iDreamPost

టిటిడి నాణేలకు మోక్షం కలగనుందా ??

టిటిడి నాణేలకు మోక్షం కలగనుందా ??

మొన్నటివరకు చాలామణి లో ఉన్న నాణేలను మార్చడానికి కొంత ఇబ్బంది పడిన తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు ట్రెజరీలో పేరుకుపోయిన చెల్లని నాణేల మీద దృష్టి పెట్టింది. రిజర్వ్ బ్యాంక్ అనుమతితో సేలంలో ఉన్న సెయిల్ ( స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ) ద్వారా చెల్లని 80 టన్నుల పాత నాణేలను కరిగించడానికి అనుమతి పొందింది.

నిత్యం స్వామి వారిని దర్శించుకొవడానికి వచ్చే వేలాదిమందికి భక్తులు భారీ ఎత్తున నగదు, బంగారం, వెండి, నాణేలు కానుకల రూపంలో స్వామి వారికి సమర్పించుకుంటారు. ఈ కానుకలను స్వామి వారి పరకామణి లో టిటిడి సిబ్బంది లెక్కపెడతారు. స్వామి వారికి హుండీ ద్వారా ఏటా దాదాపు 1300 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. ప్రతినిత్యం హుండీ కి సమర్పించే నాణేల విలువ దాదాపు 20 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో బయట బహిరంగ మార్కెట్లో చిల్లకు అంతగా డిమాండ్ లేకపోవడంతో, టిటిడి తన వద్ద ఉన్న చిల్లర నాణేలను మార్చడానికి బాగా ఇబ్బంది పడుతోంది.

కొత్తగా ఎన్నికైన టిటిడి బోర్డు ఇప్పుడు తమ వద్ద 30 కోట్లకు (నాణేల సంఖ్య) పైగా ఉన్న చిల్లర నాణేలపై దృష్టి సారించింది. బ్యాంకులను ఒప్పించి చెలామణి లో ఉన్న నాణేలను మార్పిడి చేస్తున్నప్పటికీ చెలామణిలో లేని నాణేలను మార్చడం టిటిడికి తలకు మించిన భారంగా మారింది. కారణం 2014 వరకు పాత పావలా నాణేలను తీసుకున్నప్పటికీ ఆ తర్వాత ఈ పావలా నాణేలు చెల్లకపోవడంతో బ్యాఅంకులు వాటిని తీసుకోవడానికి అంగీకరించలేదు. దానితో రోజు రోజుకి పాత నాణేల నిల్వలు పెరిగిపోవడంతో ఈ సమస్య జఠిలమైంది. ఈ సమస్య మీద దృష్టి సారించిన కొత్త పాలకమండలి తమవద్ద 80 టన్నులకు పైగా నిల్వ ఉన్న చెలామణిలో లేని నాణేలను మార్పించడానికి ఒక నిపుణుల కమిటీని నియమించింది.

ఆరు నెలల పాటు పరకామణి వ్యవహారాలను పరిశీలించిన ఈ నిపుణుల కమిటీ టిటిడి వద్ద 1 శతాబ్దం నుండి ఉన్న బంగారు వెండి రాగి నాణేలను గుర్తించింది. వాటిని జాగ్రత్తగా భద్రపరచాలని సూచించింది. ఇక చలామణి లో లేని మిగతా నాణేల విషయంలో రిజర్వు బ్యాంక్ అనుమతితో బహిరంగ మార్కెట్లో విక్రయించాలని మొదట భావించినప్పటికీ చట్టరీత్యా అది నేరం కావడంతో ఆ ప్రయత్నం విరమించుకుంది. అయితే చివరికి కేరళ లో ఉన్న సెయిల్ ని టిటిడి దగ్గర ఉన్న నాణేలను కొనాల్సిందిగా రిజర్వ్ బ్యాంక్ చూచిందింది. దాంతో టన్నుకు 30 వేల రూపాయల చొప్పున టిటిడి దగ్గర ఉన్న పాత అణా, అరా అణా, పది పైసలు, పావలా నాణేలను అల్యూమినియం, రాగి, ఇత్తడి నాణేలను కొనుగోలు చేసేందుకు సెయిల్ ముందుకొచ్చింది. దింతో టిటిడి వద్ద చెల్లుబాటులో లేని నాణేలకు మోక్షం లభించడంతోపాటు. టిటిడికి సెయిల్ ద్వారా ఆదాయం కూడా దక్కనుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి