు వెళ్లారు. అక్కడ ఆమె అందరితో పాటు కింద కూర్చుని.. సింపుల్‌గా యోగా చేస్తోన్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి