iDreamPost

‘సలార్’కు ఎలివేషన్స్ ఇచ్చిన ఈ తాత ఎవరో తెలుసా?

  • Author singhj Published - 03:59 PM, Thu - 6 July 23
  • Author singhj Published - 03:59 PM, Thu - 6 July 23
‘సలార్’కు ఎలివేషన్స్ ఇచ్చిన ఈ తాత ఎవరో తెలుసా?

ప్రతి ఏడాది ఎన్నో వందల సినిమాలు విడుదల అవుతుంటాయి. అయితే వాటిల్లో కొన్ని మాత్రమే హిట్లు అవుతాయి. ఇంకొన్ని మాత్రమే సూపర్ హిట్లు అవుతాయి. బ్లాక్​ బస్టర్​ మూవీస్​ను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. సినీ పరిశ్రమలో సక్సెస్ రేటు చాలా తక్కువనేది కాదనలేని నిజం. అందుకే నిర్మాతలు, హీరోలు తమకు హిట్​ను అందించే దర్శకుల చుట్టూ తిరుగుతుంటారు. ఈ రోజుల్లోనైతే ఫామ్​లో ఉన్న డైరెక్టర్, స్టార్ హీరో కలసి సినిమా చేస్తే ఓపెనింగ్స్ అదిరిపోతాయి. అందుకే క్రేజీ కాంబోలను ఫిక్స్ చేసేందుకు ప్రొడ్యూసర్స్ తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. అలా ఫిక్స్ అయిన కాంబోలో వస్తున్న మూవీనే ‘సలార్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డాషింగ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతోందీ చిత్రం.

ఈ ఏడాది ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘సలార్’ ఒకటి. యాక్షన్​కు మారుపేరైన రెబల్ స్టార్ ప్రభాస్.. ‘కేజీఎఫ్​’తో హీరో ఎలివేషన్స్​, ఫైట్ సీక్వెన్స్​లను నెక్స్ట్​ లెవల్​కు తీసుకెళ్లిన ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అలాంటి ‘సలార్’ నుంచి ఎట్టకేలకు ఒక అప్​డేట్ వచ్చింది. ‘సలార్’ చిత్ర టీజర్ ఇవాళ ఉదయం విడుదలైంది. ప్రభాస్​ను పూర్తిగా చూపించకపోయినప్పటికీ ఇందులో ఆయన ఎంట్రీ అదిరిపోయింది. తన గత సినిమా ‘కేజీఎఫ్​ 2’లో మాదిరిగానే బ్లాక్ థీమ్​తో ఈ మూవీని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడని అర్థమవుతోంది. టీజర్​తో సినిమాపై మరింత ఎక్స్​పెక్టేషన్స్ పెంచేశారు మేకర్స్.

‘సలార్’ టీజర్​లో ఒకరు బాగా హైలైట్ అయ్యారు. ఇందులో ప్రభాస్ పాత్రకు ఎలివేషన్స్ ఇచ్చిన తాత మంచి అటెన్షన్ తీసుకున్నారు. ‘కేజీఎఫ్​ 2’లో యష్ క్యారెక్టర్​కు ఇచ్చినట్లే ‘సలార్​’లో ప్రభాస్ పాత్రకు ఒక తాతతో ఎలివేషన్స్ ఇప్పించారు ప్రశాంత్ నీల్. ఆ తాత పేరు టీనూ ఆనంద్. ‘సింహం, చిరుత, పులి, ఏనుగు చాలా ప్రమాదం.. కానీ జురాసిక్​ పార్క్​లో కాదు.. ఎందుకంటే అక్కడ ఉండేది డైనోసార్’ అనే డైలాగ్​తో ఆనంద్ అందర్నీ ఆకట్టుకున్నారు. తెలుగులో ఇప్పటికే పలు మూవీస్ చేసిన ఆయనకు.. ప్రభాస్​తో ఇది రెండో మూవీ కావడం గమనార్హం. ఇంతకుముందు రెబల్ స్టార్​ ‘సాహో’లో టీనూ ఆనంద్ యాక్ట్ చేశారు. తెలుగులో ఆయన మొదటగా నటసింహం బాలకృష్ణ ‘ఆదిత్య 369’ చిత్రంలో నటించారు. ఇక, మెగాస్టార్ చిరంజీవి ‘అంజి’లో భాటియా పాత్రలో తనదైన విలనిజంతో ప్రేక్షకులను బాగా మెప్పించారు ఆనంద్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి